Editorial

Saturday, May 18, 2024
కాల‌మ్‌జింబో ‘పెరుగన్నం’ : 'మరణించని' కథకుడు సాదత్ హసన్ మంటో

జింబో ‘పెరుగన్నం’ : ‘మరణించని’ కథకుడు సాదత్ హసన్ మంటో

Mantoఉర్దూ భాషలో గొప్ప కథారచయిత సాదత్ హసన్ మంటో అని చెబితే అతన్ని చాలా తక్కువ చేసినట్లుగా అనిపిస్తుంది. ప్రపంచ కథ ప్రపంచంలోనే గొప్ప కథారచయిత మంటో అని చెప్పడమే అతని గౌరవానికి తగినట్టుగా ఉంటుంది.

18  జనవరి 1955 రోజున లాహోర్ లో మంటో చనిపోయాడు. కానీ ఆయన రచనలను ప్రపంచమంతా చదువుతూనే ఉన్నారు. కథ బతికి ఉన్నంత కాలం అతను బ్రతికే ఉంటాడు.

జింబో

మన దేశంలోని పంజాబ్ రాష్ట్రంలోని సంబరాలలో 1912 మే 11న జన్మించాడు. మంటో కుటుంబం కాశ్మీర్ నుంచి పంజాబ్ వచ్చింది. న్యాయవాదుల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి సాదత్ హసన్ మంటో. అతని తండ్రి జడ్జిగా పని చేశాడు.

తన రెండు దశాబ్దాల సాహిత్య చరిత్ర లో 22 కథా సంకలనాలని 7 రేడియో నాటికలని, మూడు వ్యాస సంకలనాలని, ఒక నవలని రాశాడు.

రేడియోలో పని చేశాడు. సినిమాలకు పనిచేశాడు. సాహితీ రంగంలోని అన్ని ప్రక్రియల్లో ప్రవేశం ఉన్నప్పటికీ కథా రచయితగా అతని స్థానం స్థిరమైనది. .

ముస్లిం హైస్కూల్లో ప్రాథమిక విద్య అభ్యసించాడు. విచిత్రమైన విషయం ఏమిటంటే అతను పదవ తరగతిలో మూడు సార్లు ఫెయిల్ అయ్యాడు. అతను ఫెయిల్ అయింది ఉర్దూలో. కానీ ఆ తర్వాత అదే ఉర్దూలో గొప్ప శిల్పం తో మరపురాని కథలెన్నో రాశాడు.

దేశ విభజన జరిగినప్పుడు, జరిగిన సంఘటనలకి దారుణాలకు కళా రూపం ఇచ్చిన వ్యక్తి మంటో. ఆ రక్తపాత సంఘటనని కథల రూపంలో చెక్కిన శిల్పి అతను. ఆ కాలపు రచయితలు ఎవరూ చేయని పనిని చేసిన వ్యక్తి మంటో. అప్పటి సంఘటనలని కథారూపంలో మలిచాడు. అతని కథల్లో ముస్లింలు , హిందువులు, సిక్కులు వుంటారు. వారు చేసిన దారుణాలు వుంటాయి. వాటి గురించి అతను కథలు వ్రాశాడు. కానీ ఎటువైపు మొగ్గు లేదు. అదే విధంగా ముస్లింలు, హిందువులు, సిక్కుల గురించి కథలు వ్రాశాడు. కానీ ఎటు వైపు మొగ్గలేదు. న్యాయవాదులు న్యాయమూర్తులు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి మంటో. అందుకే అతను అంత నిష్పక్షపాతంగా ఉన్నాడని అంటారు.

సాహిత్యం జీవితాన్ని ప్రకటిస్తుంది అదేవిధంగా జీవితాన్ని వ్యాఖ్యానిస్తుంది.

జీవిత వాస్తవికతను కథను చేయాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. ఆ సాహసం ధైర్యం, తెగువ సాదత్ హసన్ మంటో కి ఉన్నాయి. ఆయన కథలే అందుకు నిదర్శనం.

మంటోకి ఏడు సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు మన దేశంలో జలియన్ వాలాబాగ్ ఉదంతం జరిగింది. ఆ రక్తపాతం మంటో మనసు మీద ఓ భయంకరమైన ముద్ర వేసింది.

అలా జీవితాన్ని ఆ విధంగా చెప్పినందుకు చాలా ఇబ్బందులకి గురైనాడు. ఆయన రచనల్లో అసభ్యత ఉందని విమర్శించారు. కానీ అతని రచనల్లో వున్న మానవీయత అతన్ని రచయితల్లో అగ్రగామిగా నిలిపింది. కథా రచనలో కొత్త ఒరవడికి నాంది పలికిన వ్యక్తిగా ఆయన చరిత్రలో నిలిచిపోయాడు.

తాను నివసిస్తున్న సమాజంలోని కట్టుబాట్లలోని మంచినీ చెడునీ రచయిత తన రచనల్లో చూపించాలి. ముఖ్యంగా అప్పుడున్న సమాజ జీవితాన్ని తన రచనల్లో చూపించాలి. మంటో రచనల్లో అతను ఉన్న సమాజం ఉంది .అందుకే ప్రజలు అతన్ని ప్రశంసిస్తూ అతని అడుగుజాడల్లో నడిచారు.

మంటోకి ఏడు సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు మన దేశంలో జలియన్ వాలాబాగ్ ఉదంతం జరిగింది. ఆ రక్తపాతం మంటో మనసు మీద ఓ భయంకరమైన ముద్ర వేసింది.

1920 నుంచి పంజాబ్ అమృత్ సర్ ప్రదేశాలు ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో సతమతమయ్యేవి. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఏదో ఉద్యమం జరుగుతూనే ఉండేది. 1930లో మంటో తండ్రి మరణించాడు.
అప్పుడు మంటో అమృత్ సర్ లోని విశ్వవిద్యాలయంలో డిగ్రీ చదువుతున్నాడు. ఉద్యమ వాతావరణంలోని సంఘటనను చూసి మంటో ఎంతో వ్యాకులం గా ఉండేవాడు. అలాంటి పరిస్థితుల్లో ఓ వ్యక్తి మంటోని సాహిత్యం వైపు రాజకీయాల వైపు నెట్టాడు. అతనే ప్రసిద్ధ ఉర్దూ రచయిత పెద్ద అబ్దుల్ బారి ఆలీగ్.

ఆయనే రష్యన్ ఫ్రెంచ్ సాహిత్యాలని అతను మంటోకి పరిచయం చేశారు. విక్టర్ హ్యూగో రాసిన ‘ది లాస్ట్ డేస్ ఆఫ్ కండెమ్నెడ్ మాన్’  ఉర్దూలో రాయమని కోరినాడు.

రెండు వారాల్లో మంంటో ఆ పని పూర్తి చేశాడు. ఆ తర్వాత ఆస్కార్ వైల్డ్ రాసిన ‘వీరా’ని అనువాదం చేశాడు. అప్పుడు రచయితగా మంటోకి చాలా గుర్తింపు వచ్చింది.

మంటోలోని రచనా శక్తిని చూసి కథలు రాయమని అలీ ఒత్తిడి చేశాడు. ఆ ఒత్తిడి ఫలితంగా కథలు రాయడం మొదలు పెట్టాడు. జలియన్ వాలా బాగ్ సంఘటనని ఆధారం చేసుకుని మొదటి కథని రాశాడు.

మంటో తన కథలని చాలా అరుదుగా తిరిగి రాసేవాడు. ఒకే ఒక్క సెట్టింగ్ లో కథని పూర్తి చేసేవాడు. అతి పెద్ద కథ ‘మమ్మీని’ కూడా ఒకే సిటింగ్ లో అతను పూర్తి చేశాడు.

అమృత్ సర్ లోని మసాబ్ దినపత్రికలో కొంతకాలం పనిచేశాడు మంటో. ఆ తర్వాత బొంబాయి నగరానికి చేరుకుని అక్కడ ముసావర్ అన్న సినీ వార పత్రిక లో పనిచేశాడు. 1939లో సఫియాను వివాహం చేసుకున్నాడు.

అమృత్ సర్ లోని మసాబ్ దినపత్రికలో కొంతకాలం పనిచేశాడు మంటో. ఆ తర్వాత బొంబాయి నగరానికి చేరుకున్నాడు. అక్కడ ముసావర్ అన్న సినీ వార పత్రిక లో పనిచేశాడు. హిందీ సినిమాకు స్క్రిప్ట్, డైలాగులు రాయడం ప్రారంభించాడు. 1939లో సఫియాను వివాహం చేసుకున్నాడు. కొంతకాలం ఢిల్లీలోని ఆకాశవాణిలో పనిచేశాడు. తిరిగి బొంబాయి చేరుకున్నాడు. బొంబాయి నగరాన్ని వదిలి పాకిస్తాన్ వెళ్లాలా వద్దా అన్న సందిగ్థంలో ఉన్న మంటో చివరికి పాకిస్తాన్ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కానీ అతని మనస్సు బొంబాయి నగరం మీదే ఉండిపోయింది. బొంబాయి నగరాన్ని వదిలి పెట్టడానికి కారణం అప్పుడు నెలకొని ఉన్న వాతావరణం, పరిస్థితులు.
ఈ విషయం గురించి ఇద్దరు మిత్రుల మధ్య జరిగిన ఆ సంభాషణ వింటే మన శరీరం గగుర్పొడుస్తుంది. బొంబాయిలో తాను గడిపిన చివరి రోజుల గురించి ఓ గొప్ప జ్ఞాపికని రాశాడు మంటో. దాన్ని తన చిరకాల మిత్రుడు సినిమా నటుడు శ్యామ్ కి అంకితం చేశాడు. అతను సినిమా షూటింగ్ లో చనిపోయాడు తర్వాత రెండు మూడు సంవత్సరాలకి మంటో కూడా మరణించారు.

మంటో రచనల్లో స్వయం ప్రేరణ, వాస్తవమైన జీవిత చిత్రణ కనిపిస్తాయి. తాను చూసిన జీవితాన్ని తన రచనల్లో చూపించాడు. వాస్తవికత అతని కథల్లోని ప్రత్యేకత. మరో రకంగా చెప్పాలంటే అతని కన్ను కెమెరాలోని షట్టర్ ఎప్పుడూ తెరిచే ఉంటుంది. జీవన దృశ్యాలని ఫోటోలుగా తీస్తుంది. మనుషుల్లోని వేదనని అతను శోధించాడు, గుర్తించాడు. తన కథల్లో చూపించాడు. అన్యాయానికి వ్యతిరేకంగా పేదరికానికి వ్యతిరేకంగా, వేదనకి వ్యతిరేకంగా మంటో కలం ఎత్తాడు. అతని దృష్టి అతని పరిశీలన చాలా లోతుగా ఉంటుంది.

18  జనవరి 1955 రోజున లాహోర్ లో మంటో చనిపోయాడు. పాకిస్తాన్ ప్రభుత్వం మంటో పేరు మిద పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేసింది. మంటో మరణించిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయన్నిపాకిస్తాన్ లోనే కాదు, ప్రపంచమంతా చదువుతున్నారు. మరీ ముఖ్యంగా మనదేశంలో చదువుతున్నారు.

ఈ గొప్ప రచయితకి ఎలాంటి అవార్డులు రాలేదు. బతికి ఉన్నప్పుడు రాలేదు. చనిపోయిన తర్వాత రాలేదు. అతని పేరు మీద ఎలాంటి అవార్డులు లేవు. ఏ యూనివర్సిటీ కి అతని పేరు పెట్టలేదు. కానీ అతని శత జయంతిని పురస్కరించుకుని పాకిస్థాన్ ప్రభుత్వం ఆ దేశ అత్యున్నత అవార్డు విషయాన్ని “నిశాన్-ఇ -ఇంతియాజ్”ని ప్రకటించింది.

మంటో లాగా ఎవరూ లేరు. అతను అవార్డులను ఎప్పుడూ ఇష్టపడలేదు. కానీ అతనికి అవార్డును ప్రకటించడం ద్వారా పాకిస్తాన్ ప్రభుత్వం తనని తాను గౌరవించుకుందని చాలా మంది అభిప్రాయం. ఆరు దశాబ్దాల క్రితం ఇవ్వాల్సిన దాన్ని ఇన్ని సంవత్సరాల తర్వాత ఇచ్చారని చాలా మంది భావించారు .

తన మరణానికి సంవత్సరం ముందు సమాధి మీద ఏమి రాసి ఉండాలో మంటో తనకు తనే రాసుకున్నాడు. అది నాలుగు వాక్యాల్లో ఉంటుంది. నిజానికి మంటో మరణించలేదు. కథ బతికి ఉన్నంత కాలం అతను బ్రతికే ఉంటాడు.

తన మరణానికి సంవత్సరం ముందు సమాధి మీద ఏమి రాసి ఉండాలో మంటో తనకు తనే రాసుకున్నాడు. అది నాలుగు వాక్యాల్లో ఉంటుంది. విచిత్రంగా అనిపించినా అది సత్యమని అతని కథలు చదివిన అందరికీ అనిపిస్తుంది.

“ఇక్కడ సాదత్ హసన్ మంటో ఉన్నాడు. అతనితోపాటు కథకి సంబంధించిన కళానైపుణ్యం, అద్భుతాలు అన్ని పాతిపెట్టబడ్డాయి. కొన్ని టన్నుల మట్టి కింద అతను ఉన్నాడు. దేవుని కన్నా తనే గొప్ప రచయిత అని ఆశ్చర్యపోతూ ఉన్నాడు”

మంటో రాసిన ప్రతి కథ మీదా మనం మాట్లాడుకోవచ్చు. ఒకటి రెండు కథల గురించి వచ్చేవారం మాట్లాడుకుందాం. మరీ ముఖ్యంగా ‘కోల్దెవో’ ( తెరువు) గురించి.

ఎములాడ ‘రాజేందర్’ పరిచయం

‘జింబో’ కలం పేరుతో సాహితీ లోకానికి చిరపరిచితులైన మంగారి రాజేందర్ కవీ, కథకులు. సామాన్యుల పక్షాన న్యాయ వ్యవస్థపై అనేక రచనలు వెలువరించిన ‘తరాజు’. తెలుపు కోసం ప్రతి ఆదివారం ‘కథా కాలమ్’ రాస్తున్నారు. వారి e-mail: rajenderzimbo@gmail.com

తొలి వారం కథనం ఇక్కడ క్లిక్ చేసే చదవవచ్చు. 2 వ వారం, ఆ రాత్రి అన్నం ముందు కూర్చున్నప్పుడు. ౩ వ వారం ఒక కథ ఎలా రూపు దిద్దుకుంది!.  4 వ వారం గుల్జార్ చెప్పిన కథ. 5 వ వారం పిల్లలే నయం. 6 వ వారం కథనం ఇది…కథలు దృక్పథాలని మారుస్తాయా? 7 వ వారం అమరావతి కథలు తెలుపు. 8 వ వారం పాల్ కొహెలో ‘పెన్సిల్ కథ’. 9 వ వారం ‘పదాల పాఠం’.

  • TAGS

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article