Editorial

Saturday, May 11, 2024
ఔషధ విలువల మొక్కలుసింధువార పత్రం : నాగమంజరి గుమ్మా తెలుపు

సింధువార పత్రం : నాగమంజరి గుమ్మా తెలుపు

ఔషధ విలువల మొక్కలు ( 16 ) : సింధువార పత్రం

సింధువార పత్రి శ్రీగణేశు కొలిచె
వావిలాకు పేర వాడుకగను
వాత పట్లు తొలగు బాలింతలకు పూయ
చూడ బిల్వమట్లు చూపుకట్టె

నాగమంజరి గుమ్మా

సింధువార పత్రం పేరిట శ్రీ వినాయకుని కొలిచే మరొక పత్రం వావిలాకు.

చూడటానికి బిల్వపత్రాల్లా అనిపిస్తాయి.

బాలింతలకు 11 వ రోజున చేయించే శుద్ధి స్నానమునకు వేడినీటిలో ఈ వావిలాకులు వేస్తారు.

వాతపట్లు హరిస్తుంది.

మారేడు వృక్షంలా ఎదుగుతుంది కానీ వావిలి చిన్న మొక్క మాత్రమే. దీని పత్రి సుగంధభరితంగా ఉంటుంది.

Columnist email: gnmanjari7@gmail.com

నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వారు కవిత్వం, పద్యం, గద్యం వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ప్రతి రోజూ ఒక రచనతో అనేక వాట్సప్ గ్రూపుల్లో వందలాది మందికి చేరువయ్యారు. ముఖ్యంగా పూవుల వర్ణన పద్యములు – పుష్పవిలాసం (1116), పండ్ల విశిష్టత తెలుపే ఫల విలాసం (108), పక్షుల గురించిన విహంగ విలాసం (108), సముద్ర జీవుల గురించి రాసిన జలచర విలాసం (108), – వీటి ప్రశస్తిని శతకాలుగా రచించారు. ప్రస్తుతం శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు అందించే చిత్రాల సహకారంతో ప్రతి రోజూ ఒక్క మొక్క తాలూకు ఔషధ విలువలను పద్యం సహితంగా అందిస్తున్నారు.

మన ప్రాంతీయ మొక్కలలోని ఔషధ గుణాలు గురించిన ఈ సమాచారం ఎంతో విలువైనదే. అలా అని వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగించకూడదని నాగమంజరి గారి మనవి.

Medicinal Plant

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article