Editorial

Saturday, May 11, 2024
Audio Columnసంగీతంపై అద్భుత పద్యం

సంగీతంపై అద్భుత పద్యం

 

తెలుపు టివి జీవ నాదాన్ని వినిపించు. సంగీత సాహిత్యాల మేలు కలయికగా భాసించు. ఆ ఒరవడిలో పద్యం, పాటలను ప్రతి దినం మీకందించు. శబ్ధ కాలములను చక్కగా జత చేసి మీ మనసులను రంజింపు. ఈ ప్రయత్నంలో ఇరు ప్రక్రియలో కృషి చేసే మధుర సుధలకు ఆహ్వానంబు పలుకు. మంచి గంధం పంచమని వినయంగా అభ్యర్థించు. మరి, ఈ సాయంత్రం సంగీతపు కళ దివ్య ఔషధంబుగా నిర్వచించిన సీస పద్యం పంచు.
రచన డా. అయినాల మల్లేశ్వరరావు. గానం శ్రీ కోట పురుషోత్తం.

సాహిత్య ప్రక్రియలో విశిష్టమైన పద్య ప్రశస్తిని గుర్తించిన కోట పురుషోత్తం తిరుపతి నివాసి. వారు రాగయుక్తంగా ఆయా పద్యాలను ఆలపిస్తూ విద్యార్థుల మనసులో నాటుకునేలా చేయడంలో విశేష అనుభవం గడించారు. సులభంగా తాత్పర్యం బోధపడేలా ఉండే అనేక పద్యాలను వారు ఎంచుకుని, కొందరితో రాయించి మరీ వాటిని తానొక నిధిగా సమకూర్చుకున్నారు. నిజానికి వారు పద్యం కోసమే కదలడం జీవన శైలిగా చేసుకోవడం విశేషం. పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే కొన్ని వేల మంది బాలబాలికలు, యువతీ యువకుల్లో పద్యం పట్ల ఆసక్తిని రగిల్చిన వారు ‘తెలుపు’ కోసం ఈ శీర్షిక నిర్వహిస్తారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article