Editorial

Saturday, April 27, 2024
సంపాద‌కీయంమిగిలింది మనం – అతడి పాట : గద్దర్ పై తెలుపు సంపాదకీయం

మిగిలింది మనం – అతడి పాట : గద్దర్ పై తెలుపు సంపాదకీయం

ఇప్పుడంతా అయిపోయింది. కాసేపట్లో ఇవేవీ ఇక ఎన్నటికీ తెలియకుండా గద్దర్ ఆ మట్టి పొత్తిలిలో శాశ్వతంగా నిద్రకు ఉపక్రమిస్తాడు. మెల్లగా తన అణువణువూ ఆ భూదేవిలో కలిసిపోతుంది. మిగిలింది మనం, గద్దర్ పాట.

ఎర్రటి మట్టి. నీలాకాశం మధ్యన గోచి గొంగడి గాడిలా ఆ పాట పీడిత ప్రజలది. వారు ఉన్నంత దాకా ‘గద్దర్’ పేరు గుమ్మడి విఠల్ రావు కానే కాదు.

కందుకూరి రమేష్ బాబు

Kandukuri Ramesh Babu
Editor, Teluputv

గద్దర్ మరణించినట్లు తెలవగానే హాస్పిటల్ కు వెళ్ళడమే గాక గద్దర్ పార్థివ దేహాన్ని లాల్ బహుదూర్ స్టేడియంకు తరలించిన రేవంత్ రెడ్డి చివరి దాకా నిలబడినప్పటికీ ఇప్పటిదాకా గద్దర్ కు బాగా నివాళి అర్పించిన వారిలో తెలంగాణ ప్రభుత్వమే పై చేయిలో ఉన్నదని చెప్పాలి. మంత్రి కెటిఆర్ అసెంబ్లీలోనే నిన్న సంతాపం ప్రకటించడం విశేషం. తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ పేరిట ప్రకటన కూడా హుందాగా ఉన్నది. ప్రభుత్వం లాంచనాలతో అంత్యక్రియలు జరపడానికి తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావడం కూడా పూర్తిగా అభినందనలు అందుకునే విధంగా ఉంది. ఆ లాంచనానికి కుటుంబం అంగీకరించినందున ఇక ప్రభుత్వాన్ని తప్పు పట్టే పని ఎంతమాత్రమూ లేదు.

చివరాఖరికి ఆయన స్వతంత్రంగా ఉండేందుకే ప్రయత్నించారు. ఈ మధ్యే డిల్లీ వెళ్లి తానే ఒక రాజకీయ పార్టీని రిజిస్టర్ చేపించడం కూడా చూశాం. అట్లా గద్దర్ కన్నుమూసేటప్పటికీ తానే ఒక రాజకీయ పార్టీగా భావించారని మనం గమనించాలి.

నిజానికి గద్దర్ కి కెసిఆర్ ఎంతోకాలంగా అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం, ప్రగతి భవన్ లోకి రాకుండా చూసుకోవడం తెలిసిందే. అలాగే గద్దర్ కుమారుడి పేరిట నిర్మించ తలపెట్టిన గ్రంధాలయానికి మార్కెట్ ధర ప్రకారం స్థలం కేటాయించడం కూడా ఆయనకు నచ్చలేదు. ఇలాంటివి ఎన్ని ఉన్నప్పటికీ మొత్తంగా గద్దర్ ముఖ్యమంత్రి కెసిఆర్ పట్ల వ్యతిరేకంగా ఉన్నారు. అతడిని గద్దె దించాలని కంకణం కట్టుకున్నాడు కూడా. అందుకు కారణం ఎంతమాత్రం వ్యక్తిగతం కాదు, అది రాజకీయమే. తెలంగాణా రాష్ట్ర పరిపాలన ఉద్యమకారులు ఆశించిన తీరులో, నాటి ఉద్యమ లక్ష్యాలకు అనుగుణంగా సాగడం లేదని, అందుకు గాను కెసిఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని వారికి గట్టిగా ఉండింది. బాహాటంగా ఎన్నో ఇంటర్ వ్యూల్లో చెప్పారు కూడా. తాను కొంత కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా ఉన్నప్పటికీ, మోడీని ఎదుర్కొంటున్న యువనేత రాహుల్ ని ఇటీవలే అభిమానంగా ముద్దు పెట్టుకున్నప్పటికీ చివరాఖరికి ఆయన స్వతంత్రంగా ఉండేందుకే ప్రయత్నించారు. ఈ మధ్యే డిల్లీ వెళ్లి తానే ఒక రాజకీయ పార్టీని రిజిస్టర్ చేపించడం కూడా చూశాం. అట్లా గద్దర్ కన్నుమూసేటప్పటికీ తానే ఒక రాజకీయ పార్టీగా భావించారని మనం గమనించాలి.

ఇప్పటికీ అనేక కేసులకు హాజరు కావడం అతడిని క్రుంగదీశాయనే చెప్పాలి. వాటి నుంచి రక్షణ కోసం అతడు ప్రయాస పడటం ఈ నాలుగేళ్ళలో అతడిని ‘అటూ ఇటూ తిరిగే వాడి’గా చేసి ఉండవచ్చు. కానీ ఈ లోపు అనారోగ్యం అతడిని తనవైపు లాక్కొని ఆఖరి శిక్ష తానే వేయడం విషాదం.

ఐతే, గద్దర్ మావోయిస్టు పార్టీలో లేడు కనుక అతడిని విప్లవ కారుడు కాదని భావించలేం. అలాగే అతడిపై ఎన్నో కేసులు ఉన్నందున వాటినించి రక్షణకోసం ఆయన రాజకీయ పార్టీ ముఖ్య నేతల వద్దకు వెళ్ళడం, తన ప్రయత్నం తాను చేయడం కూడా తప్పు పట్టలేం. బహిరంగంగా కనపడటం వల్ల గద్దర్ ని చిన్నబోయెలా ఎన్నో అంటాం మనం. కానీ అతడు తీవ్ర ఒత్తిడికి గురయ్యాడన్నది మాత్రం నిజం. ఇప్పటికీ అనేక కేసులకు హాజరు కావడం అతడిని క్రుంగదీశాయనే చెప్పాలి. వాటి నుంచి రక్షణ కోసం అతడు ప్రయాస పడటం ఈ నాలుగేళ్ళలో అతడిని ‘అటూ ఇటూ తిరిగే వాడి’గా చేసి ఉండవచ్చు. కానీ ఈ లోపు అనారోగ్యం అతడిని తనవైపు లాక్కొని ఆఖరి శిక్ష తానే వేయడం విషాదం.

నిజానికి గద్దర్ దుఖం ఒక్కడిదే ఐనది. అతడిది స్వయంకృతంలా అనిపించే బహుజన వైఫల్యం. అణగారిన వర్గాల నిస్సహాయత.

నిజానికి గద్దర్ దుఖం ఒక్కడిదే ఐనది. అతడిది స్వయంకృతంలా అనిపించే బహుజన వైఫల్యం. అణగారిన వర్గాల నిస్సహాయత.

తాను సుదీర్గకాలం ఒక ప్రజా యోధుడు, ముఖ్యంగా ఒక సాయుధ మావొయిస్టు… వర్గపోరాటంలో తానొక కులం ప్రశ్న కూడా. అందులో ఆటా పాటా మాటా తూటా తాను. అదీనూ గొప్ప ప్రజాకర్షణ గల ‘యుద్ద నౌక’… తానే ‘జన నాట్యమండలి’ వంటి వాడుగా ఎదిగిన ‘ఆర్ట్ లవర్’. , అంతటి రాజకీయాలు వదులుకొని, అదీ తెలంగాణా ప్రజాక్షేత్రంలో… ఆ పార్టీకి దూరంగా ఉంటూ ఇన్నేళ్ళుగా మనగలగడం ఎంత కత్తిమీద సామో చెప్పడం కష్టం. అది పార్టీలో ఉన్నప్పటి తన ఆత్మకథ బాగం కన్నా ఎక్కువ గాయపరిచే అధ్యాయం.

ఇంకా మావోయిస్టు పార్టీ సంతాపం వెలువడలేదు. ఆ పార్టీ కూడా విరసంపై వచ్చిన స్పందన చూసి అచితూచి అడుగు వేస్తుందేమో చూడాలి.

కాగా, గద్దర్ మృతితో ప్రభుత్వం అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించడానికి ముందుకు రావడాన్ని ‘ఎన్నికల స్టంట్’ అని అనడం కూడా ఈ సందర్భంగా వృధా. ప్రభుత్వం ఆయనకున్న ప్రజాదరణ వల్ల గౌరవంగా చేయదగిన పని చేసింది. ఐతే, ఇప్పుడాయన మావోయిస్టు కాకపోవడం, బ్యాలెట్ పై విశ్వాసం చూపే రాజకీయాల్లో విశ్వాసంతో కొన్నేళ్లుగా ఉంటూ ఉండటం వారికి కలిసి వచ్చింది. అదే విప్లవ రచయితల సంఘాన్ని కాస్త ఇబ్బంది పెట్టింది. ఈ మధ్యాహ్నం విరసం ‘గద్దర్ లోని విప్లవ వాగ్గేయకారుడికి నివాళి’ అని అర్థ మనస్కంగా నివాళి అర్పించవలసి వచ్చింది. ఇంకా మావోయిస్టు పార్టీ సంతాపం వెలువడలేదు. ఆ పార్టీ కూడా విరసంపై వచ్చిన స్పందన చూసి అచితూచి అడుగు వేస్తుందేమో చూడాలి.
ప్రభుత్వం, విప్లవ పార్టీల వైఖరిలు ఇలా ఉండగా ప్రజలు మాత్రం స్వచ్చందంగా గద్దర్ అంతిమ యాత్రకోసం తరలి వస్తున్నారు. నిన్నటి నుంచి లాల్ బహుదూర్ స్టేడియం కు వచ్చారు. అక్కడి నుంచి ఈ ఉదయం గన్ పార్క్ మొదలు వారి అంతిమ యాత్ర వెన్నంటి వస్తున్నారు. ఈ సాయంత్రం భూదేవి నగర్ లో గద్దర్ అన్నని భోధి పాఠశాల ( దహనం చేయకుండా ) పూడ్చి పెడుతారని అంటున్నారు. మరి చూడాలి.

ఎర్రటి మట్టి. నీలాకాశం మధ్యన గోచి గొంగడి గాడిలా ఆ పాట పీడిత ప్రజలది. వారు ఉన్నంత దాకా ‘గద్దర్’ పేరు గుమ్మడి విఠల్ రావు కానే కాదు.

ఏమైనా గద్దర్’ జీవితంలో అన్ని వివాదాలే. అతడి జీవితం మాదిరే మరణాంతరం ఆయన జీవితం చర్చకు తావిస్తోంది. చిత్రమేమిటంటే, తెలంగాణా ఉద్యమంలో ఆయన చేసిన కృషికి ప్రభుత్వం సరైన తీరులో నివాళి అర్పించి తన పాత్ర నుంచి ఈ రోజు తప్పుకుంటుంది. మావోయిస్టు పార్టీ కూడా బహుశా తాను తమ పార్టీలో ఉన్నప్పటి రోజులను తలచుకొని ఘనంగా నివాళి అర్పిస్తుంది. ఆ తర్వాతి జీవితం గురించి తనకు పట్టినా పట్టక పోయినా దానికి ప్రేమ ఎందుకుంటుంది? కానీ ఇప్పుడంతా అయిపోయింది. కాసేపట్లో ఇవేవీ ఇక ఎన్నటికీ తెలియకుండా గద్దర్ ఆ మట్టి పొత్తిలిలో శాశ్వతంగా నిద్రకు ఉపక్రమిస్తాడు. మెల్లగా తన అణువణువూ ఆ భూదేవిలో కలిసిపోతుంది. మిగిలింది మనం, గద్దర్ పాట.

నిజం. ఆ పాట పొడుస్తున్న పొద్దులా సర్వదా విప్లవం.

ఎర్రటి మట్టి. నీలాకాశం మధ్యన గోచి గొంగడి గాడిలా ఆ పాట పీడిత ప్రజలది. వారు ఉన్నంత దాకా ‘గద్దర్’ పేరు గుమ్మడి విఠల్ రావు కానే కాదు.

అమరుడు ‘గద్దర్’ కి ప్రేమతో…ఇలా ‘తెలుపు’ సంపాదకీయం.

More articles

1 COMMENT

  1. ప్రజా యుధ్ద నౌక గద్దర్ కు సముచితమైన ,అద్భుతమైన నివాళి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article