Editorial

Sunday, May 19, 2024
Pictureనలుపు తెలుపు విశిష్టత : 'కళ్ళు రఘు' తెలుపు 

నలుపు తెలుపు విశిష్టత : ‘కళ్ళు రఘు’ తెలుపు 

రూట్స్ కాలేజీ ఆఫ్ డిజైన్ ఫిలిం & మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోటోగ్రఫీ ప్రదర్శన ప్రారంభిస్తూ ప్రసిద్ద సినిమాటోగ్రాఫర్ ‘కళ్ళు రఘు’ గారు నలుపు తెలుపు ఛాయచిత్రం ఎందుకు మనల్ని అమితంగా ఆకర్శిస్తుందో చెప్పి ఆశ్యర్య పరిచారు. నిజంగా ఆ సమాధానం ఫోటోగ్రఫీ మాధ్యమం గొప్పతనాన్నే కాదు, మానవుడి సృజనాత్మకత ఎంత విశిష్టమో తెలుపు…

కందుకూరి రమేష్ బాబు

“నిజానికి నేను మొదట ఫోటోగ్రాఫర్ నే. తర్వాతే సినిమాటోగ్రాఫర్ ని. కెమికల్ డిష్ లో ప్రింట్ చేసిన ఫొటోగ్రాఫ్ మెల్లగా డెవలప్ ఆవుతూ ఉండటాన్ని ఏంతో విభ్రమంగా చూస్తూ అట్లా ఫోటోగ్రఫీ మాధ్యమంతో ప్రేమలో పడ్డాను. మొదట స్టిల్ లైఫ్ అటు తర్వాత కదిలే చలనచిత్రం వైపు మొగ్గు చూపాను” అంటూ ఎంతో అభిమానంగా ప్రసంగించిన ఎం.వి. రఘు గారు ఆ తర్వాత ప్రదర్శనలో ఉంచిన చిత్రాలు ఒక్కక్కటి చూస్తూ ఒక్కపరి నలుపు తెలుపు చిత్రం వద్దకు వచ్చి ఆగిపోయారు.

అకస్మాత్తుగా ఎందుకు బ్లాక్ అండ్ వెయిట్ చిత్రం మనల్ని అంతగా ఆకర్షిస్తుందీ అని అడిగారు! ఆ ప్రశ్న వేసిన కళ్ళు రఘు దానికి సమాధానం ఇస్తూ “నలుపు తెలుపు ఛాయచిత్రం మానవుడి అత్యుత్తమ సృజన” అని కూడా అభివర్ణించడం విశేషం.

వారు నలుపు తెలుపు ప్రభావం ఎందుకో తెలుపే ముందు రెండు మాటలు రఘు గారి గురించి…

మాడపాక వెంకట రఘు లేదా ఎం.వి. రఘు అంటే వెంటనే మనం పోల్చుకోలేము. ఆయన్ని కళ్ళు రఘు అంటేనే ఎవరైనా గుర్తు పడుతారు.

ఈ సినిమా తనకే కాదు, నటుడు చిదంబరంకు కూడా ప్రత్యేకం. అతడి పేరుకు ముందు ఉన్న కళ్ళు ఈ సినిమా నుండే వచ్చాయి.

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పేరు గాంచిన ఎన్నో అవార్డులు, రివార్డులు పొందిన ప్రముఖ ఛాయాగ్రాహకుడు, దర్శకులూ ఐన రఘు గారు వివిధ భాషలలోయాభైకి పైగా సినిమాలకు,10 డాక్యుమెంటరీలకు ఛాయగ్రాహణం చేశారు. వారు రెండు సినిమాలకు దర్శకత్వం చేయంగా అందులో ‘కళ్ళు’ అతడి ఇంటిపేరుగా మారిపోవడం విశేషం. ఈ సినిమా తనకే కాదు, నటుడు చిదంబరంకు కూడా ప్రత్యేకం. అతడి పేరుకు ముందు ఉన్న కళ్ళు ఈ సినిమా నుండే వచ్చాయి.

వారు విజయ వాహిని స్టూడియోలో కేమెరా విభాగంలో చేరి ఒక సంవత్సరం పాటు వందలాది సినిమాటోగ్రాఫర్ల పనితీరును, సినిమాల చిత్రీకరణ విధానాన్ని సన్నిహితంగా పరిశీలించి సహాయ దర్శకుడిగా తన ప్రస్థానం మొదలెట్టారు. చిత్రకారుడు బాపు తీసిన భక్త కన్నప్ప సినిమా సినిమాటోగ్రాఫిలో తన తొలి సినిమా కాగా జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ముద్ద మందారంకి కూడా తాను పని చేయడం విశేషం.

1984 సంవత్సరములో విడుదలైన వంశీ సినిమా సితార ఎం.వి.రఘు కంటికి, తన అంతర్ దృష్టికి పూర్తి పని చెప్పిందని చెప్పాలి. ఇందులో వారు నిర్వహించిన అద్భుత ఛాయగ్రహణానికి ముగ్ధులు కాని వారుండరు. అలాగే దర్శకత్వ ప్రతిభకు అచ్చెరువొందని వారుండరు. దక్షిణ భారత దేశ సినిమా చరిత్రలో మొదటిసారిగా గుండ్రటి పట్టాలఫై ట్రాలి మీద కెమేరా వుంచి చిత్రీకరణ జరిపే విధానానికి రఘు గారు ఈ సినిమాతోనే ప్రసిద్ధి చెందారు. చెప్పదలచిన అంశానికి అవసరమైన సాంకేతికతను సామాగ్రిని  జోడించడంలో ఎంతో లోతైన వారి దృష్టి మెచ్చతగినది.

స్వాతిముత్యం, సిరివెన్నెల గురించి తప్పక పేర్కొనాలి. అవి రెండూ అమాయకత్వపు అసాధారణత్వానికి, అంతచక్షువుల విశాల దృష్టికి నిదర్శనాలు. ఆ తర్వాత ‘అన్వేషణ’ తెలుగు ప్రేక్షకులని మరో స్థాయిలో అనుభూతికి గురిచేసింది. ఈ సినిమాటోగ్రాఫర్ ఎవరా? అని అరా తీసి తనని గుర్తుపెట్టుకొనేలా చేసింది. తర్వాత చెప్పుకోదగిన సినిమాలెన్నో ఉన్నా స్వాతిముత్యం, సిరివెన్నెల గురించి తప్పక పేర్కొనాలి. అవి రెండూ అమాయకత్వపు అసాధారణత్వానికి, అంతచక్షువుల విశాల దృష్టికి నిదర్శనాలు. ఇవన్నీ ఆయనకు గొప్ప పేరు తెచ్చాయి.

ఇవన్నీ ఎందుకు పేర్కొనడం అంటే ఆయనకు చిత్రం, చలన చిత్రం, రంగుల చిత్రమే కాకుండా నలుపు తెలుపు చిత్రం గురించిన అవగాహనే కాదు, దాని మూలం ఎరుక అని చెప్పడానికి.

ఇవన్నీ ఇలా ఉండగా గొల్లపూడి మారుతీరావు గారు రచించిన ‘కళ్ళు’ నాటకం ఆధారంగా తీసిన సినిమా మరొక గొప్ప విజయం. అది చూపరుల గుండెలను తాకిన సినిమా. దృశ్యం, మాట, పాట – వీటన్నిటితో  చలింప జేసిన చలన చిత్రం అనే చెప్పాలి. చాయగ్రహణంతో పాటు తన దర్శానికతకు మంచి రుజువు. కళ్ళు తర్వాత రఘు గారు దర్శకత్వం వహించిన రెండో సినియా రాజశేఖర్ నటించిన ‘ఆర్తనాదం’. ఇవన్నీ ఎందుకు పేర్కొనడం అంటే ఆయనకు చిత్రం, చలన చిత్రం, రంగుల చిత్రమే కాకుండా నలుపు తెలుపు చిత్రం గురించిన అవగాహనే కాదు, దాని మూలం ఎరుక అని చెప్పడానికి.

తనతో పాటు గౌరవ అతిథులుగా వచ్చిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ల ముందు ఒక చిన్న ప్రశ్న అడిగారు. ఎందుకు నలుపు తెలుపు ఫోటో మనల్ని ఆకర్షిస్తుందని అడిగి విస్మయ పరిచారు. అందరి మదిలో వేర్వేరు సమాధానాలుండగా అసలు సంగతి చెప్పారు రఘు గారు.

ప్రస్తుతం ఒక ఫిలిం, సినిమోగ్రఫీ సంస్థ ఫ్యాకల్టీ డీన్ గా ఉన్న రఘు గారు నిన్న హైదరాబాద్ లోని రూట్స్ కాలేజీ ఆఫ్ డిజైన్, ఫిలిం & మీడియా నిర్వహించిన ఫోటోగ్రఫీ ప్రదర్శన ప్రారంభానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తనతో పాటు గౌరవ అతిథులుగా వచ్చిన ప్రముఖ ఫోటోగ్రాఫర్లు విశ్వేందర్ రెడ్డి, నల్లి రవి, సత్యప్రసాద్ యేచ్చేంద్ర, కందుకూరి రమేష్ బాబు వంటి వారి ముందు ఒక చిన్న ప్రశ్న అడిగారు. ఎందుకు నలుపు తెలుపు ఫోటో మనల్ని ఆకర్షిస్తుందని అడిగి విస్మయ పరిచారు. అందరి మదిలో వేర్వేరు సమాధానాలుండగా అసలు సంగతి చెప్పారు రఘు గారు.

“వందలాది రంగుల చిత్రాల్లో ఒక్క నలుపు తెలుపు చిత్రం కనిపించిందా…ఆగిపోతం. దాన్ని పదే పదే ఆసక్తిగా చూస్తాం. ఎందుకూ అంటే ఇది లేదు. ఒక కల్పన. ఇది కేవలం ఒక సాంకేతికత వల్ల ఒనగూడిన ఫలితం. ఫోటోగ్రఫీ మీడియం మాత్రమే సృష్టించిన అద్భుతం.”

“సృష్టి అంతా రంగుల మయమే. ఎక్కడా నలుపు తెలుపు లేదు. ఒక్క ఫోటోలో తప్పా…” చెప్పారాయన.

“సృష్టి యావత్తూ రంగుల మయమే. కానీ మనం చూస్తున్న వాటిల్లో ఒక్క ఫోటో మాత్రమే మన నిజ జీవితంలో లేనిది. బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఒక్కటే జీవితాన్ని రంగులను కాదని నలుపు తెలుపులో చూపుతుంది. ఘాడమైన జీవితానుభవాన్ని పంచుతుంది. దాన్ని చూడగానే వెంటనే విస్మయంతో ఆ చిత్రం వద్ద మన కళ్ళు నిలిచిపోతాయి. ఎందుకూ అంటే ఒక్క ఫోటోలో తప్పా ఎక్కడా అటువంటి వాస్తవికత లేదు. అందుకే నలుపు తెలుపు చాయచిత్రం మానవుడి అత్యున్నత సృజనకు ప్రతీక..” చెప్పారాయన.

“వందలాది రంగుల చిత్రాల్లో ఒక్క నలుపు తెలుపు చిత్రం కనిపించిందా…ఆగిపోతం. దాన్ని పదే పదే ఆసక్తిగా చూస్తాం. ఎందుకూ అంటే ఇది లేదు. ఒక కల్పన. ఇది కేవలం ఒక సాంకేతికత వల్ల ఒనగూడిన ఫలితం. ఫోటోగ్రఫీ మీడియం మాత్రమే సృష్టించిన అద్భుతం.”

“ప్రతి దాన్నీ రంగుల్లో చూసే లోకం అకస్మాత్తుగా సదరు అంశం నలుపు తెలుపుల్లో దర్శనం ఇచ్చేసరికి విస్మయంతో, విబ్రాంతితో చూడటంలో నిమగ్నమైతాం. ఇది కేవలం మానవుడు ఫోటోగ్రఫీ మాధ్యమం ద్వారా సృష్టించిన వింత. అందుకే నలుపు తెలుపుఛాయాచిత్రం మీద మనకు అంత ఆసక్తి” అని విడమర్చి చెప్పారాయన. వారు చెప్పిన మీదట అందరూ ఒక కొత్త అనుభూతికి లోనవడం విశేషం.

ప్రదర్శన అనంతరం రూట్స్ కాలేజీ అధినేత శ్రీ బి.పి పడాల ‘కళ్ళు రఘు’ గారిని శాలువాతో ఆత్మీయంగా సత్కరించడం విశేషం. ఈ కార్యక్రమాన్ని ఫోటోగ్రఫీ విభాగం బాధ్యులు శ్రీకాంత్ నిప్పట్ల ఘనంగా నిర్వహించారు.


ప్రదర్శన అనంతరం రూట్స్ కాలేజీ అధినేత శ్రీ బి.పి పడాల ‘కళ్ళు రఘు’ గారిని శాలువాతో ఆత్మీయంగా సత్కరించడం విశేషం. ఈ కార్యక్రమాన్ని ఫోటోగ్రఫీ విభాగం బాధ్యులు శ్రీకాంత్ నిప్పట్ల ఘనంగా నిర్వహించారు.

నిజానికి ఇది గత నెల ఆగస్టు 19న జరిగిన ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన పోటిలో ఎంపికైన చిత్రాల ప్రదర్శన. ఆ చిత్రాలను త్వరలో  సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేస్తామని కూడా వారు తెలిపారు.

More articles

2 COMMENTS

  1. మంచిపోస్ట్. అభినందనలు.

    నలుపుతెలుపులు ‘కల్పనే’. కాని, అద్భుతాలు లేకపోలేదు. నిశిరాతిరి నక్షత్రాలు, వెన్నెలలో నందివర్థనం, మల్లెలు, సన్నజాజులు …
    నలుపు – తెలుపుల వైభవాలే.

    నలుపుతెలుపుల ఫిలిం ప్లేట్స్, రోల్స్, ప్రింటింగ్ పేపర్ తయారు చేసే ILFORD ;
    ‘అర్థరాత్రి. నల్లపిల్లి.నల్లబొగ్గు. అన్ని ఛాయలూ చూడండి’ అనే ప్రకటనలతో ఆకట్టుకునేది.

    😊

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article