Editorial

Sunday, April 28, 2024
కాల‌మ్‌ఇవాలో రేపో సౌర తుపాను – రేపేమో అంగారక - శుక్రగ్రహాల సంయోగం – సూరజ్...

ఇవాలో రేపో సౌర తుపాను – రేపేమో అంగారక – శుక్రగ్రహాల సంయోగం – సూరజ్ వి. భరద్వాజ్ తెలుపు

గంటకు 16 లక్షల కి.మీల వేగంతో దూసుకొస్తున్న సౌర తుపాను   

గమనిక. విశ్వంలో ఒక శక్తివంతమైన సౌరతుపాను 1.6 మిలియన్ కిలోమీటర్ల వేగంతో భూమిని సమీపిస్తోంది. ఈ తుఫాను ఇవాళ లేదా రేపు భూమిని తాకే అవకాశం ఉంది.

సూరజ్ వి. భరద్వాజ్

Spaceweather.com వెబ్ సైట్ ప్రకారం, సూర్యుని వాతావరణం నుంచి ఉద్భవించిన తుపాను సూర్యుడి వైపు ఉన్న భూమి స‌బ్‌-సోలార్ పాయింట్‌లో కేంద్రీకృత‌మైన‌ట్లు అమెరికాకు చెందిన స్పేస్ వెద‌ర్ ప్రిడిక్షన్‌ సెంటర్‌ తెలిపింది. ఈ సౌరతుపాను కారణంగా ఉత్తర లేదా దక్షిణధృవం వద్ద నివసిస్తున్న ప్రజలు ఆకాశంలో అందమైన ఖగోళకాంతి దృశ్యాన్ని చూడనుండటం విశేషం.

ఈ ప్రాంతాలకు దగ్గరగా నివసిస్తున్న ప్రజలు రాత్రిపూట ఆ అందమైన అరోరాను చూసే అవకాశం ఉంది.

అమెరికా అంతరిక్షసంస్థ నాసా ప్రకారం సౌరతుఫాను గంటకు 16 లక్షల కిలోమీటర్ల వేగంతో భూమివైపు దూసుకొస్తుంది. ఇంకా రానురాను దాని వేగం మరింత పెరగనుంది. ఈ సౌరతుఫానుల వల్ల ఉపగ్రహ సంకేతాలకు అంతరాయం కలగవచ్చని నాసా తెలిపింది.

స్పేస్ వెద‌ర్ ప్రకారం, సౌరతుఫానుల కారణంగా భూమి బాహ్య వాతావరణం భారీగా వేడెక్కే అవకాశం ఉంది. అలాగే, విద్యుత్ సరఫరాకు కూడా ఆటంకం కలుగుతుంది.

రేపు ఆకాశంలో అంగారక – శుక్రగ్రహాల సంయోగం

ఈ రెండు గ్రహాల మధ్య దూరం ఆధారంగా ఈ ప్రక్రియను శాస్త్రవేత్తలు వాటి మధ్య సంయోగం అనే అభివర్ణించడం విశేషం.

వినువీధిలో మార్స్, వీనస్ ల కంజంక్షన్ రేపు కనువిందు చేయనుంది. అర్ధరాత్రి దాటాక శుక్రుడు అంగారక గ్రహానికి ఉత్తరంగా 0.5° దూరంలో ప్రయాణించనున్నాడు. అంగారక – శుక్రగ్రహాలు జులై 13 వ తేదీ ఉదయం 3 గంటల ప్రాంతంలో ఒకదానికొకటి దగ్గరగా సమీపించబోతున్నాయి. ఆకాశంలో ఆవిష్కృతమైన 6 గంటల తరవాత ఈ రెండు గ్రహాలూ అత్యంత సమీపంలోకి వస్తాయి. అప్పుడు రెండింటి మధ్య 0° 28.1′ అతి తక్కువ దూరం ఉండనుంది.

ఆకాశంలో ఆవిష్కృతమైన 6 గంటల తరవాత ఈ రెండు గ్రహాలూ అత్యంత సమీపంలోకి వస్తాయి. ఆ సమయంలో రెండు గ్రహాల మధ్య దూరం చంద్రగోళం వ్యాసానికి సమానంగా ఉంటుంది.

ఈ గ్రహాలు సూర్యాస్తమయం తరవాత స్థానిక కాలమానం ప్రకారం పశ్చిమాన దిగువభాగంలో 45 నిమిషాలపాటు జంటగా కనిపిస్తాయి. ఆ సమయంలో రెండు గ్రహాల మధ్య దూరం చంద్రగోళం వ్యాసానికి సమానంగా ఉంటుంది. శుక్రుడు -3.9 పరిమాణంలో, అంగారకుడు 1.8 పరిమాణంలో ఉండి పశ్చిమ క్షితిజరేఖకు 16° ఉపరితలంలో ఒక గంటా 45 నిమిషాల పాటు కనిపించి, సూర్యాస్తమయం తరవాత కిందికి కుంగిపోతాయి.

మార్స్ – వీనస్ ప్లానెట్ల మధ్య చివరి సంయోగం 2019 ఆగస్టు 24 వ తేదీన జరిగింది. అప్పుడు వాటి మధ్య దూరం 0° 24′ గా ఉండింది. కాగా, మళ్లీ ఈ రెండు గ్రహాలు 2024, ఫిబ్రవరి 22 వ తేదీన అతి సమీపంగా దర్శనం ఇవ్వనున్నాయి. అప్పుడు వాటి మధ్య దూరం 0°38′ గా ఉండనుంది.

‘సూరజ్ వి. భరద్వాజ్ సీనియర్ జర్నలిస్టు. టెలివిజన్ జర్నలిజంలో ప్రత్యేక  ముద్ర ఉన్న వ్యక్తి. క్రైం  నుంచి పోలిటికల్ రిపోర్టింగ్ వరకు తనది చురుకైన పాత్ర. ప్రస్తుతం టి న్యూస్ బ్యూరోలో  పనిచేస్తున్న తాను ముఖ్యమంత్రి, సచివాలయ కార్యకలాపాలను ప్రజలకు అందజేస్తున్నారు. మంచి వాక్యం రాయగల అరుదైన ఈ టెలివిజన్ జర్నలిస్టు ‘తెలుపు’ కోసం సూరజ్’ కా సాత్వా ఘోడా పేరిట మనం చూస్తున్న లోకాన్నే సరికొత్తగా దర్శనం చేయిస్తారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article