Editorial

Sunday, May 19, 2024
ఆనందం'హో' : మారసాని విజయ్ బాబు తెలుపు

‘హో’ : మారసాని విజయ్ బాబు తెలుపు

Illustration : Beera Srinivas

జీవితంలో ఆపాదమస్తకం కుదిపేసే అపురూప ఆనంద క్షణాల గురించిన అనుభవగాథా సంపుటిలో “హో” ఎనిమిదో కథనం.

చిన్న వయస్సులోనే మహోజ్వల చరిత్ర సృష్టించిన ఒక అందమైన, అత్యాధునిక మానవుడి అపురూప స్మరణ, ఇరవై ఐదు అడుగుల కటౌట్ సాక్షిగా ‘హో’ పోస్టర్ రూపకల్పన.

మారసాని విజయ్ బాబు

విజయ్… పుస్తకం యెలా వచ్ఛిందో చూడు అన్నాడు సౌదా, వో కవర్ నాచేతికి అందించి. కవర్ లోంచి పుస్తకాన్ని తీశాను.

అపురూపం. భిన్నమైన సైజులో పుస్తకం చూడ ముచ్చటగా వుంది. తెలుగు సాహిత్యంలో అంతటి అందమైన పుస్తకాన్ని నేనెన్నడూ చూడలేదు. చాలా యిష్టంగా దాని ముఖ చిత్రాన్ని తడిముతూ యెంతో మురిసిపోయాను.

త్రిపురనేని శ్రీనివాస్ ఆముద్రిత క‌విత‌ల‌న్నిటినీ క‌లిపి ‘హో‘ పేరుతో తీసుకొచ్చిన సంక‌ల‌నమే యిది. అత్యాధునిక యంత్రపరిజ్ఞానంతో దానిని అద్భుతంగా తీర్చిదిద్దాడు సౌదా.

అనంతర కాలంలో తెలుగు సాహిత్య చరిత్రలో ‘హో’ పుస్తక ముద్రణ పెను సంచలనం సృష్టించిందనే విషయం అప్పటికి మాకు తెలియదు. ఆ సాయం సమయాన… తిరుపతి యెస్జీయస్ కళాశాల ముందు మేం కూర్చున్నాం.

పుస్తకావిష్కరణ సభ అదిరిపోవాలన్నాడు సౌదా.

యీ సభను సంచలనం చేద్దామన్నాడు బాలు.

చిత్తానూరు రవి మాట్లాడుతూ మనంచేసే యీ పని చరిత్రలో నిలచిపోవాలన్నాడు.

పుస్తక ముఖ చిత్రాన్ని 25 అడుగుల కటౌట్ చేయించి యెడ్ల బండిపై దానిని బస్టాండ్ దగ్గర నుంచి అంబేద్కర్ భవన్ వరకు ఊరేగిద్దాం అని అన్నాను నేను.

షెబాష్ అన్నారు మిత్రులు.

25 అడుగులు అంటే యీ బిల్డింగ్ యెత్తు వుంటుందా అని అడిగాడు సౌదా.

సౌదా, యెడ్ల బండిపై పెడుతాం కాబట్టి మొత్తం యెత్తు మూడంతస్థుల భవనం అంత వుంటుంది.

అవునా విజయ్ అని అందరూ సంబరపడ్డారు.

సభకు పూలన్ దేవిని యిన్వైట్ చేద్దామన్నాడు రవి.

ఆ మాటకు అందరం పగలబడి నవ్వాం. ఆ నవ్వల జలపాతం నుంచే అలాగే చేద్దామని అన్నారు బాలూ, సౌదా వొకేసారి.

ఆ వెనువెంటనే నేను విస్తుపోయాను. పుస్తకావిష్కరణ సభకు పూలన్ దేవిని పిలవడం యేమిటి అని ప్రశ్నించాను.

సరదాకులే విజయ్ అన్నాడు సౌదా.

పుస్తకావిష్కరణ సభకు త్రిపురనేని మధుసూదనరావును, శివసాగరుడిని పిలుద్దామని సూచించాడు రమేష్.

వోకే అన్నారు మిత్రులందరు.

ఆవిష్క‌ర‌ణ‌స‌భ 1998 జులై 27వ తేదీన తిరుప‌తిలోని అంబేద్క‌ర్ భ‌వ‌న్‌ ఆవరణలో నిర్వహించాలని తీర్మానించాం. వుదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు మాటలూ, పాటలు. A DAY LONG SESSION వక్తలు

ఆవిష్క‌ర‌ణ‌స‌భ 1998 జులై 27వ తేదీన తిరుప‌తిలోని అంబేద్క‌ర్ భ‌వ‌న్‌ ఆవరణలో నిర్వహించాలని తీర్మానించాం.

వుదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు మాటలూ, పాటలు. A DAY LONG SESSION వక్తలు

శవాల నాగయ్య
రుయా విజియుడు
లింగా ది గ్రేట్
కోనేటి ముఠా రవి
యింద్రవెల్లి రమేష్
బాలు
త్రిపురనేని శ్రీనివాస్
కుప్పిలి పద్మ
చంద్రశ్రీ
బి. చంద్రశేఖర్
కె. శ్రీనివాస్
త్రిపురనేని మధుసూదన రావు
శివసాగర్

వుదయం 9 గంటలకు బస్టాండ్ నుంచి అంబేద్కర్ భవన్ కు వూరేగింపు. వాల్ పోస్టర్ ను వొమేగా ఆఫ్ సెట్ ప్రింటర్ లో ప్రింట్ చేయాలనుకున్నాం.

వుదయం యెనిమిది గంటలకు ఆ షాపు వద్దకు అందరం చేరుకున్నాం.

యే త్రీ సైజ్ వెయ్యి పోస్టర్లుకు మూడు వేల రూపాయలు అవుతాయని షాపు యజమాని అన్నాడు.

నేను మిత్రులను పక్కకు పిలిచాను.

చాలా యెక్కువ చెబుతున్నాడు. ఆ ధరకు కలర్ పోస్టర్లు వేయవచ్చని చెప్పాను.

యిక్కడ కలర్ పోస్టర్లు ప్రింట్ చేసేవాళ్లు లేరు కదా అన్నాడు రమేష్.

మద్రాసుకెళ్లి వేసుకొస్తా అని చెప్పాను నేను.

వోకే విజయ్ మూడు వేలు కాదు. యెంతైనా కానీ కలర్ పోస్టర్లే వేద్దాం అన్నాడు సౌదా. అలాగే మనలో యెవరు యేపనైనా చెయ్యనీ. డబ్బులు గురించి ఆలోచించకండి. అది బాలూ, నేనూ చూసుకుంటాం.

యెవరెవ్వరూ యేం పని చేస్తారో,  దానికి యెంతవుతుందో చెప్పండి. లెక్కలు చెప్పాల్సిన పనికూడాలేదు. దానిని మీరు దేనికి ఖర్చుపెడుతారో మీ అభీష్టం అని అన్నాడు. చాలకపోతే అడగండి అన్నాడు.

లెక్కలు చెప్పాల్సిన పనిలేదన్న… లెక్కలేనితనంతో అన్న మాట యెంతో హయిగా అనిపించింది.

ఆ రాత్రి మేం నిద్రపోలేదు. సరదాగా మాట్లాడుకుంటూ కాలం గడిపేశాం. పొద్దున అయిదింటికే మిత్రులు నన్ను మద్రాస్ బస్సు ఎక్కించారు. ‘హో’ పుస్తకం చేతపట్టుకుని తొమ్మిదింటికే మద్రాస్ నగరం చేరుకున్నాను.

ఆ రాత్రి మేం నిద్రపోలేదు. సరదాగా మాట్లాడుకుంటూ కాలం గడిపేశాం.

పొద్దున అయిదింటికే మిత్రులు నన్ను మద్రాస్ బస్సు ఎక్కించారు.

‘హో’ పుస్తకం చేతపట్టుకుని తొమ్మిదింటికే మద్రాస్ నగరం చేరుకున్నాను.

నేరుగా మోంట్ రోడ్లో కలర్ పోస్టర్స్ వేసే చోటుకు వెళ్లాను.

గతంలో అక్కడ సినిమా పోస్టర్లు వేయించాను.

దాని యజమాని నన్ను యెంతో ఆత్మీయంగా ఆహ్వానించాడు.

25 × 30 సైజు వాల్ పోస్టర్ 2500 వందలకే ప్రింట్ చేస్తామన్నారు.

హో పుస్తకం, మేటరు ఆయన చేతికిచ్చి ప్రింట్ చేయమన్నాను.

25×30 సైజులో దీని లే అవుట్ చేసుకుని రావాలన్నాడు.

వోకే నేను లే అవుట్ చేయగలను. నాకు మేటర్ ప్రింట్ యివ్వండి అని అడిగాను.

మా దగ్గర తెలుగు పాంట్స్ లేవన్నారు ఆయన.

యెక్కడుంటాయి అని అడిగాను.

సరిగా తెలియదు. అందరూ లే అవుట్ ముందుగా చేసుకునే మా వద్దకు వస్తారు. మాకెపుడూ ఆ అవసరం రాలేదు. మంట్ రోడ్ లోనే వుండచ్చు. అడగండి అని సలహా యిచ్చాడు.

వోకే అంటూ మంట్ రోడ్ పై అడుగిడాను. యెక్కడడిగినా లేవంటున్నారు.

ముందుకు వెళుతూనే వున్నాను.

మట్టమధ్యాహ్నమైనా తెలుగు పాంట్స్ జాడ కనిపించలేదు.

నిజానికి ఆ స్థితిలో చాలా బేజారయిపోవాలి.

అలా జరగలేదు. మరింత రెట్టించిన వుత్సాహంతో నా అన్వేషణ కొనసాగింది.

బహుశా మనం యెంతో యిష్టమైన పనిచేస్తున్నపుడు శరీరాని అలుపు రాదు కాబోలు.

యింతలో యెదురుగా వో బార్ కనిపించింది. లోనికి వెళ్లాను. యేసి కావడంతో వొక్కసారిగా స్వర్గంలోనికొచ్చిన అనుభూతి కలిగింది.

వో మూల నున్న టేబుల్ వద్దకు వెళ్లి కూర్చున్నాను.

బేరర్ రాగానే బీరు, చేపల ఫ్రై తెమ్మన్నాను.

హో పుస్తకం వోపెన్ చేశాను.

కవితలు పైకే చదివాను.

అది బారు. యెవడి లోకంలో వాడిదే.

వాడే రాజు

వాడే పేద

యేం రాశాడ్రా… పుస్తకాన్ని ముద్దెట్టుకున్నాను.

యింతలో బేరర్ బీరు తీసుకొచ్చాడు.

తాగుతూ… చదువుకుంటూ… వో మధుర భావనలోకి జారిపోయాను.

అలా రెండు గంటలు గడచిపోయాయి. మటన్ బిరియాని అక్కడే తినేశాను.

మళ్లీ వెతకులాట మొదలైంది… వచ్చీ రాని అరవ మాట్లాడుతూ…

సాయంత్రానికి తెలిసింది.

టీనగర్ లో పాండ్స్ దొరుకుతాయని.

హృదయాంతరంలోంచి సంబరం యెగసింది.

పోస్టర్ చూసిన అందరూ ‘హో’ అని నినదించారు. ఆ నినాదం ఆకాశంలోకి దూసుకుపోయింది. అద్భుతం అన్నాడు సౌదా.

ఆంధ్రజ్యోతి దినపత్రికలో సబ్ యెడిటర్ అనుభవంతో నాక్కావాల్సిన సైజుల్లో మేటర్ తీసుకున్నాను.
కత్తెర తీసుకుని చకచకా లే – అవుట్ చేసేశాను. వెంటనే తీసుకొచ్చి ప్రింటర్ కు యిచ్చేశాను.
రాత్రి తొమ్మిదింటికి పోస్టర్లు యిచ్చేశారు.

ఆంధ్రజ్యోతికి ఫోన్ చేసి…సౌదా పోస్టర్లు ప్రింట్ అయిపోయాయి. బయలుదేరుతున్నాను. రెండింటికల్లా తిరుపతిలో వుంటాను అన్నాను.

విజయ్… వచ్చేయ్… అన్నాడు సౌదా.

అనుకున్న ప్రకారమే తిరుపతికి రెండింటికల్లా చేరుకున్నాను.

అప్పటికే మా మిత్రులు వచ్చిన ప్రతి బస్సునూ చూస్తున్నారు. నేను దిగుతానని.

నన్ను చూసి హో అని ఆహ్వానిస్తూ… పోస్టర్లను దించుకున్నారు.

రిక్షా తీసుకుని కేశవానిగుంటలోని సౌదా వాళ్ల యింటికి పోస్టర్ల తీసుకెళ్లాం.

ఆ పార్శిల్ ని బాలూ వోపెన్ చేశాడు.

పోస్టర్ చూసిన అందరూ ‘హో’ అని నినదించారు.


ఆ నినాదం ఆకాశంలోకి దూసుకుపోయింది.

అద్భుతం అన్నాడు సౌదా.

ఆ అద్భుతం యెంతో యిష్టంగా నన్ను పెనవేసుకుంది. యెంత సంతృప్తి. మనసు గాలిలో ఆనందంగా చక్కర్లు కొట్టింది.

మారసాని విజయ్ బాబు  రైతుబిడ్డ. పుట్టింది చిత్తూరు జిల్లా మంగినాయనిపల్లిలో.  స్వతహాగా ఆర్టిస్ట్. సాహిత్యంపై అభిలాషతో కథలు రాశారు. అలాగే మహత్తర జీవిత కాంక్షను రగిలించే తాత్వికతతో ‘కొత్తగీతలు’ అన్న నవలను అందించారు. పైగా సీనియర్ పాత్రికేయులు. ‘సహచర’ సమాంతర ఆలోచనల సామాజిక వేదిక వ్యవస్థాపకులు. జీవితానుభవంలో ఎగసిపడిన ఆనందోత్సాహాలను, అందలి తాత్వికతను వారం వారం ‘ఆపాదమస్తకం’ శీర్షిక ద్వారా అందిస్తారు. పాత వాటి కోసం కింద క్లిక్ చేసి చదవండి.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article