Editorial

Tuesday, May 14, 2024
చిత్రకళగోపి గారి బోనాలు చిత్రం - నేపథ్యం తెలుపు

గోపి గారి బోనాలు చిత్రం – నేపథ్యం తెలుపు

బోనాల పండుగ సందర్భంగా ప్రసిద్ద చిత్రకారులు, ఇల్లస్ట్రేటర్ గా గొప్ప ప్రభావం చూపిన శ్రీ గోపి చిత్రించిన బొమ్మ తెలుపుకి ప్రత్యేకం.

కందుకూరి రమేష్ బాబు

కాపు రాజయ్య చిత్రించిన బోనాలు వర్ణచిత్రం మొన్న చూశారు కదా.  నేడు ప్రసిద్ద చిత్రకారులు గోపి చిత్రంచిన బొమ్మ చూడండి.

గోపి బొమ్మ అనగానే మన జ్ఞాపకాల్లో ఎన్నో చిత్రాలు… మనుషులు… వారి హావ భావాలు, కదలికలు గుర్తుకు వస్తాయి. నిజానికి అవన్నీ కథలకో మరో వాటికో అయన చిత్రించినవి. తనకోసం తాను వేసుకున్నవి మనం ఎక్కువ చూడలేదనే చెప్పాలి. ఇది వారి చిత్రాల్లో ప్రత్యేకమైనదే. చిత్రకారులు రమణా రెడ్డి సౌజన్యంతో మీకు అందిస్తున్నాం.

Gopi
sketch by Chitra

కాగా, గోపి అనగానే వారి ప్రత్యేకమైన బొమ్మల శైలి గుర్తుకు వస్తుంది. బాపు, చంద్ర మాదిరే గోపి గారి అక్షరం, సంతకం కూడా యాదికి వస్తుంది. కానీ వారి ముఖం, సామాజిక నేపథ్యం గురించి గుర్తు రాదు. పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు కూడా.

గోపి గారు అనేక వార, మాస పత్రికలకు వేసిన ఇల్లస్ట్రేషన్ల కారణంగా తెలుగు పాఠకులకు ఏంతో సుపరిచితులు. ఆత్మీయులు. బొమ్మల్లో వారి చురుకైన రేఖలు, అందలి లావణ్యం కారణంగా చూపరుల హృదయాలకు వారు ఎంతో దగ్గర. ఐతే, వారు సినీ రంగంలో ఎన్నో చిత్రాలకు పోస్టర్లు, టైటిల్స్‌ రూపకల్పన చేశారని తక్కువ మందికి తెలుసు. మా భూమి, రంగుల కల, దొంగల దోపిడి వంటి చిత్రాలకూ వారు పని చేశారు. ఆ సంగతి కొద్ది మందికే తెలుసు. ఇక వారి సామాజిక నేపథ్యం ఇంకా పరిమితంగా తెలిసి అవకాశం ఉంది.

గోపి గారు తెలంగాణ బిడ్డ. వారు గౌడ కులస్తులు. వారి అసలు పేరు లూసగాని గోపాల్ గౌడ్. తాను  పాలమూరులోని నాగర్ కర్నూలులో జన్మించారు. జె ఎన్ టి యు లో ఫైన్ ఆర్ట్స్ పూర్తి చేశారు.

ఈ వివరాలు చెప్పడం ఎందుకూ అంటే ఒక బొమ్మ వేయడం అంటే, జన జీవితం పలకడం అంటే సాన్నిహిత్యం ఉంటే ఒక తీరు. లేకపోతే మరొక తీరు ఉంటుందని చెప్పడానికి.

ఈ వివరాలు చెప్పడం ఎందుకూ అంటే ఒక బొమ్మ వేయడం అంటే, జన జీవితం పలకడం అంటే సాన్నిహిత్యం ఉంటే ఒక తీరు. లేకపోతే మరొక తీరు ఉంటుందని చెప్పడానికి. బోనాలు చిత్రం వేసిన కొద్ది మంది చిత్రకారుల్లో వారొకరు గనుక ఈ సంగతి పేర్కొనడం.

దురదృష్టవశాత్తూ ఆ చిత్రకారులు కోవిడ్ బారిన పడి ఇటీవలే అంటే మే 21న మరణించారు. లేకపోతే మరిన్ని బోనాల పండుగలను చూసి ఉండేవారు.

మరో విషయం. గోపి మాదిరే ప్రసిద్ద చిత్రకారులు శ్రీ లక్ష్మా గౌడ్, ప్రముఖ కేరికేచరిస్ట్ పామర్తి శంకర్ కూడా గౌడ కుటుంబంలో పుట్టి ‘గీత’ను ఆశ్రయించి గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించడం విశేషం.

సాధారణంగా సాహస ప్రవృత్తి మెండుగా గల ఈ కులస్తులు ప్రజలకు దగ్గరగా మెసలడం వల్ల జన జీవితాన్ని, వైవిధ్యాన్ని లోతుగా చూస్తారు. సన్నిహితులుగా ఉంటారు. ఎంతో విప్లవాత్మక ధోరణిలో తమదైన ముద్ర వేస్తారని ప్రతీతి. చిత్రంగా గోపి గారి బొమ్మలు లలిత లలితంగా ఉంటాయి. జానపద చిత్తాన్ని గొప్ప లావణ్యంతో ఆకర్షిస్తాయి. బోనాల సందర్భంగా వారిని యాది చేసుకోవడం ఒక తృప్తి.

More articles

1 COMMENT

  1. కొల్లాపూర్ తాలూకా ఎన్మన్ బెట్ల ఆయన స్వగ్రామం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article