Editorial

Saturday, May 18, 2024
కథనాలుఒక మనిషి జీవితకథ : వాడ్రేవు చినవీరభద్రుడు తెలుపు

ఒక మనిషి జీవితకథ : వాడ్రేవు చినవీరభద్రుడు తెలుపు

మొన్న కుమార్ కూనపరాజు మా ఇంటికి వచ్చి తాను రాసిన ‘ఎమ్మెస్ నారాయణ జీవిత కథ’  ఇచ్చి వెళ్తే, ఆ రాత్రే ఏకబిగిన పుస్తకం మొత్తం చదివేసాను. తీరా చదివిన తర్వాత, అది ఒక కమేడియన్ జీవితకథగా కన్నా, ఒక సినిమా రచయిత జీవితప్రయాణం అనే కన్నా, ఒక తెలుగు లెక్చెరర్ ఉద్యోగ ప్రస్థానం కన్నా, ఒక మనిషి జీవితకథ అనిపించింది.

వాడ్రేవు చినవీరభద్రుడు

నా చిన్నప్పుడు ఆరో తరగతో ఏడో తరగతో చదువుకునే రోజుల్లో, మా అక్క నన్నొకసారి కాకినాడలో మిస్సమ్మ సినిమాకు తీసుకువెళ్ళింది. ఆ రోజు మాతో పాటు, మా అక్క స్టూడెంట్, ఒకామె కూడా వచ్చింది. ఆమె టీనేజ్ లో ఉన్న అమ్మాయి. సినిమా మధ్యలో ఇంటర్వెల్ లో మేం బయటకు వచ్చినప్పుడు, ఆ అమ్మాయి, ఎంతో ముద్దుగా, మురిపెంగా ‘ఎంటీరామారావు ఎంత బావున్నాడక్కా, కళ్ళు తిప్పుకోలేకపోయాను ‘ అంది. నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఇదేమిటీ, అక్కినేని నాగేశ్వర్రావుకదా, ఎంత ఉషారుగా ఉన్నాడు, ఎంత సరదాగా ఉన్నాడు, ఎంత పడి పడి నవ్విస్తున్నాడు, అతణ్ణి వదిలిపెట్టి ఎన్ టి రామారావు అంటుందేమిటి అని. ఆమె ఆ రోజు ఎన్ టి రామారావుని చూసి ఎందుకు సొమ్మసిల్లిపోయిందో నాకు ఆ తర్వాత కొన్నేళ్ళకు అర్థమయింది. కానీ నేను నాగేశ్వర్రావు దగ్గరే (మావాడే, మంచి డిఫెక్టివ్ అని ఎస్.వి.రంగారావు చెప్పిన డైలాగు దగ్గరే) ఆగిపోయాను. తెలుగు సినిమాల్లో కమేడియన్లే నిజమైన హీరోలనీ, హీరోలు కమేడియన్లనే ఒక అభిప్రాయం నుంచి నేనిప్పటికీ బయటపడలేకపోయాను.

చాలాసార్లు ప్రయాణసమయాల్లో నా తీరిక సమయపు వ్యాపకం కూడా అదే. బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, పృథ్వీరాజు- నా జాబితా చాలా పెద్దది. ఇక శివారెడ్డి మిమిక్రీ వీడియోలు నేనెన్నిసార్లు చూసి ఉంటానో చెప్పలేను.

మరీ పూర్వకాలం వదిలిపెట్టండి, ఇప్పటి తెరమీద కూడా, కనిపించే ప్రతి ఒక్క కమేడియన్ కీ నేను వీరాభిమానిని అని చెప్పుకోడానికి నాకేమీ సంకోచం లేదు. ఒకప్పుడు నార్త్ ఈస్ట్ కి చెందిన ఐ.ఏ.ఎస్ అధికారి ఒకాయన మాకు స్పెషల్ ఛీప్ సెక్రటరీగా ఉండేవాడు. ‘నాకు మీ తెలుగు సినిమా కమేడియన్లంటే చాలా ఇష్టం. ఆఫీసు నుంచి ఇంటికి వెళ్ళాక వాళ్ళ సినిమాలు చూడటమే నా పని ‘ అనేవాడు. నాకు తెలిసిన మరొక అధికారి, చాలా సమర్థవంతుడు, నీతిపరుడు, ఆయన ఇంటినుంచి సెక్రటేరియట్ కి బయల్దేరగానే, యూ ట్యూబ్ లో తెలుగు కామెడీ ట్రాక్ లు పెట్టుకుని వింటూంటాను అని చెప్పాడు. చాలాసార్లు ప్రయాణసమయాల్లో నా తీరిక సమయపు వ్యాపకం కూడా అదే. బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, పృథ్వీరాజు- నా జాబితా చాలా పెద్దది. ఇక శివారెడ్డి మిమిక్రీ వీడియోలు నేనెన్నిసార్లు చూసి ఉంటానో చెప్పలేను.

తెలుగు కమేడియన్ల మీద నాకు చాలా ఆరోపణలు ఉన్నాయి. చాలాసార్లు వాళ్ళ హాస్యం వెకిలి స్థాయి దాటి వల్గర్ కి చేరుకుంటూ ఉంటుందనీ, ముఖ్యంగా పోలీసుల్నీ, ఉపాధ్యాయుల్నీ పనిగట్టుకుని మరీ అవహేళన చేస్తూంటారనీ నాకు కష్టంగా ఉంటుంది. కానీ, పూర్తి బీభత్సంగా మారిపోయిన తెలుగు సినిమాలో, పూర్తి అసంబద్ధంగా మారిపోయిన తెలుగు సామాజిక మనఃస్థితిలో వాళ్ళు చాలా సార్లు చల్లని నీడలు.

తీరా చదివిన తర్వాత, అది ఒక కమేడియన్ జీవితకథగా కన్నా, ఒక సినిమా రచయిత జీవితప్రయాణం అనే కన్నా, ఒక మనిషి జీవితకథ అనిపించింది. ఇంకా అంతకన్నా కూడా, ఒక గాంధేయవాది జీవితకథగా కనిపించి నన్ను నివ్వెరపరిచింది.

అందుకని మొన్న కుమార్ కూనపరాజు మా ఇంటికి వచ్చి తాను రాసిన ‘ఎమ్మెస్ నారాయణ జీవిత కథ’ (సాహితి, 2017) ఇచ్చి వెళ్తే, ఆ రాత్రే ఏకబిగిన పుస్తకం మొత్తం చదివేసాను. తీరా చదివిన తర్వాత, అది ఒక కమేడియన్ జీవితకథగా కన్నా, ఒక సినిమా రచయిత జీవితప్రయాణం అనే కన్నా, ఒక తెలుగు లెక్చెరర్ ఉద్యోగ ప్రస్థానం కన్నా, ఒక మనిషి జీవితకథ అనిపించింది. ఇంకా అంతకన్నా కూడా, ఒక గాంధేయవాది జీవితకథగా కనిపించి నన్ను నివ్వెరపరిచింది.

చిన్నప్పుడు లైబ్రరీనుంచి దొంగతనంగా తెచ్చుకుని చదువుకున్న సత్యశోధన అతని జీవితంలో, కాదు, వంట్లో ప్రవహిస్తున్న రక్తంలో భాగమైపోయిందనడానికి, ఆ ఆత్మకథలో ఎన్నో దృష్టాంతాలున్నాయి. గాంధీ పట్ల నమ్మకం ఆయనకు ఒక ఐడియాలజీలో భాగంగా రాలేదు. కామన్ సెన్స్ లో భాగంగా వచ్చింది. అందుకని, ఆయన తన జీవితపు మామూలు అనుభవాల్లో గాంధీని ఎలా అనుసరించాడో చూడటం నాకు చాలా చకితానుభవంగా ఉంది.

నా ఆశ్చర్యాన్ని, సంతోషాన్ని పంచుకోడానికి చాలా పేరాలూ, ఎన్నో పేజీలు ఆ పుస్తకంలోంచి ఎత్తి రాయవచ్చు. కానీ, ఈ ఒక్క అధ్యాయం మాత్రం పూర్తిగా ఎత్తిరాస్తున్నాను. చూడండి.

ఇండియా నుంచి కొత్తగా వచ్చారా అన్నాడు. నేను ఆశ్చర్యపోయా. మీరెలా గుర్తించారు అని అడిగా. మీ పోలికను బట్టి అన్నారు. ఇండియా గురించి మీకేమైనా తెలుసా అన్నాను. కొంచెం తెలుసు. గాంధీ తెలుసు, గవాస్కర్ తెలుసు.

ఇద్దరు ఐ ఎ ఎస్, ఐ పి ఎస్. ఒకాయన యాక్టివ్, మిగ్లినవారు రిటైర్డ్. నాకో పార్టీ ఇచ్చారు. దాంట్లో ఒక ఐ ఏ ఎస్ ఆఫీసర్ నేను వెళ్ళిన దగ్గర్నుంచి ఆయన స్టార్ట్ చేసిన టాపిక్ ఏంటంటే గాంధీని తిట్టడం. కూర్చున్న దగ్గరనుంచీ గాంధీని తీట్టడం మొదలుపెట్టారు. ఆయన అభిప్రాయం ఏంటంటే మన భారతదేశం కరప్ట్ అయిపోయింది. ఈ రాజకీయ నాయకులందరూ తినేస్తున్నారు. మంచిన సపోర్టు చేయడం లేదు. అదే బ్రిటీషువాళ్ళుంటే ఈ పాటికి పెద్దపెద్ద రోడ్లుండేవి. దేశం బాగుండును అని ఆయన మొదలుపెట్టాడు. అది విచ్ఛిన్నం చేసినవాడు గాంధీ. వాడొక యూస్ లెస్ ఫెలో అని తిట్టాడు.

నేను ఆయన్ని ఏమనగలను? మనకు పిలిచి పార్టీ ఇచ్చాడు. నేను వాళ్ళందరిముందూ చిన్నవాడిని, చిన్నవాడిని అంటే మెంటల్ గానో, ఫిజికల్ గానో అంటే అది వేరే మేటర్. కట్ చేస్తే- ఆయన బాయ్ ని పిలిచి 1000 రూపాయల నోటిచ్చి మందు తీసుకురా అన్నాడు. ఆ సార్న్ ని ఆపి మీరు ఆ వెయ్యి రూపాయల నోటు ఇవ్వద్దమండి. గాంధీగారు మీ దృష్టిలో పనికిరానాయన. ఆయన బొమ్మ దాని మీద ఉంది. ఆది మీరు ఆనర్ చెయ్యొద్దు సార్. అది చింపేసి మిగిలిన నోటివ్వండి అన్నా. అలా ఎలా చేస్తారు అన్నాడు. ఇవ్వండి సార్ ఏంటీ మీకో అభిప్రాయం ఉంది, మిగిలిన నోటు పనికిరాదా, అతని బొమ్మ లేకుండా, తెమ్మనండి అన్నా. ఆయన గ్రహించారని ఈవాళ నేననుకుంటున్నా. ఆయన మాట్లాడలా. అది కాదండీ అన్నాడు. నో ప్రాబ్లెం అండీ నేను తెప్పిస్తాను. నాకు గాంధీ అంటే గౌరవం,. చింపకుండా డబ్బులిచ్చి నేను తెప్పిస్తాను అన్నాను.

ప్రపంచదేశాల్లో ప్రతి కరెన్సీ మీద రాజు మారితే రాజు బొమ్మేస్తారు. మంత్రి మారితే మంత్రి బొమ్మేస్తారు. భారతదేశం ఒక్కటే గాంధీ బొమ్మ మొదలెట్టిన తరువాత దేశం నశించిపోయేవరకూ అంటే ప్రళయం వచ్చినా సరే ఎప్పటికైనా సరే ఈ బొమ్మ వేస్తుంది. అందుకుఏ గాంధీ ఈజ్ గ్రేట్. ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ గ్రేట్ అని చెప్పా.

నాది చాలీచాలని చదువండీ. నాకు వచ్చింది నేను చెప్తా. బ్రిటీష్ సామ్రాజ్యాన్ని ఏలుతున్నప్పుడు మొదటి స్వాతంత్య్రం తీసుకువచ్చింది గాంఢీ, ఆయన గురించి తప్పుగా మాట్లాడటం ఫూలిష్ నెస్స్. అల్టిమేట్ హూమన్ బీయింగ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. గాంధీని తిట్టడం ఫ్యాషన్. దానికి ఈజ్ ఈక్వల్ టు అనాగరికత అని నేననుకుంటే తిట్టనివ్వండి. గాంధీని తిట్టినోడు నన్ను తిడితే ఎంత గ్రేట్ నేను! ఆ ఆలోచన మనకెందుకు? అప్పుడు నువ్వు పుట్టలేదు. నువ్వు ఎదుర్కోలేదు. కానీ ప్రపంచదేశాల్ని గడగడలాడిస్తున్న ఒక బ్రిటిష్ వాడు ఆయుధం లేకుండా, చొక్కాలేకుండా, బూట్లు లేకుండా వున్న ఒక బక్కోడ్ని చూసి గడగడలాడిపోయి పారిపోయాడే అది నువ్వు ఎందుకు ఆలోచించవు? ప్రతివాడికీ ఒక ఫ్యాషన్ సార్. ఎవడు గొప్పవాడైతే వాణ్ణి తిడితే నేను వాడికన్నా గొప్పోణ్ణని ఒక ఫ్యాషన్. వాళ్ళు ఫూల్స్, స్టుపిడ్స్. నువ్వు ఒక పన్జెయ్యి. ఆయనకంటే గొప్పవాడుగా నువ్వు చేసిపెట్టు. గాంధీ ఏం చేసాడయ్యా తొక్క, నేను చేస్తాను చూడు ఇప్పుడు ఇండియా ఎలా ఉందో అను, అన్నాను.

తెలుగు సినిమావాళ్ళల్లో కమేడియన్లే నిజమైన హీరోలని నామటుకు నాకు మరోసారి రుజువయ్యింది.

మొదటిసారి అమెరికా వెళ్ళినప్పుడు న్యూయార్క్ నగరంలో నా మిత్రునితో క్వీన్స్ నుంచి మన్ హాటన్ సబ్ వే ట్రైన్ లో వెళ్ళాం. బహుశా ఓ అరగంట ప్రయాణం. రకరకాల మనుషులు ఎక్కారు. నేను అందరినీ పరిశీలిస్తున్నాను. నా పక్కాయన నన్ను పలకరించాడు. ఇండియా నుంచి కొత్తగా వచ్చారా అన్నాడు. నేను ఆశ్చర్యపోయా. మీరెలా గుర్తించారు అని అడిగా. మీ పోలికను బట్టి అన్నారు. ఇండియా గురించి మీకేమైనా తెలుసా అన్నాను. కొంచెం తెలుసు. గాంధీ తెలుసు, గవాస్కర్ తెలుసు. ఈ మధ్య సచిన్ తెలుసు అన్నాడు. నా ఆశ్చర్యానికి అంతులేదు. నాకు రాజకీయాలు పరిచయం లేదుగానీ గాంధీ ఇండియాకి శాంతియుతంగా స్వాతంత్య్రం తెచ్చాడని విన్నాను అన్నాడు. నేను కరీబియన్ అయిలండ్స్ నుంచి వచ్చాను. అందుకే క్రికెట్ అంటే ఇష్టం, ఇండియన్ క్రికెట్ స్టార్స్ తెలుసు అన్నాడు. నాకు అప్పటికీ, ఇప్పటికీ బాధ అనిపిస్తూనే ఉంటుంది. ప్రపంచం గాంధీని నెత్తిన పెట్టుకుంటే మనం ఏమిటి గాంధీని ఎగతాళి చేస్తున్నాం అని.

అందుకే గాంధీ టాపిక్ వస్తే నేను మనిషిని కావడానికి కొంతసేపు పడుతుంది. (పే.150-51)

***

తెలుగు సినిమావాళ్ళల్లో కమేడియన్లే నిజమైన హీరోలని నామటుకు నాకు మరోసారి రుజువయ్యింది.

వాడ్రేవు చినవీరభద్రుడు కవి, రచయిత, చిత్రకారులు. పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉన్నతాధికారి. వారి నిన్నటి వ్యాసం ‘పంచాగ్ని మధ్యంలో ప్రశాంతంగా విరబూసిన పద్మం’ ఇక్కడ క్లిక్ చేసి చదవవచ్చు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article