Editorial

Friday, May 10, 2024
కాల‌మ్‌జింబో కథాకాలం 'పెరుగన్నం' : ఈ వారం అమరావతి కథలు తెలుపు

జింబో కథాకాలం ‘పెరుగన్నం’ : ఈ వారం అమరావతి కథలు తెలుపు

నాకు సాహిత్యం పట్ల అభిరుచి ఏర్పడిన కాలంలో ఆంధ్ర జ్యోతి వారపత్రికలో అమరావతి కథలు చదివాను. పుస్తకరూపంలో వచ్చిన తర్వాత కూడా చదివాను. ఆనందపడ్దాను. ఈ వారం ‘పెరుగన్నం’లో కథల ప్రాధాన్యం గురించి నా అభిప్రాయాలు పంచుకుంటూ అమరావతి కథలను యాది చేసుకుంటాను.

జింబో

కథలు అనేకం. నిజానికి కథ అంటే కథే. కథలని వర్గీకరించకూడదని అంటూనే కథలని వర్గీకరిస్తారు. స్త్రీవాద కథ అని, మైనారిటీ వాద కథ అని, దళితవాద కథ అని ఇలా .. రకరకాలుగా వర్గీకరణలు కొనసాగుతూ ఉంటాయి. ఎవరు ఎన్ని పేర్లు పెట్టినా – యే కథలోనైతే జీవిత చిత్రణ ఉంటుందో, ఏ కథ లోనైతే మానవీయత ఉంటుందో, ఏ కథలో నైయితే హృదయం ఉంటుందో అదే నిలిచిపోయే కథ.

ఎవరైతే బాగా జీవిస్తారో, ఎవరైతే బాగా బాధ పడతారో, ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తారో, ఎవరైతే ఎక్కువగా ఆనందిస్తారో, వాళ్లే గొప్ప కథలు రాయగలరు. వాటికి ఏ పేరు పెట్టిన పర్వాలేదు.

తెలుగులో రకరకాల పేర్లతో కథలు వచ్చాయి. ఊరి పేర్లతో వచ్చిన కథలు వచ్చాయి. అవి అమరావతి కథలు కావచ్చు, వంశీ రాసిన పసలపూడి కథలు కావచ్చు. నేను రాసిన మా వేములవాడ కథలు కావచ్చు. నక్కా విజయ రామరాజు రాసిన భట్టిప్రోలు కథలు కావొచ్చు. గోపిని కరుణాకర్ రాసిన దీపం చెప్పిన కథలు కావచ్చు. పెన్నేటి కథలు కావచ్చు.

చలం జీవితాదర్శం నవల చదివిన తర్వాత భీమిలి చూడాలన్న కాంక్ష కలిగింది. అదే విధంగా అమరావతి కథలు చదివిన తర్వాత అమరావతిని చూడాలన్న కాంక్ష కలిగింది అలాగే అవి చూసాను.

మామూలుగా కథలు రాయడం వేరు, ఊరిని నేపథ్యం చేసుకొని కథలు రాయడం వేరు. ఎంతో హృదయ వేదన ఉంటే తప్ప ఊరి పేరుతో కథలు రాయలేరు.

నాకు సాహిత్యం పట్ల అభిరుచి ఏర్పడిన కాలంలో ఆంధ్ర జ్యోతి వారపత్రికలో అమరావతి కథలు చదివాను. పుస్తకరూపంలో వచ్చిన తర్వాత కూడా చదివాను. ఆనందపడ్దాను.

కొన్ని కథలు చదివినప్పుడు ఆ ప్రాంతాలను చూడాలన్న కాంక్ష కలుగుతుంది. చలం జీవితాదర్శం నవల చదివిన తర్వాత భీమిలి చూడాలన్న కాంక్ష కలిగింది. అదే విధంగా అమరావతి కథలు చదివిన తర్వాత అమరావతిని చూడాలన్న కాంక్ష కలిగింది అలాగే అవి చూసాను.

ఆవిధంగా కోరిక కలగడం సహజం. అవి చూసిన తర్వాత కొందరిలో కథల్లో మాదిరిగా, నవలల్లో చదివిన మాఫిరిగా ఫీలింగ్ కలగకపోవచ్చు. కానీ వాటిని చూశామన్న తృప్తి కలుగుతుంది. నేను వేములవాడ కథలు రాస్తున్న సమయంలో ఫొరెన్సిక్ సైన్స్ లాబ్ లో పని చేస్తున్న భారతి అనే సైంటిస్ట్ నా కథలు చదివి మా ఊరు వేములవాడా వెళ్లి వచ్చింది. ఈ విషయం నాతోనే కాదు. చాలా మందితో చెప్పింది. ఆమే కాదు, అలా మా వేములవాడ కథలు చదివి చాలా మంది మా ఊరు ని చూసి వచ్చారు.

ఎంతోమంది రచయితలు అక్కడ పుట్టి ఉంటారు. కానీ ఎవరూ అమరావతి కథలు రాయలేదు. అక్కడ వచ్చిన వరదని కూడా ఎంతో మంది చూసి ఉంటారు. కానీ సత్యం శంకరమంచి మాదిరిగా మిగతావాళ్లు చూడలేక పోయారు.

అమరావతి కథల నేపథ్యం గురించి సత్యం శంకరమంచి ఆ కథలు పుస్తక రూపంలో వచ్చినప్పుడు ఈ ఇలా వివరిస్తారు.

“ఓ సాయంకాలం వేళ సుబ్రహ్మణ్య శర్మగారు ఉన్నట్టుండి మీరు అమరావతి కథలు ఎందుకు రాయకూడదు “అన్నారు .

ఒక్క క్షణం అవాక్కయి పోయాను. ఎప్పటి మాట!

12 ఏళ్ల క్రితం జైపూర్ లో పని చేసేటప్పుడు అమరావతి కథల పేరిట కొన్ని కథలు రాద్దామని నోట్సు రాసుకోవడమేమిటీ, ఎవరో చెప్పినట్టు ఈయన అడగటం ఏమిటి, తేరుకొని వరుసగా నాలుగు కథలు అశువుగా చెప్పాను. ఆ రకంగా అమరావతి కథలు మొదలైనాయి.”

అప్పటికి ఎంతో మంది రచయితలు అమరావతిని చూసి ఉంటారు. ఎంతోమంది రచయితలు అక్కడ పుట్టి ఉంటారు. కానీ ఎవరూ అమరావతి కథలు రాయలేదు. అక్కడ వచ్చిన వరదని కూడా ఎంతో మంది చూసి ఉంటారు. కానీ సత్యం శంకరమంచి మాదిరిగా మిగతావాళ్లు చూడలేక పోయారు. అందుకే వరద లాంటి కథని వాళ్ళు రాయలేకపోయారు. అది చాలా చిన్న కథ. నేను ఇంకా క్లుప్తంగా ఆ కథ చెబుతాను.

ప్రళయం వచ్చి మన్ను మిన్ను ఏకమైనప్పుడు అన్ని కులాల వాళ్ళు ఒకటై ఒకరినొకరు కాపాడుకుంటారు. వాళ్లకి కులం కనిపించదు. మానవత్వం మాత్రమే కనిపిస్తుంది. బ్రాహ్మడికి మాలవాడు వడ్డించడం, అతను ఆనందంగా తినడం ఇందులోని కథ .

ఒక ఊరిని, ఆ ఊరిలో జరిగిన సంఘటనలని ఆ ఊరి మనుషులని కథలు చేయడం, ఆ ప్రాంతాన్ని ఆ ప్రాంతాన్ని కథామయం చేయడం అత్యంత అద్భుతమైన విషయంగా నాకనిపిస్తుంది. ఈ కథలు సత్యం గారి హృదయంలోంచి వచ్చిన కథలు. అందుకే ప్రతి హృదయాన్ని తాకుతాయి.

ఇదీ అందరూ అనుకునేదే. ఊహించేదే.

కానీ వరద వచ్చి ఆ పూటకి బురదని కడిగేసినా- ఆ తరువాత అంతా మామూలే. మామూలు పరిస్థితులు ఏర్పడిన తరువాత మనిషి మామూలే. “ఎన్ని వరదలొచ్చినా మనసు మాలిన్యం కడుగలేక పోతుంది.” అన్న వాక్యమే అమరావతి కథ.

ఇలా ఎన్నో కథలు. ఆ కథలన్నింటిని వివరించడం నా ఉద్దేశ్యం కాదు. ఒక ఊరిని, ఆ ఊరిలో జరిగిన సంఘటనలని ఆ ఊరి మనుషులని కథలు చేయడం, ఆ ప్రాంతాన్ని ఆ ప్రాంతాన్ని కథామయం చేయడం అత్యంత అద్భుతమైన విషయంగా నాకనిపిస్తుంది. ఈ కథలు సత్యం గారి హృదయంలోంచి వచ్చిన కథలు. అందుకే ప్రతి హృదయాన్ని తాకుతాయి. అదే జరిగింది నా లాంటి వాళ్ల విషయంలో. చిన్న పరిధిలో హృదయాన్ని తాకే కథలు చెప్పడంలోని నైపుణ్యం ఈ కథల్లో మనకు గోచరిస్తుంది

అమరావతి కథలని పేరే గాని ఇవి ఒక్క అమరావతికే పరిమితం కావు. అమరేశ్వరుడు గురించి రాసిన ఒక్క అమరేశ్వరుడికే పరిమితం కావు. కృష్ణవేణి గురించి రాసిన ఈ కథలు నదులకి వర్తిస్తాయి. ఒక్క వూరి గురించి రాసినా అన్ని ఊర్లోకి ఇవి వర్తిస్తాయి.

ఇదే విధంగా అవి పసలపూడి కథలు కావచ్చు. మా వేములవాడ కథలు కావచ్చు. భట్టిప్రోలు కథలు కావచ్చు. ఈ కథలు అన్ని ఊర్లకు వర్తిస్తాయి.

కథల అభిమాని పేదరాశి పెద్దమ్మ వద్దన్న దిక్కుకే ప్రయాణం చేస్తాడు

ఈ కథలు కాలానికి సంబంధించినవి. అవి కాలంతో పాటు వృద్ధిచెందుతాయి జీవితాల నుంచి ఆత్మని తాకుతాయి. కాలక్రమంలో కథలు అన్ని కాలాలకు చెందే కథలు అవుతాయి. అమరావతి కథలు అన్ని కాలాలకు చెందిన కథలుగా మారిపోయినవి.

పేదరాశి పెద్దమ్మ ఉందో లేదో తెలియదు. కానీ ఆమె కథలు ఉన్నాయి. మర్యాద రామన్న ఉన్నాడో లేదో తెలియదు. అతని కథలు ఉన్నాయి. బేతాళుడు ఉన్నాడో లేదో తెలియదు అతని కథలు ఉన్నాయి. ఈ క్రమంలో అమరావతి ఉంటుందో లేదో తెలియదు. కానీ అమరావతి కథలు ఉంటాయి. ఎందుకంటే ఆ కథలు విలువలకి ఓ రిజర్వాయర్ లాంటివి. భావోద్వేగానికి ప్రతిరూపాలు.

కథలను వర్గీకరించితే అవి రెండే రకాలు. అవి మరిచిపోయే కథలు. మరిచిపోని కథలు. అంటే గుర్తుండే కథలు. అందులో ఉన్న వాదం ఏదైనా పర్వాలేదు. అది మన మనసులో ముద్ర వేయగలగాలి. అలా ముద్ర వేసినప్పుడు అది ఏ కథ అయినా పర్వాలేదు. ఏ వాదంతో రాసిన కథ అయినా పర్వాలేదు. ఊరి పేరుతో రాసిన కథ అయినా పర్వాలేదు. అది ఏ ఊరు పేరుతో రాసిన కథైనా పరవాలేదు. ఏమైనా హృదయానికి తాకే కథలు కావాలి. కథల అభిమాని పేదరాశి పెద్దమ్మ వద్దన్న దిక్కుకే ప్రయాణం చేస్తాడు.

ఓ చిన్న కాన్వాస్ లో ఓ పెద్ద భావాన్ని, ఓ అనుభూతిని చెప్పడమే కథ . ఓ చిన్న కాన్వాస్ లో అమరేశ్వరుడి గురించి చెప్పినా, రాజేశ్వరుడి గురించి చెప్పినా తక్కువేమీ కాదు. పరిమాణం కాదు. దాని ప్రభావం ముఖ్యం అని ఆ భావన.

‘జింబో’ కలం పేరుతో సాహితీ లోకానికి చిరపరిచితులైన మంగారి రాజేందర్ కవీ, కథకులు. సామాన్యుల పక్షాన న్యాయ వ్యవస్థపై అనేక రచనలు వెలువరించిన ‘తరాజు’. తెలుపు కోసం ప్రతి ఆదివారం ‘కథా కాలమ్’ రాస్తున్నారు. తొలి వారం కథనం ఇక్కడ క్లిక్ చేసే చదవవచ్చు. రెండవ వారం, ఆ రాత్రి అన్నం ముందు కూర్చున్నప్పుడు. మూడోవారం ఒక కథ ఎలా రూపు దిద్దుకుంది!. నాలుగో వారం గుల్జార్ చెప్పిన కథ. ఇదో వారం పిల్లలే నయం.ఆరో వారం కథనం ఇది…కథలు దృక్పథాలని మారుస్తాయా?

ఎములాడ ‘రాజేందర్’ పరిచయం

వృత్తిరీత్యా జిల్లా సెషన్స్ జడ్జిగా, జ్యుడీషియల్ అకాడెమీ డైరెక్టర్ గా, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యునిగా పనిచేసి, పదవీ విరమణ చేసిన రాజేందర్ గారు అందరికీ న్యాయం అందాలని  కల్పనాత్మక రచనలతో పాటు వారు న్యాయం, ధర్మం గురించిన అనేక రచనలు చేస్తూ వస్తున్నారు. ఒక్క మాటలో అయన వృత్తీ ప్రవృత్తీ వ్యావృత్తీ అన్నీ కూడా రచనలుగా ఆవిష్కారం కావడం అదృష్టం అనే చెప్పాలి. 

ఎములాడ రాజన్న పాదాల ముందు జన్మించిన ఈ తెలంగాణ బిడ్డ ‘మా వేములవాడ కథలు’, ‘రూల్ ఆఫ్ లా’, ‘కథలకి ఆవల’, ‘ఓ చిన్న మాట’ వంటి కథా సంపుటులు వెలువరించారు. రాబోయే సంపుటులు “నాల్ల కోటు”, మా వేములవాడ కథలు-2″. కవిత్వానికి వస్తే ‘హాజిర్ హై’ అంటూ నేర న్యాయ వ్యవస్థపై మరే కవీ రాయలేని కవిత్వం రాసిన జింబో ‘లోపలివర్షం’, ‘చూస్తుండగానే’ పేరిట ఇతర కవితా సంపుటులు తెచ్చారు. ఈ మధ్య వచ్చిన కవితా సంపుటి -“ఒకప్పుడు” కాగా రాబోయే కవితా సంపుటి -“ఒక్క కేసు చాలు”.  ఇవి కాకుండా వారు చాలా పుస్తకాలని వెలువరించారు.  

జింబో e-mail: rajenderzimbo@gmail.com

 

 

 

 

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article