Editorial

Saturday, May 18, 2024
Opinionఏడేళ్ళ స్వరాష్ట్రం - 'ప్రవాసీ తెలంగాణ దివస్' ' డిమాండ్ - మంద భీంరెడ్డి

ఏడేళ్ళ స్వరాష్ట్రం – ‘ప్రవాసీ తెలంగాణ దివస్’ ‘ డిమాండ్ – మంద భీంరెడ్డి

నేడు అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం. ఈ సందర్భంగా గల్ఫ్ దేశాలకు వెళ్లిన వలస కార్మికుల దుస్థితి గురించి చెబుతూనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ఎన్నారై పాలసీ ఇప్పటికీ  ప్రవేశ పెట్టలేదని, గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు కూడా ఏర్పాటు చేయలేదని గుర్తు చేస్తున్నారు వ్యాసకర్త. తెలంగాణ ప్రభుత్వం ‘ప్రవాసీ తెలంగాణ దివస్’ను అధికారికంగా నిర్వహించల్సిన ఆవశ్యకతను కూడా అయన డిమాండ్ చేస్తున్నారు.

మంద భీంరెడ్డి

మనుషుల వలస అనేది ప్రాచీన కాలం నుండి కొనసాగుతున్న ప్రక్రియ. వలసలకు, అభివృద్ధికి, మానవ వికాసానికి సంబంధం ఉన్నది. వలస పోతున్న పౌరులందరి కోసం ఐక్యరాజ్య సమితి డిసెంబర్ 18 ని అంతర్జాతీయ వలసదారుల దినోత్సవంగా (ఇంటర్నేషనల్ మైగ్రంట్స్ డే) గా ప్రకటించింది. ఈమేరకు ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ (యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ) 31 ఏళ్ల క్రితం 18 డిసెంబర్ 1990 సంవత్సరంలో జరిగిన సమావేశంలో “అందరు వలస కార్మికులు, వారి కుటుంబ సభ్యుల హక్కుల రక్షణ” గురించి ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

ఉన్న ఊరిలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లడం వలసలకు ఒక కారణం కాగా,  అధిక వేతనాలు మరింత మెరుగైన జీవం కోసం వేరే ప్రాంతాలకు వెళ్లడం మరొక కారణం. పల్లెల నుండి పట్టణాలకు గాని, ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి గాని వెళ్లడాన్ని అంతర్గత వలసలు అంటాం. ఒకదేశం నుండి మరొకదేశానికి వెళ్లడాన్ని ‘అంతర్జాతీయ వలసలు’ అంటున్నాం.

ఈ వలసల్లో ముఖ్యంగా కోవిడ్ పరిస్థితుల వలన  తెలంగాణ నుండి గల్ఫ్ దేశాలకు వెళ్లిన వలస కార్మికుల పరిస్థితి మరింత దిగజారింది. కోవిడ్ కారణంగా ఆరు గల్ఫ్ దేశాలలో 3,576 మంది భారతీయులు చనిపోయారు. వీరిలో 200 కు పైగా తెలంగాణ వారు ఉన్నారని ఒక అంచనా. సౌదీ అరేబియా (1,154), యుఏఇ (894), కువైట్ (668), ఓమాన్ (551), బహరేన్ (200), ఖతార్ (109).

కోవిడ్ సందర్బంగా గల్ఫ్ దేశాల నుండి భారత్ కు ‘వందే భారత్ మిషన్’ లో 7,16,662 మంది వాపస్ వచ్చారు. వీరిలో ఒక లక్షమంది తెలంగాణ వారు ఉన్నారని ఒక అంచనా.

కోవిడ్ సందర్బంగా గల్ఫ్ దేశాల నుండి భారత్ కు ‘వందే భారత్ మిషన్’ లో 7,16,662 మంది వాపస్ వచ్చారు. వీరిలో ఒక లక్షమంది తెలంగాణ వారు ఉన్నారని ఒక అంచనా. యుఏఇ (3,30,058), సౌదీ అరేబియా (1,37,900), కువైట్ (97,802), ఓమాన్ (72,259), ఖతార్ (51,190), బహరేన్ (27,453).

కరోనా సమయంలో గల్ఫ్ నుండి హడావిడిగా వెళ్లగొట్టబడిన కార్మికులకు జీతం బకాయిలు, ఉద్యోగ విరమణ ప్రయోజనాలు (ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్స్) రాబట్టుకోవడం కోసం ‘జస్టిస్ ఫర్ వేజ్ తెఫ్ట్’ అనే ఉద్యమం నడుస్తున్నది. వాపస్ వచ్చిన వలస కార్మికుల పునరావాస బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అనేక సార్లు స్పష్టం చేసింది. వాపస్ వచ్చినప్పుడు అధిక విమాన చార్జీలు, క్వారంటైన్ ఖర్చులు తడిసి మోపెడైనాయి.

కరోనా తగ్గుముఖం పట్టడంతో వాపస్ వచ్చిన వలస కార్మికులు తిరిగి గల్ఫ్ దేశాలకు వెళుతున్న సంగతి తెలిసిందే. వారికి కరోనా టెస్టులు, అధిక విమాన చార్జీలు ఇబ్బంది పెడుతున్నాయి.

కరోనా తగ్గుముఖం పట్టడంతో వాపస్ వచ్చిన వలస కార్మికులు తిరిగి గల్ఫ్ దేశాలకు వెళుతున్న సంగతి తెలిసిందే. వారికి కరోనా టెస్టులు, అధిక విమాన చార్జీలు ఇబ్బంది పెడుతున్నాయి. కాగా, కొత్తగా ఉద్యోగాల రిక్రూట్మెంట్ కూడా పుంజుకుంటున్నది. కరోనా సందర్భంగా రిక్రూటింగ్ ఏజెన్సీలను ఆదుకోవడానికి సెక్యూరిటీ  డిపాజిట్లను కేంద్ర ప్రభుత్వం రూ. 50 లక్షల నుండి రూ. 25 లక్షలకు, రూ. 8 లక్షల నుండి రూ. 4 లక్షలకు తగ్గించింది. వలస కార్మికులు చెల్లించే సర్వీస్ చార్జీలు రూ. 30 వేలు దీనిపై 18 శాతం జీఎస్టీ మాత్రం తగ్గించలేదు.

ప్రభుత్వాలకు ఎన్నారైల పెట్టుబడులపై ఉన్న ప్రేమ వారి సంక్షేమం పట్ల లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ఎన్నారై పాలసీ (ప్రవాసీ విధానం) ప్రవేశపెట్టాలని, గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండు చాలాకాలంగా అమలుకు నోచుకోలేదు.

ఎన్నారైలు పంపే విదేశీ మారక ద్రవ్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మేలు జరుగుతున్నది. ప్రభుత్వాలకు ఎన్నారైల పెట్టుబడులపై ఉన్న ప్రేమ వారి సంక్షేమం పట్ల లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ఎన్నారై పాలసీ (ప్రవాసీ విధానం) ప్రవేశపెట్టాలని, గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండు చాలాకాలంగా అమలుకు నోచుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏడున్నర ఏళ్లలో 1500 కు పైగా తెలంగాణ ప్రవాసులు గల్ఫ్ దేశాలలో వివిధ కారణాలతో మృతి చెందారు. గల్ఫ్ మృతుల కుటుంబాలు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా కోసం ఎదిరి చూస్తున్నారు. రూ. 500 కోట్ల వార్షిక బడ్జెట్ తో గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి, పునరావాసానికి కృషి చేయాలని కోరుతున్నారు.

38 ఏళ్లనాటి ఎమిగ్రేషన్ యాక్టు, 1983 స్థానంలో నూతన ఎమిగ్రేషన్ యాక్టు, 2021 ను తీసుకరావాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఎన్నారైలకు ‘ప్రాగ్జీ’ ఓటింగు (ప్రతినిధి ద్వారా, పరోక్ష పద్ధతిలో ఓటు వేయడం) లేదా ఆన్ లైన్ ఓటింగు సౌకర్యం కల్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. గల్ఫ్ దేశాల జైళ్లలో మగ్గుతున్న 2,183 మంది భారతీయులు న్యాయ సహాయం కోసం ఎదిరి చూస్తున్నారు.

గల్ఫ్ దేశాలలో పనిచేసి భారతీయ కార్మికులకు భారత ప్రభుత్వం కనీస వేతనాలను తగ్గిస్తూ సర్కులర్లను జారీ చేసింది. అన్నివర్గాల ఒత్తిడితో ఆ తర్వాత ఆ సర్కులర్లను రద్దు చేశారు. భారత విదేశాంగ మంత్రి గల్ఫ్ దేశాలలో పర్యటించి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారు ముంబయి లో ఏర్పాటు చేసిన విధంగా “విదేశ్ భవన్” ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలి. ఈ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ (సమీకృత సముదాయం) లో పాసు పోర్టు ఆఫీసు, ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రంట్స్ ఆఫీసు, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ఐసిసిఆర్) రీజినల్ ఆఫీసు, విదేశాంగ శాఖ బ్రాంచి సెక్రెటేరియట్ లు ఉంటాయి.

తెలంగాణ ప్రభుత్వం ‘ప్రవాసీ తెలంగాణ దివస్’ను అధికారికంగా నిర్వహించాలి. విదేశాలలో, స్వదేశంలో ఉన్న తెలంగాణ ప్రవాసి సంఘాలు ఒకే తాటిపైకి వచ్చి హైదరాబాద్ కేంద్రంగా ఒక విశ్వవేదిక ఏర్పాటు చేసుకొని తమ హక్కుల కోసం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది.

తెలంగాణ ప్రభుత్వం ‘ప్రవాసీ తెలంగాణ దివస్’ను అధికారికంగా నిర్వహించాలి. విదేశాలలో, స్వదేశంలో ఉన్న తెలంగాణ ప్రవాసి సంఘాలు ఒకే తాటిపైకి వచ్చి హైదరాబాద్ కేంద్రంగా ఒక విశ్వవేదిక ఏర్పాటు చేసుకొని తమ హక్కుల కోసం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం సందర్భంగా ఈ అంశాలపై అందరం ద్రుష్టి సారిస్తారని ఆశిస్తున్నాను,.

మంద భీంరెడ్డి పూర్వ పాత్రికేయులు, ప్రవాసి సంక్షేమ వేదిక అధ్యక్షులు. మొబైల్ +91 98494 22622

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article