Editorial

Sunday, May 12, 2024
Audio Columnజాతికి ఖ్యాతి నందించు శక్తి గురువు

జాతికి ఖ్యాతి నందించు శక్తి గురువు

జాతికి ఖ్యాతిని తెచ్చే రేపటి పౌరుల కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా మంచిదే. వారిలో జవసత్వాలు నింపే ఉపాధ్యాయుల పట్ల ఎనలేని గౌరవం పెంచడానికి ఎన్ని విధాలా కృషి చేసినా తక్కువే. అందుకే ఈ పద్యం.
ఉపాధ్యాయుల ప్రాముఖ్యతను తేటతెల్లం చేస్తూ, మహత్తర శక్తిగా ఆ గురుదేవుల కృషిని మనసారా అభినందించే రచన ఇది. విద్యార్థులకు స్పూర్తినిచ్చే గొప్ప పద్యమిది. రచన శ్రీ ఆముదాల మురళి. గానం శ్రీ కోట పురుషోత్తం.

సాహిత్య ప్రక్రియలో విశిష్టమైన పద్య ప్రశస్తిని గుర్తించిన కోట పురుషోత్తం తిరుపతి నివాసి. వారు రాగయుక్తంగా ఆయా పద్యాలను ఆలపిస్తూ విద్యార్థుల మనసులో నాటుకునేలా చేయడంలో విశేష అనుభవం గడించారు. సులభంగా తాత్పర్యం బోధపడేలా ఉండే అనేక పద్యాలను వారు ఎంచుకుని, కొందరితో రాయించి మరీ వాటిని తానొక నిధిగా సమకూర్చుకున్నారు. నిజానికి వారు పద్యం కోసమే కదలడం జీవన శైలిగా చేసుకోవడం విశేషం. పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే కొన్ని వేల మంది బాలబాలికలు, యువతీ యువకుల్లో పద్యం పట్ల ఆసక్తిని రగిల్చిన వారు ‘తెలుపు’ కోసం ఈ శీర్షిక నిర్వహిస్తారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article