Editorial

Sunday, April 28, 2024
ఔషధ విలువల మొక్కలుశతావరి/పిల్లపీచర : నాగమంజరి గుమ్మా తెలుపు

శతావరి/పిల్లపీచర : నాగమంజరి గుమ్మా తెలుపు

పిల్లపీచరనుచు పిలుచు శతావరి
వందరోగములను బాపునంట
పాముకాటు , దగ్గు, జ్వరము, కడుపుమంట
రక్తశుద్ది వంటి రకరకములు
నాగమంజరి గుమ్మా

ఆయుర్వేద వైద్యంలో ప్రముఖంగా శతావరి లేహ్యం, శతావరి పొడి లభిస్తూఉంటాయి. వంద వ్యాధులను నివారించగలదు అని శతావరికి అర్ధం.దీన్నే తెలుగులో పిల్లపీచర అంటారు. కడుపు, గొంతు, రక్తం శుభ్రంగా ఉంటే వంద రోగాలు రాకుండా చేసినట్లే. శతావరి ఈ మూడు భాగాలను సురక్షితంగా ఉంచుతుంది. సౌందర్య లేపనాల లో కూడా శతావరి ఉపయోగిస్తారు.

వంద వ్యాధులను నివారించగలదు అని శతావరికి అర్ధం.

Columnist email: gnmanjari7@gmail.com

నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వారు కవిత్వం, పద్యం, గద్యం వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ప్రతి రోజూ ఒక రచనతో అనేక వాట్సప్ గ్రూపుల్లో వందలాది మందికి చేరువయ్యారు. ముఖ్యంగా పూవుల వర్ణన పద్యములు – పుష్పవిలాసం (1116), పండ్ల విశిష్టత తెలుపే ఫల విలాసం (108), పక్షుల గురించిన విహంగ విలాసం (108), సముద్ర జీవుల గురించి రాసిన జలచర విలాసం (108), – వీటి ప్రశస్తిని శతకాలుగా రచించారు. ప్రస్తుతం శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు అందించే చిత్రాల సహకారంతో ప్రతి రోజూ ఒక్క మొక్క తాలూకు ఔషధ విలువలను పద్యం సహితంగా అందిస్తున్నారు.

మన ప్రాంతీయ మొక్కలలోని ఔషధ గుణాలు గురించిన ఈ సమాచారం ఎంతో విలువైనదే. అలా అని వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగించకూడదని నాగమంజరి గారి మనవి.

Medicinal Plant

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article