Editorial

Saturday, May 18, 2024
విశ్వ భాష‌ఆదివాసి నుంచి ఆదివాసీకి : తెలుపు సగౌరవ సమర్పణ

ఆదివాసి నుంచి ఆదివాసీకి : తెలుపు సగౌరవ సమర్పణ

తెలుపు టివి ట్యాగ్ లైన్ LANGUAGE of the universe అనుకున్నాం. అదేమిటో దానంతట అదే తెలిసేలా అడుగులు వేస్తుండగా  ఒక మిత్రుడు మీకు యూనివర్స్ ని పరిచయం చేయనా? అన్నారు. చేశాడు. యూనివర్స్’ పరిచయం అవడమే కాదు, అయన ద్వారా ‘నేచర్’ తెలిశాడు. ‘యూనివర్స్’, ‘నేచర్’ తో పాటూ ‘మానవ్’ కూడా తెలిశాడు. నిజంగా చిత్రమే. ఈ ముగ్గురూ తమ పేర్లు తీసి వేసి, నూతన నామధేయాలతో ఈ విశ్వంలో వారు సరికొత్తగా అడుగులు వేయడం ప్రారంభించారని తెలిసి విభ్రాంతి చెందడం, క్షణంలో తేరుకుని ఇది ఆశ్చర్యమేమీ కాదు, ఇదే సత్యం అనుకోవడం ఎంత గొప్ప ఆనందం.

అన్నట్టు, వారు ముగ్గురే కాదు, పన్నెండుగురు. ఇంకా విస్తరిస్తున్నారు.

కందుకూరి రమేష్ బాబు 

తెలుపు టివి ప్రారంభిస్తున్నప్పుడు ట్యాగ్ లైన్ ఏముండాలి అనుకున్నప్పుడు విశాలమైన ఆశయంతో నిర్మలమైన హృదయంతో ఆలోచించి నలుపు నుంచి తెలుపుకు ప్రయానిస్తున్నందున Language of the universe అనుకున్నాం.

మహమ్మారి రెండో విడత విలయ తాండవం చేస్తున్నప్పుడు, మనిషి తన పరిధి పరిమితం అని తెలుసుకుంటూ ఉన్నప్పుడు. ఈ తరుణంలో మానవుడు మరింత మెలకువతో – ప్రకృతితో అనుసంధానమై జీవించాలని తేలిపోయింది గనుక ట్యాగ్ లైన్ Language of the universe అనుకున్నాము.

వార్తలు, విశేషాలు అన్నీ మనిషి కేంద్రంగా ఉంటున్నప్పుడు ప్రకృతి, విశ్వం ప్రధానంగా కథనాలు ప్రచురిస్తూ నలుదిక్కుల నుంచి జీవితమే వార్తలుగా తెలుపాలనుకున్నం. ఆ విశ్వ ప్రయత్నం దానంతట అదే జరుగుతుందని అమాయకంగా అడుగులు వేశాము.

చిత్రంగా గతవారం ‘యూనివర్స్’ పరిచయం అయ్యారు. అయన ద్వారా ‘నేచర్’ తెలిశాడు. ‘యూనివర్స్’, ‘నేచర్’ తో పాటూ ‘మానవ్’ కూడా తెలిశాడు. నిజంగా చిత్రమే. ఈ ముగ్గురూ తమ పేర్లు తీసి వేసి, నూతన నామధేయాలతో ఈ విశ్వంలో వారు సరికొత్తగా అడుగులు వేయడం ప్రారంభించారని తెలిసి విభ్రాంతి చెందడం, క్షణంలో తేరుకుని ఇది ఆశ్చర్యమేమీ కాదు, ఇదే సత్యం అనుకోవడం ఎంత గొప్ప ఆనందం.

ఇంతే కాదు, మరింత వివరంగా చెప్పాలంటే మొత్తం తొమ్మిది మంది గురించి చెప్పాలి. నిజానికి వారు పన్నెండుగురి బృందం.

మొదట యూనివర్స్ గురించి చెప్పాలి. అతడి భార్య కాస్మిక్ రేస్. వారి పిల్లలు, ఆక్సీజన్, హైడ్రోజన్- హీలియం, నైట్రోజన్. మీరు విన్నది నిజమే. రెండో అబ్బాయికి హైడ్రోజన్ తో పాటు హీలియంను కలిపి పెట్టారు.

మొదట యూనివర్స్ గురించి చెప్పాలి. అతడి భార్య కాస్మిక్ రేస్. వారి పిల్లలు, ఆక్సీజన్, హైడ్రోజన్- హీలియం, నైట్రోజన్. మీరు విన్నది నిజమే. రెండో అబ్బాయికి హైడ్రోజన్ తో పాటు హీలియంను కలిపి పెట్టారు.

మరొక జంట – నేచర్. అయన భార్య పేరు మౌంటేన్స్. ఒక పర్వతం కాదు, ఆమె పర్వతాల పంక్తి. వారి అబ్బాయి ఆక్సీజన్.

ఇంకో మిత్రుడు మానవ్. అతడి కుమారుడి పేరు విశ్వ విజేత.

ఇదంతా నిజామేనా అంటే నమ్మాలి. వీరంతా చాలా కష్టాలు పడ్డారు. తమ పేర్లను మార్చుకుని సరికొత్తగా విశ్వభాషలోకి తమను తాము అనువదించు కోవడానికి, నేటి సమాజంలో ఈ నూతన పేర్ల ఆవశ్యకతను చెప్పనూ లేక చెప్పకుండా ఉండనూలేక అనేక ఇబ్బందులు పడ్డారు. గెజెట్ లో అధికారికంగా కొత్త పేర్లతో తాము నమోదు కావడానికి ఎంతో ప్రయాస పడ్డారు.

తమని తాము విస్తరించుకున్నారు. తాము పరిమితం కాదని గ్రహించారు. కులం, మతం, లింగం, వర్గం, ప్రాంతం, జాతి వంటి సరిహద్దులు లేని మానవతను, మీదుమిక్కిలి ప్రకృతి శక్తులుగా అవతరించారు. విశ్వాత్మను అనుభూతి చెందారు. అట్లా సమూలంగా మార్చుకున్న ఫలితమే తామే ఒక యూనివర్స్ అయ్యారు, నేచర్ అయ్యారు. మౌంటెయిన్స్ అయ్యారు.

ఇలాంటి బృందంలో పన్నెండుగురు ఉన్నారు. వారు ఇకా విస్తరించనున్నారు. వీరంతా విద్యావంతులు. కొందరు ఉన్నతోద్యుగులు. అన్నిటికీ మిన్న వర్తమాన సమాజంలో విద్య, వైద్యం, ఉపాధితో పాటు కనీస అవసరాల లభ్యం కాక మానవుడు మరొక మానవుడితో ఘర్షణ పడుతూ అన్నీ సమంగా అందించిన ప్రకృతిలో నానా అవస్థలు పడటం వీరికి నచ్చలేదు. వ్యక్తికి వ్యక్తికి మధ్య, మనిషికి ప్రకృతికి మధ్య దూరం పెంచుతున్న విషయాలపట్ల అవగాహన కల్పిస్తూ శాస్త్రీయ విజ్ఞానాన్ని పంచడమూ వీరు ఎంచుకున్నారు. తమ వంతు బాధ్యతగా వారు పనిచేయడానికి అడ్డుగా తమకున్న ఉనికిని మొదట పాటా పంచలు చేయాలనుకున్నారు. తమని తాము విస్తరించుకున్నారు. తాము పరిమితం కాదని గ్రహించారు. కులం, మతం, లింగం, వర్గం, ప్రాంతం, జాతి వంటి సరిహద్దులు లేని మానవతను, మీదుమిక్కిలి ప్రకృతి శక్తులుగా అవతరించారు. విశ్వాత్మను అనుభూతి చెందారు. అట్లా సమూలంగా మార్చుకున్న ఫలితమే తామే ఒక యూనివర్స్ అయ్యారు, నేచర్ అయ్యారు. మహోన్నతమైన పర్వత సానువులయ్యారు. అంత్యంత వేగవంతమైన రేఖలయ్యారు. శక్తివంతమైన తేజో కిరణాలయ్యారు. అణువణువూ సరికొత్తగా స్పందించగా విభిన్న వాయువులయ్యారు. నూతన మానవ్ లూ అయ్యారు. వారు విశ్వం పేరితో ఒక ట్రస్టు కూడా నెలకొల్పి నిశ్శభ్ద సేవలో నిమగ్నమయ్యారు.

ఇంతకూ… మొదట పరిచయమైన ‘యూనివర్స్’ ని అడిగాను. ‘మీరెవరూ?’ అని. ‘ఆదివాసీని’ అన్నారాయన. ‘అరకు ఆదివాసీని’ అని చెప్పారాయన. తమ ప్రయాణం అంతా ‘ఈ విశ్వంలోకి…ప్రకృతిగా బతికిన ఒకనాటి ఆదివాసీ చెంతకే’ అన్నారాయన. ఎంత అద్భుతం. ఆదివాసి నుంచి ఆదివాసికి. విశ్వం నుంచి విశ్వానికి.

ఇంతకూ… మొదట పరిచయమైన ‘యూనివర్స్’ ని అడిగాను. ‘మీరెవరూ?’ అని.

‘ఆదివాసీని’ అన్నారాయన. ‘అరకు ఆదివాసీని’ అని చెప్పారాయన.

తమ ప్రయాణం అంతా ‘ఈ విశ్వంలోకి…ప్రకృతిగా బతికిన ఒకనాటి ఆదివాసీ చెంతకే’ అన్నారాయన.

ఎంత అద్భుతం. ఆదివాసి నుంచి ఆదివాసికి. విశ్వం నుంచి విశ్వానికి.

“మీ వివరాలు ఇవ్వవచ్చా?’ అని అడిగాను.

‘వొద్దు. మా పనికి ఆటంకంగా ఉంటుంది. అవసరం ఐనప్పుడు మేమే అందరికీ కనిపిస్తాం” అన్నారాయన.

ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆ విశేషం క్లుప్తంగా తెలుపు కథనం ఇది.

ఇది తెలుపు టివి, Language of the universe గా సంపూర్ణంగా మారినప్పటి సమర్పణ. అరుదైన సంపాదకీయం. ధన్యవాదాలు.

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article