Editorial

Thursday, May 2, 2024
Peopleమేడారం జాతర అతడి పాట : పద్మశ్రీ రామచంద్రయ్యకు అభివాదం తెలుపు

మేడారం జాతర అతడి పాట : పద్మశ్రీ రామచంద్రయ్యకు అభివాదం తెలుపు

రామచంద్రయ్య గారు ఒక చారిత్రికసంపద. ఆయా తెగల వంశ చరిత్రలను పారాయణం చేసిన నేటి తరానికి అందిస్తున్న వంతెన. బహుశా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మిగిలిపోయిన చివరి గాయకుడు అనే చెప్పాలి. అతను వివాహాలలో, అంత్యక్రియల వద్ద పాడతారు. అంతకన్నా ముఖ్యం అతను ఎల్లప్పుడూ ‘సమ్మక్క సారలమ్మ మేడారం జాతరలో పాడతారు. చరిత్రను సంస్కృతిని భావితరాలకు అందిస్తున్న మా మణుగూరు గిరిపుత్రుడిని పద్మశ్రీ వరించిన సందర్భంగా వందనం…అభివందనం…

మిమిక్రీ రమేష్ 

నేడు పద్మశ్రీ పురస్కారం అందుకున్న మరో మహనీయులు రామచంద్రయ్య గారు. వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కూనవరం గ్రామానికి చెందిన వారు. నిరక్షరాస్యులైన రామచంద్రయ్య కంఠనాళం కోయ తెగకు సంబంధించిన అనేక మౌఖిక చరిత్రల నిధి. తెలుగులోనూ కోయ భాషలోనూ వారి స్వరపేటిక అనేక చారిత్రిక గాథలను ఆలపిస్తుంది.

కోయ తెగకు (డోలి) ఉప కులానికి చెందిన ఆయన ఆయా తెగల వంశ చరిత్రలను పారాయణం చేసిన  రామచంద్రయ్య బహుశా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మిగిలిపోయిన చివరి గాయకుడు అనే చెప్పాలి. అతను వివాహాలలో, అంత్యక్రియల వద్ద పాడతారు. అంతకన్నా ముఖ్యం అతను ఎల్లప్పుడూ ‘సమ్మక్క సారలమ్మ మేడారం జాతరలో పాడతారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర. ఈ ఏడు ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారంలో జరగనుంది కూడా.

కొన్నిసార్లు ప్రదర్శనలు ఇవ్వడానికి ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర సరిహద్దును దాటి కూడా వెళుతుంటారు. ఇప్పటికే అక్కడ ప్రజలు కోయ భాషలో పాటలు కోరుకుంటున్నారని అయన సంతోషంగా వివరిస్తారు.

వారు కొన్నిసార్లు ప్రదర్శనలు ఇవ్వడానికి ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర సరిహద్దును దాటి కూడా వెళుతుంటారు. ఇప్పటికే అక్కడ ప్రజలు కోయ భాషలో పాటలు కోరుకుంటున్నారని అయన సంతోషంగా వివరిస్తారు.

1896 నాటి గోదావరి జిల్లా గెజిట్ లో కోయాలలో డోలి సమాజాన్ని ‘ప్రొఫెషనల్ బిచ్చగాళ్ళు’గా వర్ణించారు. వారి విధులు పూజారిల వంటివి. నిజానికి వారిని ‘అక్షరాస్యులు’గానే వర్గీకరించవచ్చు. కానీ వారి తెగను, స్థితి సమాజం ‘తక్కువ’గానే చూడటం విషాదకరం.

ఏమైనా రామచంద్రయ్య గారు చెప్పిన పాటలో ఈ కథ చాలా స్పష్టంగా బయటపడింది’’ అంటారు ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు.

సమ్మక్క-సారలమ్మ కథ కాకతీయ రాజవంశానికి వ్యతిరేకంగా గిరిజన స్త్రీలు చేసిన యుద్ధం గురించి వివరిస్తుంది. ప్రతాపరుద్ర రాజు తమ అడవులలో నిర్మించిన ట్యాంకుల కోసం పన్ను విధించినప్పుడు అతనిని వీరు సవాలు చేస్తారు. కోయ తెగ వారు అప్పుడు వేట-వివిధ అటవీ ఉత్పత్తుల సేకరణపై ఆధారపడి జీవించారు. వారు ఏ భూమిని సాగు చేయలేదు. కాబట్టి, రాజు సాగు కోసం బయటి వ్యక్తులను అడవిలోకి పంపాలని కోరుకున్నాడనే అర్థం. ఏమైనా రామచంద్రయ్య గారు చెప్పిన పాటలో ఈ కథ చాలా స్పష్టంగా బయటపడింది’’ అంటారు ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు.

రామచంద్రయ్య గారు అనేక కథలను చెబుతారు. ‘సమ్మక్క-సారలమ్మ’తో పాటు గరికామరాజు, పగిడిద్ద రాజు, రామరాజు, గాడి రాజు, బాపనమ్మ, ముసలమ్మ, నాగులమ్మ, సదలమ్మ మొదలైన ఆదివాసీ యోధుల కథలను కూడా వీరు గానం చేస్తారు. అటువంటి గిరి పుత్రుడికి పద్మశ్రీ ప్రకటించడం మౌఖిక చరిత్రలకు ప్రాధాన్యం ఇవ్వడంగా చూడాలి.

చివరి మనుషులుగా ఒక చరిత్రను సంస్కృతిని గానం చేసే ఇటువంటి వారు అంతరార్థం కాకమునుపే వారి కృషికి గౌరవంలభించడం సంతోషం. పద్మశ్రీ వరించిన మా మణుగూరు గిరిపుత్రుడికి అభివందనం.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article