Editorial

Tuesday, May 14, 2024
ఔషధ విలువల మొక్కలుబృహతి పత్రం - నాగమంజరి గుమ్మా తెలుపు

బృహతి పత్రం – నాగమంజరి గుమ్మా తెలుపు

ఔషధ విలువల మొక్కలు ( 2 ) : బృహతిపత్రం

చేదు రుచిని గల్గు శ్రీ గణపతి పత్రి
జ్వరము, కఫము కట్టు వాంతులున్ను
వాకుడాకు పేర వర్ధిల్లు బృహతియే
ఏకదంతుని కిది మోకరిల్లె

నాగమంజరి గుమ్మా

ఏకదంతాయ నమః బృహతీపత్రం పూజయామి అని పూజించే ద్వితీయ పత్రానికే వాకుడాకు అని పేరు. ఇది కూడా ఔషధమే.

జ్వరం, కఫం, వాంతులు మొదలగు వ్యాధులకు ఇది ఔషధం.

పురుషుల వంధ్యత్వానికి కూడా మంచి మందు.

 

Columnist email: gnmanjari7@gmail.com

నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వారు కవిత్వం, పద్యం, గద్యం వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ప్రతి రోజూ ఒక రచనతో అనేక వాట్సప్ గ్రూపుల్లో వందలాది మందికి చేరువయ్యారు. ముఖ్యంగా పూవుల వర్ణన పద్యములు – పుష్పవిలాసం (1116), పండ్ల విశిష్టత తెలుపే ఫల విలాసం (108), పక్షుల గురించిన విహంగ విలాసం (108), సముద్ర జీవుల గురించి రాసిన జలచర విలాసం (108), – వీటి ప్రశస్తిని శతకాలుగా రచించారు. ప్రస్తుతం శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు అందించే చిత్రాల సహకారంతో ప్రతి రోజూ ఒక్క మొక్క తాలూకు ఔషధ విలువలను పద్యం సహితంగా అందిస్తున్నారు.

వస్తుగుణ దీపిక, బసవ రాజీయం, చరక సంహిత, సుగుణ రత్నాకరం మొదలైన ఆయుర్వేద గ్రంధాలను పరిశీలించి, సంక్షిప్తగా నాగమంజరి గుమ్మా అందిస్తున్న ఈ రచనలను ప్రతి రోజూ తెలుపు అందిస్తుందని చెప్పడానికి సంతోషంగా ఉంది.

మన ప్రాంతీయ మొక్కలలోని ఔషధ గుణాలు గురించిన ఈ సమాచారం ఎంతో విలువైనదే. అలా అని వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగించకూడదని నాగామంజరి గారి మనవి.

Medicinal Plant

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article