Editorial

Sunday, May 12, 2024
కథనాలుధనసరి అనసూయ అలియాస్ సీతక్క : ఆదివాసీలకు తలలో నాలుక - కాంగ్రెస్ భవితకు భరోసా

ధనసరి అనసూయ అలియాస్ సీతక్క : ఆదివాసీలకు తలలో నాలుక – కాంగ్రెస్ భవితకు భరోసా

గుడిసెలు కాలి  నలభై కుటుంబాల విలవిలలాడుతుంటే ఆదివాసీలకు కొండంత అండగా నిలబడ్డ సీతక్క తీరు తెలుపు వ్యాసం ఇది. తానెవరో తెలియజేసే కథనమూ ఇది.

ములుగు జిల్లా మంగపేట మండలంలోని శనగకుంట గ్రామంలో 40 పేద ఆదివాసి గుడిసెలు కాలి బూడిద అయిపోయిన నేపథ్యంలో శాసన సభ్యురాలు సీతక్క వారిని పరామార్శించి ధైర్యం చెప్పి చేతనైన సహాయం కోసం విజ్ఞప్తి చేశారు.

ఆదివాసీలకు తలలో నాలుకలా ఉన్న సీతక్క వారి నిస్సహాయ పరిస్థితిని గుండెల్ని పిండేసే వీడియో ద్వారా చూపుతూ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.

ఒకరినొకరు తిట్టిపోసుకునే రాజకీయాలు మాని ప్రజల కష్టాలు పట్టించుకునే లీడర్ల అవసరం ఇప్పుడు మరింత ఉంది. ఆ దిశలో సీతక్క తిరుగులేని నేతగా ఎదిగారు. గుడిసెలు కాలిపోయిన ఆదివాసీల కోసం  మనసున్న వాళ్ళు కనికరించండని, ఆదుకోమని వారు ఈ వీడియో ద్వారా కోరుతున్నారు.

ఆమె మాటల్లో ఆ విషాదాన్ని వినండి.

 

ప్రజలతో మమేకం కావడంలో ఆమె తర్వాతే ఎవరైనా…

ఉమ్మడి వరంగల్ జిల్లా లో జనశక్తి సాయుధ పోరాటంలో మహిళా నక్సలైట్‌గా, దళం లీడర్‌గా పని చేసిన సీతక్క వివిధ హోదాల్లో దాదాపు రెండు దశాబ్దాల విప్లవోద్యమ జీవితం గడిపారు. అజ్ఞాత జీవితానికి గుడ్‌బై చెప్పి జన జీవన స్రవంతిలోకి వచ్చ్చాక ఆమె ఎల్.ఎల్.బి చదివారు. సామాజిక సేవలో చురుకుగా కొంతకాలం ఉన్నారు. తర్వాత తెలుగుదేశం తరపున 2004లో మొదటిసారి బ్యాలెట్ పోరులో దిగారు.కానీ మొదట ఓడిపోయారు. 2009 ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా టిడిపి తరపు నుండి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదెం వీరయ్యపై గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత జరిగిన 2014లో ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థినిగా ఓడిపోయారు. ఆ తర్వాత టీడీపీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టిఆరెస్ అభ్యర్థి అజ్మీర చందూలాల్ పై 22,671 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో అత్యంత ప్రజాదరణ ఉన్న యువనాయకురాలిగా రాష్ట్రంలో మంచి ఆదరణ ఉన్న నేతగా ఎదిగారు. సమస్యలు ఎక్కడుంటే అక్కడ ఉంటూ వాటి పరిష్కారానికి శక్తి సామర్థ్యాలను వెచ్చించడం ఆమెను ఇతర రాజకీయ నాయకులకు భిన్నంగా ఉంచుతోంది. విప్లవ ఉద్యమంలో ఉన్నప్పటి మాదిరే నేడూ ప్రజలతో మమేకమై ఉండటం ఆమెను రాజకీయాలకు అతీతంగా ఎందరినో అభిమానులుగా మార్చుతోంది. 

నక్సలైట్ గా ‘సీతక్క’గా ప్రజల్లోకి వెళ్ళినప్పటికీ ఆమె అసలు పేరు ‘ధనసరి అనసూయ’.

అధికారంలో ఉన్నవారికీ ఏమాత్రం తీసుపోని విధంగా సీతక్క ప్రజలతో మమేకం అవుతారు. వారికి గొప్ప సౌకర్యాలు కల్పించలేకపోవచ్చు. కానీ వారి కష్టసుఖాల్లో తానున్నాను అన్న భరోసా కల్పించడంలో ఆమె విజయం సాధించారు. అత్యంత క్లిష్టమైన కరోనా కాలంలో అలుపెరగకుండా ఆమె చేసిన సేవలే అందుకు ప్రభల నిదర్శనం.

అత్యంత క్లిష్టమైన కరోనా కాలంలో అలుపెరగకుండా ఆమె చేసిన సేవలే అందుకు ప్రభల నిదర్శనం.

నక్సలైట్ గా ‘సీతక్క’గా ప్రజల్లోకి వెళ్ళినప్పటికీ ఆమె అసలు పేరు ‘ధనసరి అనసూయ’. విప్లవ రాజకీయాల నుంచి ప్రధాన స్రవంతి రాజకీయాల్లోకి వచ్చాక ఆమె తిరిగి ‘అనసూయ’ కాలేదు. చేష్టలుడిగి ఉండిపోలేదు. అదే ‘సీతక్క’లా ప్రజల్లో ఆదరాభిమానాలను పెంచుకుందే గానే తగ్గించు కోలేదు.

స్థానికంగా ఆదరణ పొందుతూ రాష్ట వ్యాప్త్యంగా అభిమానులను పెంచుకుంటూ వస్తోన్న సీతక్క రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాల్లో అంత్యంత విశ్వసనీయమైన నేతగా ఎదిగిపోవడం ఒక విశేషం.

అనునిత్యం ప్రజలతో మమేకం కావడం, సమస్యలు ఎక్కడుంటే అక్కడ తానుండటంతో పాటు పండుగలు, పబ్బాలు, జాతరలకు తాను నియోజకవర్గంతో పాటు ఆదివాసీలందరికీ అందుబాటులో ఉండటం ఆమె ప్రత్యేకత. అంతేకాదు, ప్రజా జీవితాలను అల్లుకుంటూ అదే ధోరణిలో సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ సాగిపోవడం ఆమె మరో ప్రత్యకత.

ఒక్కమాటలో తలలో నాలికల ఉంటూ వారి అడుగులో అడుగు వేస్తూ స్థానికంగా ఆదరణ పొందుతూ రాష్ట వ్యాప్త్యంగా అభిమానులను పెంచుకుంటూ వస్తోన్న సీతక్క రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాల్లో అంత్యంత విశ్వసనీయమైన నేతగా ఎదిగిపోవడం ఒక విశేషం. భవిష్యత్ కాంగ్రెస్ అధికార పోరులో ఆమె మొదటి శ్రేణి నాయకురాలిగా రాటుదేలుతుండటం గమనార్హం.

స్థానిక సమస్యలు కాదని దేశ రజకీయాల వైపు అధిక ప్రసగం చేస్తున్న టిఆర్ ఎస్ ని బలంగా ఎదుర్కొనే కాంగ్రెస్, బిజెపి నేతల్లో ఇప్పటికిప్పుడు ఆమెను మించిన యువనేత మరొకరు లేరనే చెప్పాలి.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article