Editorial

Monday, May 20, 2024
కథనాలుబాలుతో స్వరయానం : ఎస్.వి.సూర్యప్రకాశరావు ఆత్మీయ నీరాజనం

బాలుతో స్వరయానం : ఎస్.వి.సూర్యప్రకాశరావు ఆత్మీయ నీరాజనం

 

 

ఇదే పాట… ప్రతీ చోటా… ఇలాగే పాడుకుంటాము

suryaబాలు దివికేగిన స్వర పారిజాతం. వారితో పరిచయ భాగ్యం నిజంగా ఒక సుకృతం. మానవ సంబంధాలకు వారిచ్చే విలువ ఎలాంటిదో స్వయంగా దర్శించిన అనుభవం నాది. వారి స్వరయానంలో ఇది రెండో భాగం.

నేను మద్రాసులో ఇండియా టుడే లో చేరిన తరువాత చాలా తరచుగా బాలుగారిని కలవటం జరిగింది. ఆంధ్రా క్లబ్ లో ఒకసారి ఒక సాంస్కృతిక కార్యక్రమం బహుశా ఘంటసాల గారి జయంతి అనుకుంటాను జరిగింది. అది అయిన వెంటనే నేను బయలు దేరి వచ్చేస్తున్నా ను. నేను ఆంధ్రా క్లబ్ లో రిసెప్షన్ దగ్గరకు రాగానే ‘అయ్యా నమస్కారం’ అని పిలుపు వినపడింది. వెనక్కి చూస్తే బాలు గారు. పక్కనే అయన చెల్లెలు వసంత. ‘ఏమిటి హడావిడిగా వెళ్లిపోతున్నారు. అంతా కులాసానా?’ అని పలకరించారు. నేను ఆగిపోయి ‘నమస్కారం సర్’ అన్నాను. ‘ప్రోగ్రాం ఎలా ఉంది’ అన్నారు. ‘బాగుంది’ అన్నాను. ‘Office lo అర్జెంట్ work ఉంది. అందుకే హడావుడి sir అన్నా. అలగ వెళ్ళండి. Vehicle ఉందా?’ అని అడిగారు. ‘ఉంది sir. Thank you మిమ్మల్ని త్వరలోనే కలవాలి అన్నా’. ‘Any time welcome. శుభం భూయాత్’ అన్నారు. మానవ సంబంధాలకు అయన ఇచ్చేవిలువ ఎలాంటిదో అర్థమైంది.

‘గురుదక్షిణ అనేది నానుడి. గురుభిక్ష భలే కాయిన్ చేశారు’ అని నవ్వారు. ‘నిజమే మంచి గురువు దొరకడం భగవంతుడి వరం అదే మన హిందూ వేదాంత శాస్త్రం చెబుతుంది’ అని గంభీరంగా అన్నారు.

ఇంకొకసారి అదే ఆంధ్రా క్లబ్ లో కలిసినప్పుడు అడిగాను ‘మీ సినీ  సంగీత యాత్రకు శ్రీకారం ఇక్కడే జరగింది. పాటల పోటీల్లో మీకు మొదటి బహుమతి వచ్చిందని మీ చరిత్రలో ఒక ఘట్టంగా చెబుతారు ఎక్కడండి అది’ అని అడిగాను. ‘ఇది కొత్త బిల్డింగ్ దీనివెనుక చిన్న భవనం ఉండేది. పెండ్యాల గారు ఘంటసాల మాస్టారు, సుసర్ల దక్షిణామూర్తి గారు జడ్జిలు. అప్పుడు నా పాటకు మొదటి బహుమతి వచ్చింది. ఆ విధంగా నేను కోదండపాణి గారి దృష్టిలో పడ్డాను’ అన్నారాయన. ‘ఆ విధంగా మీకు గురు భిక్ష లు లభించి నదన్నమాట’ అన్నాను నేను. ‘గురుదక్షిణ అనేది నానుడి. గురుభిక్ష భలే కాయిన్ చేశారు’ అని నవ్వారు. ‘నిజమే మంచి గురువు దొరకడం భగవంతుడి వరం అదే మన హిందూ వేదాంత శాస్త్రం చెబుతుంది’ అని గంభీరంగా అన్నారు.

ఆయన పాడుతా తీయగా స్వరాభిషేకం ఇంకా వివిధ సాహిత్య సభల్లో తెలుగు కవిత్వం, పద్యం, పాటలలో సాహిత్య విలువల్ని స్పృశిస్తూ విశ్లేషించిన తీరు పాటలకే పూర్తిగా అంకితమైన మరే గాయకుడికి సాధ్యం కాదు. వాటిని ఒక సంకలనంగా తీసుకు రాగలిగితే బాలులో సాహిత్య మూర్తినీ దర్శించవచ్చు.

ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాస ఆయనలో నాకు చాలా సందర్భాలలో కనిపించింది. కవులు,రచయితల పట్ల వారి రచనల పట్ల ఆయనకు అమితమైన గౌరవం భక్తి. ఆయన పాడుతా తీయగా స్వరాభిషేకం ఇంకా వివిధ సాహిత్య సభల్లో తెలుగు కవిత్వం, పద్యం, పాటలలో సాహిత్య విలువల్ని స్పృశిస్తూ విశ్లేషించిన తీరు పాటలకే పూర్తిగా అంకితమైన మరే గాయకుడికి సాధ్యం కాదు. వాటిని ఒక సంకలనంగా తీసుకు రాగలిగితే బాలులో సాహిత్య మూర్తినీ దర్శించవచ్చు. తీరిక లేని వృత్తి జీవితంలో కూడా ఆయన ఒక మంచి పుస్తకాన్ని చదవటం ఒక అలవాటుగా చేసుకున్నారు. ఆయనకు ఒక కన్నడ చిత్రంలో పాటకు జాతీయ అవార్డు వచ్చినప్పుడు ఇండియా today లో profile రాయటం కోసం వెళ్ళాను అయన ఇంటికి. వెళ్ళిన వెంటనే సంగతి చెప్పాను అయన దాని గురించి చెప్పటం మొదలు పెట్టారు. నిజానికి నా దగ్గర ఆయనను అడగటానికి రాసిపెట్టుకున్న ప్రశ్నలు ఉన్నాయి. అరగంట మాట్లాడాక నేను ఏమీ నోట్ చేసుకోలేదు. అప్పుడు ప్రశ్నలు వినిపించాను. ‘అయ్యో ప్రశ్నలతో వచ్చారా… చెప్పటానికి మొహమాట పడతారేమి…ఇది తెలియకనే ఏదో వాగాను. పాపం మీరు ఏమి నోట్ కూడా చేసుకోలేదు’ అని ‘నాకు ఒక గంటలో రికార్డింగ్ ఉంది. ఒక పని చెయ్యండి మీరు ఆ ప్రశ్నలు ఇవ్వండి. నేను వీటికి సమాధానాలు రికార్డ్ చేసి కాసెట్ మీకు పంపిస్తాను. మీ ఇల్లు నాకు తెలుసు . పుష్పాలత గారి ఇల్లే కదా’ అన్నారు. ‘అవునన్నాను. రేపు సాయంత్రం మాకు dead line issue close చేస్తాము’ అన్నాను. ‘Dont worry ఆలోగా మీకు అందుతుంది’ అని ఆయన రికార్డింగ్ కి బయలుదేరారు. నేను వెళ్ళాను కానీ భయం. ప్రొఫైల్ కి లే ఔట్ కోసం ఫోటోలు ఢిల్లీ పంపేసాను. లిస్ట్ లోకూడా పెట్టేశారు ఎలాగ పంపిస్తారా లేదా ఇంగ్లీష్ లో కూడా పంపాలన్నారు. ఇన్ని ఆలోచనలతో గడిపాను.

మా ఇంటి ముందు ఒక కారు ఆగింది. అది బాలు గారి బెంజ్ కారు. అయన ముచ్చట పడి కొనుక్కున్న కారు అని చాలా ఇంటర్వ్యూలలో చెప్పారు. నేను నా బాల్కనీలో చూసి కిందకి వెల్లోలోగా అయన మెట్లమీద నించి వచ్చేస్తున్నారు. నమ్మలెకపొయాను.

మర్నాడు సాయంత్రం నాలుగు గంటలు. ఇంకో గంటలో ఆఫీసుకి వెళ్లి స్టోరీ ఫైల్ చెయ్యాలి. పైగా హఠాత్తుగా వర్షం గాలులు మొదలయ్యాయి. అప్పుడు మా ఇంటి ముందు ఒక కారు ఆగింది. అది బాలు గారి బెంజ్ కారు. అయన ముచ్చట పడి కొనుక్కున్న కారు అని చాలా ఇంటర్వ్యూలలో చెప్పారు. నేను నా బాల్కనీలో చూసి కిందకి వెల్లోలోగా అయన మెట్లమీద నించి వచ్చేస్తున్నారు. నమ్మలేకపొయాను.

‘నేను బెంగళూర్ వెళుతున్నాను. రికార్డు చేసేసాను. ఫోన్ చేసి మిమ్మల్ని రమ్మనే వ్యవధి లేదు’ అంటున్నారాయన.  లోపలకి రమ్మన్నాను. ‘ఇప్పుడు కాదు, మరోసారి భోజనానికీ వస్తాను. అమ్మాయికి చెప్పండి’ అన్నారు. ఇంతలో మా ఆవిడ వచ్చింది. ‘అమ్మా కులాసానా. పిల్లలు బాగున్నారా..మళ్ళీ వస్తాను’ అని వేణు తిరిగారు. నేను అనుసరించాను. ‘మీరు ఉండండి. కిందకి వస్తె తడిసి పోతారు. ఏమైనా డౌట్ ఉంటే నేను ఈ నంబర్ లో ఉంటాను’ అని బెంగళూర్ నంబర్ ఇచ్చారు.

ఆయన ప్రతిసారీ ఘంటసాల గారి సంస్కారం, ఔదార్యం గురించి చెప్పేవారు అటువంటి మహానుభావుల దగ్గర్నుంచి అయన చూసి నేర్చుకున్న సంస్కారం అయన చాలా సందర్భాల్లో చాలా మంది ఎదుట ప్రదర్శించారు. నిజానికి ఆయన మీడియా ప్రచారం కోసం వెంపర్లాడే స్థాయి నుంచి ఆయనకోసం మీడియా పరుగులు పెట్టే దశకు చేరుకుని చాలా కాలమైంది. ‘నా అర్హతలను గణించకుండా  నాకు ప్రాచుర్యం కల్పించిన మీడియా మిత్రులను ఎలా మరచిపో తాను’ అని ఆయన ఒకసారి అన్నమాట గుర్తుంది. తెలుగు జర్నలిస్టుల సంఘం తేజస్ అధ్యక్షుడిగా నేను ఆహ్వానిస్తే . ఆ సమావేశానికి వచ్చి బాలు చేసిన ప్రసంగాన్ని మరచిపోలేను. ఆంధ్ర క్లబ్ ఉద్యోగుల సంక్షేమం కోసం ఒక show చేయాలని ప్రముఖ సంగీత దర్శకుడు వాసూరావు నా చేత ఒక లేఖ రాయిస్తే వెంటనే అంగీకరించి అందించిన సహాయం ఇప్పటికీ అందరూ తలుచుకుంటూ ఉంటారు. ఏదైనా అనుకుంటే వెంటనే అమలు చేయటం అయన నాయకత్వ లక్షణాలలో ఒకటి. అది నేను చాలా సందర్భాలలో గమనించాను.

నేను జీవితంలో మరచిపోలేని సంఘటనలు చాలా ఉన్నాయి.. శైలజ సుధాకర్ పెళ్లికి వాళ్ల కుటుంబంలో ఒకరిగా కలుపుకుని మమ్మల్ని ఆహ్వానించి ఆదరించిన సంఘటన మేము ఎప్పటికీ మరచిపోలేను. ఇలాంటి సాన్నిహిత్యం బలపడిన రోజుల్లో ఆయనతో మరింత సన్నిహితంగా మెలిగిన రెండు సంఘటనలు బాలు గారి లో ఔన్నత్యానికి అద్దం పట్టాయి.

తరువాయి రేపు. మొదటి భాగాన్ని కింద క్లిక్ చేసి చదవండి

https://www.teluputv.com/an-intimate-tribute-to-balu

 

ఎస్.వి.సూర్యప్రకాశరావు పూర్వ సంపాదకులు,

ఇండియా టుడే.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article