Editorial

Friday, May 17, 2024
కథనాలునాగోబా జాతర తెలుపు : సయ్యద్ కరీం

నాగోబా జాతర తెలుపు : సయ్యద్ కరీం

ఆడవి బిడ్డల సంస్కృతి, సంప్రదాయలు ఆచార వ్యవహరాల పండుగ నాగోబా జాతర ప్రారంభం అయింది. సోమ వారం రాత్రి కేస్లాపూర్​లోని నాగోబా దేవాలయంలో అట్టహాసంగా సంప్రదాయ పూజలతో మొదలయ్యాయి. గంగాజలంతో వచ్చి మర్రిచెట్టు నీడన సేదతీరిన ఆదివాసులు నాగదేవతను అభిషేకించి మహా క్రతువును ప్రారంభించారు.

సయ్యద్ కరీం

నాగోబా జాతర మెస్రం వంశీయుల జీవన విధానంతో ముడిపడి ఉంది. అనాదిగా వస్తున్న ఆచార వ్యవహారాలకు నాగోబా తలమానికంగా నిలిస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉండే మెస్రం వంశీయులు నాగోబాను దర్శించుకోవడం వారి సంస్కృతి నుంచి పుట్టిన ఆనవాయితీ.

పుష్యమాసం అమావాస్య రోజునా ప్రారంభం అయ్యే నాగోబా జాతర ఆరు రోజుల పాటు కోనసాగుతుంది. సోమ వారం నాగోబా ఆలయ ప్రాంగణంలో ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడ్డాయి. వివిధ ప్రాంతాల నుంచి ఎడ్ల బండ్లపై ఆదివాసులు కేస్లాపూర్​ చేరుకుంటున్నారు. మట్టికుండలతో తెచ్చిన గంగాజలంతో అర్థరాత్రి తుడంమోతలు, సన్నాయి వాయి ద్యాల నడుమ నాగోబ దేవతను అభిషేకించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంస్కృతి కి అద్దం పట్టేలా పూజలు

​ప్రపంచంలోనే రెండవ ఆదివాసీ జాతరల్లో కేస్లాపూర్​ జాతర ఓకటి. రాష్ట్రపండుగగా గుర్తింపు పొందిన ఆదిలాబాద్​ జిల్లాలోని కేస్లపూర్​లోని నాగోబా జాతర మహాపూజల కోసం గోదావరి నది నుండి పవిత్ర జలం తీసుకవచ్చి వడమర్ర(మర్రిచెట్టు) వద్ద ఉంచిన విషయం తెలిసిందే. ఆ అపురూప వీడియో ఇక్కడ చూడండి.

మొదట మెస్రం వంశీయులు వారి వంశ దేవతలు ఉన్న కేస్లాపూర్​ గ్రామంలోని మురాడి దేవుడు వద్దకు వెళ్లి సంప్రదాయ పూజలు చేశారు. అక్కడి నుండి నాగోబా విగ్రహాంతో , పూజ సామాగ్రి, దీపాలు, కలశాలతో తీసుకుని మర్రిచెట్టు వద్దకు వచ్చారు. మర్రిచెట్టు వద్ద గూడారాలలో బస చేసిన మెస్రం వంశీయులు పవిత్ర గంగాజలం మరియు ఘారి దేవతను తీసుకుని సంప్రదాయ వాయిద్యాలు, డోలు, తుడుం, కాళీకోమ్​, పిప్రి, కిక్రిలు వాయిస్తూ నాగోబా ఆలయానికి చేరుకున్నారు. ఆలయం ముందు ఉన్న మైసమ్మ దేవతకు ప్రత్యేక పూజలు చేసి ఆలయాన్ని సందర్శించారు. నాగోబా దేవత దర్శనం అనంతరం సంప్రదాయ పూజలు ప్రారంభించారు.

‘కితల’ వారిగా కుండల పంపిణి

​ఆలయ ప్రాంగణంలో సిరికొండ నుండి తీసుకవచ్చిన కొత్త కుండలకు పూజలు చేశారు. మెస్రం వంశీయులు 22 కితలు (వర్గాలు) వారీగా కొత్త కుండలను ఇవ్వగా మెస్రం వంశంలోని మహిళలు, ఆడపడుచులు మెస్రం పెద్దల ఆశీర్వాదం తీసుకుని కుండులను అందుకున్నారు. మెస్రం వంశంలోని ఆడపడుచులకు ఆ కుండాలను వంశ పెద్దలు అందించారు. అక్కడి నుండి మర్రిచెట్టు వద్ద ఉన్న పవిత్ర బావి (కోనేరు) నుండి వంశ అల్లుళ్ళ ఆ కొండలలో నీరు నింపగ ఆడపడుచులు కుండాలను నెత్తి పై పెట్టుకొని నాగోబా టెంపుల్ ఆవరణలోకి చేరుకున్నారు.

ప్రధాన్​ కితకు చెందిన ప్రధాన్​లు సంప్రదాయ వాయిద్యాలైన డోలు, పిప్రి, కాళీకోమ్​లు వాయించగా ఆలయం పక్కనే గత పాత మట్టి పుట్టలను అల్లుళ్లు తవ్వారు. ఆ మట్టితో ఆడపడుచులు ఉండలతో నూతన పుట్టను తయారు చేశారు. ఈ ఉండలతో ఏడు వరుసలతో కూడిన బౌల దేవతతో పాటుగా సతీ దేవతలను ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయలకు అడ్డం పట్టేలా సంప్రదాయ పూజలు చేసారు

మహా పూజలు

​రోజుల వారీగా పూజలు ముగించిన మెస్రం వంశీయులు పుష్యమాసం అమావాస్యను పురస్కరించుకుని గోదావరి నుండి తెచ్చిన పవిత్ర గంగాజలంతో టెంపూల్​ ఆవరణంత శుద్ది చేసి నాగోబాకు జలాభిషేకం చేసి మహాపూజలు చేశారు. మహాపూజల అనంతరం నాగోబా ఆలయ అవరణలో మెస్రం వంశీయులు, అధికారులు, భక్తులతో కలసి పూజలు నిర్వహించి జాతరను ప్రారంభించారు.

సోమవారం అర్థరాత్రి దాటిన తరువాత మెస్రం వంశంలో కొత్తగా పెళ్లయిన వారు, ఇప్పటి వరకు నాగోబాను దర్శించుకోని మెస్రం కోడళ్లు తెల్లటి దుస్తులు ధరించి భేటింగ్​ (పరిచయం)లో పాల్గోన్నారు. ముందుగా భేటింగ్​కు వచ్చిన కోడళ్లకు మెస్రం వంశం మహిళల సహకారంతో నాగోబా ఆలయం, సతి దేవత ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించి దేవతలను చూపించారు. అనంతరం ఆలయంలో వరసలో కూర్చుని మెస్రం వంశ పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ భేటింగ్​ కార్యక్రమంతో వారు పూర్తగా మెస్రం వంశంలో చేరినట్లుగా భావిస్తారు. ఇలా రెండు రోజుల పాటు ఆయా దేవతలకు మెస్రం వంశీయులు పూజలు చేస్తారు.

సయ్యద్ కరీం సీనియర్ జర్నలిస్ట్. ఆదిలాబాద్

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article