Editorial

Wednesday, May 1, 2024
Serial'రక్ష' – చివరి అధ్యాయం : Mission Completed

‘రక్ష’ – చివరి అధ్యాయం : Mission Completed

నిన్నటి కథ

కిడ్నాపర్లు ఇంజక్షన్ చేయడానికి వీలుగా రక్ష మౌనంగా తన జబ్బను ఉంచింది. ఎంతో అనుభవం ఉన్న దానిలా ఆ ఆడ మనిషి ఇంజక్షన్ ఇచ్చింది. తరవాత వాళ్లిద్దరూ క్యాబిన్ వైపు వెళ్లిపోయారు.

“వీళ్లు ఇక్కడి నుంచి నిన్ను నాగార్జునసాగర్ తీసుకుని వెళతారు. అక్కడి నుంచి హైద్రాబాద్లో ఉన్న వాళ్ల స్థావరానికి తీసుకుని వెళతారు. అక్కడే మీ అమ్మా, నాన్నా, వీళ్ల నాయకుడూ ఉన్నారు. ఇందాక వాళ్లు అటువెళ్లి మాట్లాడుకున్న మాటలు విన్నాను. ఇక నువ్వు హాయిగా విశ్రాంతి తీసుకో,” చెప్పింది మోక్ష.

రక్ష కళ్లు నిదానంగా బరువెక్కుతున్నాయి. నిద్ర ముంచుకుని వస్తోంది… తర్వాత ఏమైందో చదవండి…

ఇరవై ఒకటో అధ్యాయం : చివరి భాగం

డా.వి.ఆర్.శర్మ

హైదరాబాద్ కు సరిహద్దుల్లో రోడ్డుకు కుడిపక్క నుంచి దిగి, ఎత్తుగా పెరిగిన నీలగిరి చెట్ల మధ్య నుంచి మట్టిబాటలో ఎనిమిది కిలోమీటర్ల ప్రయాణం తరవాత ఆరు ఎకరాల మామిడి, జామ, మరికొన్ని ఇతర చెట్లున్న తోట అది. ఆ తోటకు పడమటి చివర కట్టిన ఒక ఫాం హౌజ్ ఉంది. టెర్రకోట ఇటుకలతో నిర్మించిన డూప్లెక్స్ కాటేజ్ లా కనిపిస్తుంది అది. కానీ, దాని కింది భాగంలో ఎప్పుడో వందేళ్ల కిందట నిర్మించిన పెద్ద గది ఉందనేది ఒక రహస్య విషయం.

ఆ తోటలోకి కానీ, ఆ ఫాంహౌజ్లోకి కానీ బయటివాళ్లకు సాధారణంగా ప్రవేశం ఉండదు. యజమాని అమెరికాలో ఉంటాడు. ఆ ఫాం హౌజ్ ను చూసుకోవడానికి నలుగురు మనుషులు, మేనేజర్ మాత్రమే అక్కడ ఉంటారు. వాళ్లు సాధారణంగా అక్కడి నుంచి బయటి ప్రపంచంలోకి వెళ్లరు. అది ఇతరులకు దూరంగా ఒక ఒంటరి ద్వీపంలా ఉంటుంది. రక్షను అక్కడి వాళ్లకు అప్పగించి, ఆమెను అక్కడికి తెచ్చిన వాళ్లు వెళ్లి పోయారు.

ఎవరో తట్టి లేపుతుంటే మెలకువ వచ్చి, కళ్లు తెరిచింది రక్ష. ఎదురుగా పొట్టిగా, లావుగా ఉన్న వ్యక్తి నిలబడి ఉన్నాడు. తెల్లటి బట్టలు వేసుకున్నాడు. కళ్లకు నల్లటి కళ్లద్దాలు ఉన్నాయి.

ఎవరో తట్టి లేపుతుంటే మెలకువ వచ్చి, కళ్లు తెరిచింది రక్ష. ఎదురుగా పొట్టిగా, లావుగా ఉన్న వ్యక్తి నిలబడి ఉన్నాడు. తెల్లటి బట్టలు వేసుకున్నాడు. కళ్లకు నల్లటి కళ్లద్దాలు ఉన్నాయి. అతనికి వెనక వైపున్న మెట్ల రెండు పక్కలా ఇద్దరు మనుషులు కండలు తిరిగిన శరీరాలతో అంగరక్షకుల్లా కనబడుతున్నారు. గదిలో ట్యూబ్ లైట్ వెలుగుతోంది. అతడి ఎడమ చేతిలో రక్ష బ్యాగులోంచి తీసిన పెట్టె, కుడి చేతిలో ఆ పెట్టె లోంచి తీసి పట్టుకున్న తాటాకుల పుస్తకం ఉన్నాయి.

నేటితో ‘రక్ష’ నవల పూర్తవుతోంది. ‘తానా’ – ‘మంచి పుస్తకం’ సంయుక్తంగా ఏర్పాటు చేసిన పిల్లల నవలల పోటీల్లో ఈ నవల ఉత్తమ నవలల్లో ఒకటిగా ఎంపికైన సంగతి తెలిసిందే. ప్రచురణకు అనుమతించిన అ రెండు సంస్థల బాధ్యులకు, అలాగే రచయిత డా.విఆర్ శర్మ గారికి కృతజ్ఞతలు.
ఈ సైన్స్ ఫిక్షన్ నవలను  ‘తెలుపు’ తొలి డైలీ సీరియల్ గా ఆదరించిన పాఠకులకు ధన్యవాదాలు. సరికొత్త నవలతో త్వరలో మళ్ళీ కలుద్దాం.
అన్నట్టు, ఈ నవల తెప్పించుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేసి ఆర్డర్ చేయవచ్చు.
– ఎడిటర్

“గుడ్, లేచావు కదా. సమయం వృధా చేయకుండా చెప్పు, ఈ తాటాకుల్లో ఏమి రాసి ఉంది,” తన చేతిలో ఉన్న ఆ పెట్టెను రక్షకు చూపిస్తూ ప్రశ్నించాడు అతడు.

క్షణంలో తాను ఉన్న పరిస్థితిని రక్ష అర్థం చేసుకుంది. అతడు వాళ్ల నాయకుడు కావొచ్చు. తన తల్లిదండ్రుల చావుకు కారకుడు, తన పెంపుడు తల్లిదండ్రులను అపహరించిన వాడు వీడే కావొచ్చు. జరిగిన అనర్థాలన్నిటికీ కారణమైనవాడు ఇప్పుడు తన ఎదురుగా ఉన్నాడు. రక్ష మనసు కోపంతో అగ్నిపర్వతంలా పేలడానికి సిద్ధంగా ఉంది. కానీ తనను తాను అదుపులో ఉంచుకుంటూ, అతనిని చూస్తూ అంది, “ముందు నా తల్లిదండ్రులను చూపించు.”

“ఓకే!” వంకర నవ్వుతో అని, తన వెనక నిలబడ్డ వాళ్లవైపు తిరిగి, “బ్రింగ్ దెమ్,” అని చెప్పాడు. వాళ్లు వెంటనే అక్కడి నుంచి వెళ్లి, ఆ గదిలో కుడివైపున, గోడలో కలిసిపోయినట్టు ఉన్న తలుపులు తెరిచి లోపలికి వెళ్లారు. రెండు వీల్ చైర్లను తోసుకుంటూ వచ్చారు. రక్ష తల్లిదండ్రులు నందన, మాణిక్యం ఆ కుర్చీలలో స్పృహ లేకుండా ఉన్నారు. వాళ్ల తలలు ముందుకు వాలిపోయి ఉన్నాయి. వాళ్ల కాళ్లూ చేతులూ ఆ చక్రాల కుర్చీలకు కట్టేసి ఉన్నాయి.

“వాళ్లను ఏం చేశావ్?” కంగారు పడుతూ ఆ పొట్టివాడిని అడిగింది రక్ష.

“ఇంకా ఏమీ చెయ్యలేదు. నాకు కావలసిన దాని గురించి వాళ్లకు ఏమీ తెలియదని నాకు తెలుసు. లేకపోతే నీ సొంత తల్లిదండ్రులకు నేను పట్టించిన గతే వీళ్లకూ కలిగేది. రక్షా! వెంటనే చెప్పు. ఈ తాటాకుల్లో ఏం రాసి ఉందో నాకు వివరంగా, స్పష్టంగా చెప్పు. లేకపోతే నాలోని రాక్షసుడు బయటకు వస్తాడు. నా సొంత అక్కనూ, బావనూ చంపేసిన నాకు, మీరు ఒక లెక్క కాదు. నువ్వు నా మేనకోడలివనే సెంటిమెంట్ నాకు ఏమీ లేదు. చెప్పు, దీనిలో మీ నాన్న సూర్య ఏం రాశాడు,” అతని మాటలు ఎంతో తీవ్రంగా, ఇక ఆలస్యాన్ని భరించలేనట్టు అసహనంగా ఉన్నాయి.

“ఔను. నేనూ కూడా ఇక ఆలస్యాన్ని భరించలేను,” అంటూ చటుక్కున లేచి నిలబడింది రక్ష. ఆ పరిణామాన్ని అతడు ఏమాత్రం ఊహించలేదు. ఆమె కాళ్లకూ చేతులకూ ఉన్న కట్లు ఎలా తెగిపోయాయో అతనికి అర్థం కాలేదు. అనుకోకుండానే అతడు ఒక అడుగు వెనక్కి వేశాడు.

“ఔను. నేనూ కూడా ఇక ఆలస్యాన్ని భరించలేను,” అంటూ చటుక్కున లేచి నిలబడింది రక్ష. ఆ పరిణామాన్ని అతడు ఏమాత్రం ఊహించలేదు. ఆమె కాళ్లకూ చేతులకూ ఉన్న కట్లు ఎలా తెగిపోయాయో అతనికి అర్థం కాలేదు. అనుకోకుండానే అతడు ఒక అడుగు వెనక్కి వేశాడు. అతని వెనకే ఉన్న ఆ ఇద్దరు అంగరక్షకులు వేగంగా వచ్చి రక్షను పట్టుకోబోయారు.

తన రెండు చేతులను రక్ష వాళ్ల వైపు విసిరింది. విద్యుద్ఘాతం ఏదో తగిలినట్టు వాళ్లు ఎత్తున గాలిలోకి ఎగిరి దూరంగా పడిపోయారు. వాళ్ల తలలు గోడలకు తగిలి, అవి పగిలిన శబ్దాలు వినిపించాయి. అతని వైపు తిరిగి తీక్షణంగా చూస్తూ, చెప్పింది రక్ష, “కంస మామా! నీ పట్ల కూడా నాకు ఏ విధమైన సెంటిమెంట్ లేదు. ఇప్పుడు చావబోయే నీ చావు గురించి ఎవరికీ ఏమీ తెలియదు. నా తల్లిదండ్రుల ఆత్మలు శాంతించే సమయం వచ్చింది. నీ మరణ వార్త విని రెండు లోకాలు పండగ చేసుకుంటాయి. నువ్వు తెలుసుకోవాలనుకున్న నీలి బిలం రహస్యం ఇంకెవ్వరికీ, ఎప్పటికీ తెలియదు. నువ్వు షాకయ్యే మరో విషయం విను. నీ దగ్గర ఉంది పిచ్చి గీతలు ఉన్న తాటాకుల కట్ట మాత్రమే. అసలైనది దానికి సంబంధించిన వాళ్లకు ఎప్పుడో చేరింది. నువ్వు నన్ను ఇక్కడికి తెచ్చావని అనుకుంటున్నావు కదా. నిజానికి నిన్ను వెతుక్కుంటూ నేనే వచ్చాను.”

రక్ష మాటలు వింటున్న ఆ వ్యక్తి బిత్తరపోతూ, అయోమయంగా స్థాణువులా నిలబడ్డాడు.

రక్ష అదే తీవ్ర స్వరంతో చెప్పింది, “పోలీసులు వెతుకుతున్న ఒక మాఫియా నాయకుడు, అంతర్జాతీయ టెర్రరిస్టులకు దగ్గరవాడు ఇక్కడ దిక్కులేని చావు ఎలా చచ్చాడో నీ శవాన్ని చూసిన వాళ్లకు అర్థం కాదు. తమ ఎన్కౌంటర్లో మరణించాడని బహుశా పోలీసులు రాసుకుంటారేమో. ఏమైనా అందరూ సంతోషిస్తారు.”

“అది నీ తరం కాదు,” అంటూ తృటిలో రివాల్వర్ తీశాడు ఆ వ్యక్తి.

“ముందు నిన్నూ, తరవాత నీ పెంపుడు తల్లిదండ్రులనూ పై లోకానికి పంపిస్తాను,” అంటూ రివాల్వర్ ట్రిగ్గర్ నొక్కాడు. రక్షవైపు బుల్లెట్లు దూసుకొచ్చాయి. రక్షను తాకేంత దగ్గరగా వచ్చిన బులెట్లు అలా గాలిలోనే ఆగిపోయాయి.

రక్ష వాటి వైపు చూసి, తల ఎత్తి ఆ వ్యక్తి వైపు చూసింది. ఆ బులెట్లు అంతే వేగంతో వెనుదిరిగి అతని శరీరాన్నీ, ఫాలభాగాన్నీ దూసుకుంటూ అవతలి వైపుకి వెళ్లిపోయాయి. అతని ప్రాణం పోవడం కూడా అతనికి తెలియలేదు. అతడు వెనక్కు విరుచుకుని పడిపోయాడు, అతడి కళ్లు ఆశ్యర్యపోతున్నట్టు అలా తెరుచుకుని చూస్తున్నాయి. మెల్లగా ఆ శరీరం చుట్టూ నెత్తుటి మడుగు ఏర్పడుతోంది. అది సౌండ్ ఫ్రూఫ్ గది కాబట్టి అక్కడి శబ్దాలు ఏవీ ఆ గది దాటి పోలేదు. అక్కడ అంతా గాఢమైన నిశ్శబ్దం ఆవరించింది…

“అంతా సుఖాంతమే కదా!” ఎదురుగా నిలబడి నవ్వుతూ అడిగింది మోక్ష. తరవాత చుట్టూ చూస్తూ, “బాగుంది, మొదటి ప్రయత్నంలోనే ఇంత చక్కటి నిర్వహణ! ఇది భవిష్యత్తులో అనేక అద్భుతమైన మంచి పనులకు ఆరంభం,” అంటూ రక్షను అభినందించింది మోక్ష.

ఆ శవాలను దాటుకుంటూ రక్ష తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లింది. వాళ్లు ఇంకా నిద్రపోతూనే ఉన్నారు. బహుశా వాళ్లకు ఏవో ఇంజక్షన్లు ఇచ్చి ఉంటారని అనుకుంటూ తన మెడలోని లాకెట్ ను తాకింది.

“అంతా సుఖాంతమే కదా!” ఎదురుగా నిలబడి నవ్వుతూ అడిగింది మోక్ష. తరవాత చుట్టూ చూస్తూ, “బాగుంది, మొదటి ప్రయత్నంలోనే ఇంత చక్కటి నిర్వహణ! ఇది భవిష్యత్తులో నువ్వు చేయబోయే అనేక అద్భుతమైన మంచి పనులకు ఆరంభం,” అంటూ రక్షను అభినందించింది మోక్ష.

“నీ సలహాలు, సహాయంతోనే కదా నేను ఇదంతా చేయగలిగింది,” అంటూ ఆత్మీయంగా మోక్ష భుజాల మీద చేతులు వేసి, ప్రేమను వ్యక్తం చేస్తూ ఆమె బుగ్గ మీద సున్నితంగా ముద్దు పెట్టుకుంది.

“ఇక మనం ఇంటికి వెళ్లిపోదాం. బయట ఉన్న వాళ్లలో మనకు సంబంధించిన జ్ఞాపకాలన్నీ నేను చెరిపేస్తాను. తరవాత మనకు సంబంధించిన విషయాలు ఏవీ వాళ్లకు గుర్తు ఉండవు…” అని మోక్ష చెపుతుంటే, “మరి వీళ్లకు మెలకువ తెప్పించాలి కదా?” ఇంకా మెలకువలోకి రాని తల్లిదండ్రులను చూపిస్తూ అడిగింది రక్ష.

“అది ఇక్కడ కాదు. ఇంటికి వెళ్లిన తరవాత వాళ్లు మెలకువలోకి వస్తారు. నా గురించీ, నీలి బిలం గురించీ, నువ్వు చూసిన మరో లోకం గురించీ వీళ్లకు కూడా తెలియకూడదు. ముఖ్యంగా వీళ్లు నీ తల్లిదండ్రులు కారనే విషయం నీకు తెలుసని వాళ్లకు ఏ మాత్రం తెలియకూడదు. వాళ్లు నిన్ను తమ బిడ్డగానే పెంచుకుంటున్నారు. నువ్వు దొరికిన తరవాత వాళ్లు ఇక బిడ్డలను కనలేదు. అంత మంచి వాళ్లకు ఇప్పుడు అవసరం లేని నిజాన్ని చెప్పి గాయపరచడం సరికాదు. దానివల్ల మీ మధ్య దూరం పెరిగి పూడ్చలేని అగాధం ఏర్పడడం కంటే మరో ప్రయోజనం ఏమీ ఉండదు,” చెప్పింది మోక్ష.

“నిజమే! వీళ్లే నా తల్లిదండ్రులు. నువ్వే నా ప్రాణప్రదమైన చెల్లెలివి,” ఎంతో సంతోషంగా, హృదయపూర్వకంగా చెప్పింది రక్ష.

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. దాని కొత్త రూపాలు ప్రదర్శించబోతోంది. కనిపించని ఆ శత్రువును ఓడించడానికి మనం ఏం చేయగలమో ఆలోచించాలి. మన రెండవ కార్యక్రమం అదే.

“నిజమే కదా! నువ్వు చేయబోయే మంచి పనుల్లో నేను నీతోనే ఉంటాను. బయట కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. దాని కొత్త రూపాలు ప్రదర్శించబోతోంది. కనిపించని ఆ శత్రువును ఓడించడానికి మనం ఏం చేయగలమో ఆలోచించాలి. మన రెండవ కార్యక్రమం అదే. సరే, ఇక ఇక్కడి నుంచి బయలుదేరదాం,” అంది మోక్ష.

“మరి, శరత్ అన్న ఇంకా శ్రీశైలంలోనే నా కోసం ఎదురు చూస్తున్నాడు కదా? అతడిని హైదరాబాద్ వచ్చేయమని చెప్పాలి,” తన ఫోన్ కోసం బ్యాగులో చేయి పెడుతూ అంది రక్ష.

“అతడు ఎప్పుడో హైదరాబాద్ చేరుకున్నాడు. అతడిని అక్కడికి వచ్చేయమని నేను చెప్పేశాను. అక్కడ మన కోసం ఎదురు చూస్తుంటాడు,” చిరునవ్వుతో చెప్పింది మోక్ష. వాళ్లు మరి కొద్దిసేపట్లో హైదరాబాదు చేరుకుంటారు.

గత చాప్టర్ల కోసం కింద క్లిక్ చేయండి

ఇరవయ్యవ అధ్యాయంపందొమ్మిదో అధ్యాయం | పద్దెనిమిదో అధ్యాయం | పదిహేడో అధ్యాయం | పదహారో అధ్యాయం | పదిహేనో అధ్యాయం | పద్నాలుగో అధ్యాయం | పదమూడో అధ్యాయం | పన్నెండో అధ్యాయం | పదకొండో అధ్యాయం | పదో అధ్యాయం | తొమ్మిదో అధ్యాయం | ఎనిమిదో అధ్యాయం | ఏడో అధ్యాయం | ఆరో అధ్యాయం | ఐదో అధ్యాయం | నాలుగో అధ్యాయం  మూడో అధ్యాయం రెండో అధ్యాయం |  తొలి అధ్యాయం  | రచయిత పరిచయం

 

More articles

1 COMMENT

  1. Namaskaram wonderful fiction novel for every one..Telugu writers also write fiction novel .this book a gift for every one ..novel published Ramesh gariki many many thanks also WRITER..chapter wise figures are wonderful. New world show raksha.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article