Editorial

Tuesday, May 14, 2024
ఔషధ విలువల మొక్కలుతుమ్మ : నాగమంజరి గుమ్మా తెలుపు

తుమ్మ : నాగమంజరి గుమ్మా తెలుపు

ఔషధ విలువల మొక్కలు ( 45 ) : తుమ్మ

తుమ్మ కలప గట్టి తుమ్మపూలు పసిడి
తుమ్మకాయ గజ్జె తురుగలించు
చెరువులందు పుట్టు చెలువుగ నలతుమ్మ
తుమ్మ కీటనాశి నమ్మకముగ
నాగమంజరి గుమ్మా

తుమ్మ ఆకులు జీలకర్ర, వాము కలిపి కాచిన కషాయం తాగితే డయేరియా తగ్గుతుంది. బెరడుతో చేసే కషాయం కూడా ఇలానే పనిచేస్తుంది.

రోజూ తుమ్మ బెరడును నములుతుంటే పంటి సమస్యలు తగ్గిపోతాయి. కదిలే పళ్ళు గట్టిపడతాయి. చిగుళ్ల వాపులు తగ్గుతాయి.

కొద్దిగా బొగ్గుపొడి, తుమ్మబెరడు చూర్ణం, పటికపొడి, కొద్దిగా సైంధవ లవణం కలిపిన పౌడర్ తో రోజూ పళ్ళు తోముకుంటె ఎటువంటి దంత సమస్యలు దరిచేరవు. ఇది అనేక రకాల దంత సమస్యలను నివారిస్తుంది.

Columnist email: gnmanjari7@gmail.com

నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వారు కవిత్వం, పద్యం, గద్యం వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ప్రతి రోజూ ఒక రచనతో అనేక వాట్సప్ గ్రూపుల్లో వందలాది మందికి చేరువయ్యారు. ముఖ్యంగా పూవుల వర్ణన పద్యములు – పుష్పవిలాసం (1116), పండ్ల విశిష్టత తెలుపే ఫల విలాసం (108), పక్షుల గురించిన విహంగ విలాసం (108), సముద్ర జీవుల గురించి రాసిన జలచర విలాసం (108), – వీటి ప్రశస్తిని శతకాలుగా రచించారు. ప్రస్తుతం శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు అందించే చిత్రాల సహకారంతో ప్రతి రోజూ ఒక్క మొక్క తాలూకు ఔషధ విలువలను పద్యం సహితంగా అందిస్తున్నారు.

మన ప్రాంతీయ మొక్కలలోని ఔషధ గుణాలు గురించిన ఈ సమాచారం ఎంతో విలువైనదే. అలా అని వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగించకూడదని నాగమంజరి గారి మనవి.

Medicinal Plant

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article