Editorial

Monday, May 20, 2024
వ్యాసాలుబీమ్లా నాయక్ blockbuster hit ఆని చెప్పలేనితనానికి కారణాలివే!

బీమ్లా నాయక్ blockbuster hit ఆని చెప్పలేనితనానికి కారణాలివే!

సినిమా సూపర్ డూపర్ హిట్టు అనకుండా ప్రస్తుతానికి డివైడెడ్ టాక్ సొంతం చేసుకోవడానికి అన్ని కారణాలూ ఉన్నాయ్. నిజానికి సినిమా బ్లాక్ బస్టర్ హిట్. కానీ చెప్పలేరు. అంతర్గతంగా దాగిన బలహీన అంశాలేమిటో తెలుపు విశ్లేషణ ఇది.

కందుకూరి రమేష్ బాబు

అహంకారానికి ఆత్మగౌరవానికి మడిమ తిప్పని పోరాటంగా మన ముందుకు వచ్చిన ‘బీమ్లా నాయక్’  సినిమా ఈ ఉదయం విడుదలైంది. ఇప్పటికీ ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టే ఐనప్పటికీ ఆ మాట చెప్పడానికి ఎవరూ సిద్దంగా లేరు. అభిమానులు కూడా సినిమా విజయం గురించి ఒక్క మాటలో చెప్పలేని అశక్త స్థితి. ఎందుకూ అంటే కనీసం ఏడు కారణాలను ప్రధానంగా చెప్పవచ్చు.

ఒకటి, కథానాయకులు ఇద్దరు కావడం.

అవును. ఆ సమస్య ఉంది. అందుకు సినిమా ఇతివృత్తంలోనే కారణం ఉంది.  అది ఆత్మగౌరవానికి అహంకారానికి నడుమ ఏర్పడిన ద్వంద యుద్దానికి సంబంధించిన వైరుధ్యం. అందుకే ఈ రెండూ బలమైన ఇమోషన్లే. ఇద్దరూ అధ్బుతంగా చేశారు. హీరో ఎవరూ అంటే ఒకరని చెప్పలేం. కాబట్టి ఇద్దరు హీరోలు కావడం వల్ల కూడా విజయం ఒక్క మాటలో చెప్పలేని స్థితి నెలకొందని చెప్పొచ్చు.

రెండు, కథ స్వతంత్రం కాకపోవడం.

మలయాళ కథను తెలుగుకు తగ్గట్టు అనువదించడంలో ఒక సమస్య ఉన్నది.

ఎంత లేదన్నా కథ అనుసరణ (Received) కావడం వల్ల అభిరుచి ఉన్న ప్రేక్షకులు ఈ సినిమాను మాతృకతో పోల్చడం, పెదవి విరవడం కూడా అనివార్యంగా ఉన్నది. అది సహజం కూడా. అది కూడా బీమ్లా నాయక్ సినిమాను దానికదే ఒరిజినల్ గా చూసి అభిప్రాయం చెప్పడానికి అడ్డుగా నిలిచింది.

మూడు, ఇద్దరు డైరెక్టర్లు సినిమా తీయడం.

కథను తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టు రాసేందుకు, తనదైన మాటలకోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ ని పూర్తిగా వాడుకుంటూనే సినిమా దర్శకత్వం యువ దర్శకుడు సాగర్ కె చంద్రకి అప్పగించడంలో బలహీనత ఉన్నది. నిజానికి ఒకరినే ఎన్నుకుంటే బాగుండేది. త్రివిక్రమ్ సహాయం తీసుకున్నా తెరమీద పేరుకే పరిమితం చేస్తే సరిపోయేది. కానీ ఇద్దరు దర్శకులు ఒకే సినిమాకు పని చేపించడం వల్ల నష్టమే ఐంది. సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ కి త్రివిక్రమ్ పూర్తిగా వేదిక మీద ఉండలేని తనం మనం చూడనే చూశాం. దర్శకుడు ద్వితీయం అవుతాడన్న భయం చిట్ట చివరి సమయంలో అర్థం చేసుకొని సాగర్ కి ప్రాధాన్యం ఇవ్వడం మొదలేట్టారు, ఇది సినిమాను కాపాడటం కన్నా సాగర్ కి కలిసి వస్తోంది గానీ మొత్తంగా యూనిట్ కి అది ఇప్పుడు కలిసి రాదు.

అదీగాక తివిక్రం వేదికపై ఇలా వచ్చి అలా వెళ్లడానికి బండ్ల గణేష్ కారణమా లేక సాగర్ కి ప్రాధాన్యం ఇవ్వడమా అన్న అంశాల్లోని వాస్తవం ఏమైనప్పటికీ అక్కడ తివిక్రం స్పీచ్ లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపించింది కూడా. ప్రి రిలేజ్ ఈవెంట్ పెద్దగా హుషారేత్తించలేదు కూడా.

సినిమా నిర్మాణంలో సాగర్ కి ఇవ్వవలసినంత ప్రాధాన్యంఇవ్వకపోవడం ఎంత తప్పో, ఇవ్వకూడనంత పేరు ( పని చేసినప్పటికీ ) త్రివిక్రమ్ కు ఇవ్వడం అంతే తప్పు కావడం అన్నదే కాదు, అసలు సమస్యకు మూలం ఈ సినిమాలో అన్నింటా ‘రెండు’ అనివార్యం ఐనట్టే ఇద్దరు దర్శకులను నిమగ్నం చేయడం.

దాంతో ఒక సినిమాకు ఒక దర్శకుడు ఫోకస్ గా ఉన్న్నపుడు ఉండే బలం అంతిమంగా ఈ సినిమాకు లోపించింది. కాబట్టే సినిమాపై బలమైన అభిప్రాయం చెప్పడానికి సాగర్ ప్రతిభను మెచ్చుకోవడానికి గానీ త్రివిక్రమ్ స్క్రీన్ ప్లేను అభినందించడానికి గానీ ప్రేక్షకుడు ఇరకాటంలో పడే స్థితి. దాంతో హీరో వైపు చూడాల్సి వచ్చింది. చూస్తే అక్కడా ఇద్దరు హీరోలుండటం, వారిద్దరూ బాగా చేసి ఉండటం మరో సమస్య. చివరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై నుంచి దృష్టి వీగిపోయే ప్రమాదం ఏర్పడినట్లుంది.

నాలుగో కారణం. రెండు రాష్ట్రాల సమస్య

ఒక రాష్ట్రంలో సినిమా టికెట్లు ధర తక్కువ. ఇంకో రాష్ట్రంలో ఎక్కువ. ఈ వివాదం సినిమాను చాలా మేరకు గందరగోళంలో పడేసింది. సినిమా టికెట్ల ధర విషయంలో జగన్ కక్ష సాధింపుకు గల కారణాలు ఇంకా కొన్ని ఉన్నప్పటికీ వకీల్ సాబ్ నుంచి ఈ సినిమా రిలీజ్ వరకూ అయన పవన్  ళ్యాన్ సినిమాలు ప్రజలకు చేరువ కాకుండా తీసుకున్న చర్యలు లేదా పోకడ మరో విధంగా సినిమా కథాంశం లాంటిదే. అహంకారం, ఆత్మగౌరవానికి మధ్య పోటాపోటీ సవాల్. ఆది సినిమాకు ఆటంకంగా నిలిచింది.

ఐతే, ఆ రెండు క్యాలిటీల్లో ఏది ఎవరిదీ అని అడిగితే ఇద్దరిదీ అహం కారమే అనాలి. మధ్యలో ఆత్మగౌరవం వీగిపోయింది. ఫలితంగా ప్రేక్షకుడి ఇబ్బంది పడ్డాడు.

ఐతే, ఆ రెండు క్యాలిటీల్లో ఏది ఎవరిదీ అని అడిగితే ఇద్దరిదీ అహంకారమే అనాలి. మధ్యలో ఆత్మగౌరవం వీగిపోయింది. ఫలితంగా ప్రేక్షకుడి ఇబ్బంది పడ్డాడు. టిక్కట్ల ధర తగ్గింపు అంశం గందర గోళం సృష్టించి అది కూడా సినిమా ప్రజలకు చేరడాన్ని నిలువరించింది. అది మానసికంగానూ ప్రేక్షకులను సినిమాను ఎంజాయ్ చేయనీయకుండా చేసింది. స్పష్టమైన కామెంట్ చెప్పమంటే చెప్పలేనితనానికి ఇదీ ముఖ్య కారణం.

ఐదు, నటుడా – రాజకీయ నాయకుడా

పవన్ కళ్యాణ్ ‘సినిమా రంగానికి రాజకీయాలు నప్పవు’ అని అన్నారు ప్రి రిలీజ్ ఈవెంట్ లో. కానీ తాను చేస్తున్నది అదే. అటు రాజకీయాల్లో ఉంటూనే ఇటు సినిమాలు చేయడం అన్నది రెండు పడవల మీది నడక. ప్రయాణం. ఒక రకంగా అది తనకు ఉపయోగమే. అది తనను తాను ప్రజల్లో మరింత దగరవడానికి మేలు చేసేదే. అలాంటప్పుడు స్పష్టంగా సినిమా సూపర్ డూపర్ హిట్టు అన్న టాక్ గురించి పట్టించుకోవద్దు. మిగతా ప్రయోజనాలు తీర్చిందా లేదా అన్నదే ముఖ్యం అవుతుంది. ఆ మేరకు తాను జగన్ పై పైచేయి సాధించి ఉండవచ్చు గాక…కానీ తాను కేవలం సినిమా హీరోనా లేక రాజకీయ నాయకుడా అన్న క్లారిటీ లేకుండా చేస్తున్న ప్రయోగం వల్ల సినిమాకు డివైడెడ్ టాక్ వచ్చిందనే అనుకోవాలి. మరో సంగతి ఈ కారణంగానే జగన్ అతడి సినిమాను ‘సినిమా’గా చూడక పోవడం… దాన్ని ‘రాజకీయం’గా చూడటం. ఫలితంగా అతడి సినిమాకు అడ్డు కట్ట వేయడం.

దాన్ని ఎదుర్కోవడం అనలేము గానీ రాజకీయంగా తాను బలపడటానికి సినిమా రిలీజ్ కి ముందు పవన్ కళ్యాణ్ మత్సకారుల సమస్యపై ప్రభుత్వంపై గొంతెత్తడం…జివో కాగితాన్ని చింపడం…ఇది వైరుధ్యం కదా! అందుకే సినిమా ఎలా ఉందీ అన్న అంశం క్లారిటీ లేకుండా… రాజకీయాల నీడన పడిపొయి…అనుకున్నత హిట్టు టాక్ సొంతం చేసుకోలేదని విశ్లేషణ లేదా ఇరువర్గాలు అహంకారానికి పోయి సినిమాను ద్వితీయం చేశారని చెప్పవలసి వస్తుంది.

ఆరు, అన్నదమ్ముల వైరుధ్యం

అన్న చిరంజీవి చేతులు కట్టుకొని సాగిలబడతాడు, తమ్ముడు ఎం చేసుకుంటావో చేసుకో అని హెచ్చరిస్తాడు. ఈ అంశం కూడా తనకు సూటిగా కలిసి రాని అంశమే -రాజకీయంగా, సినిమా పరంగానూ.

ఏడు, రెండు ట్రైలర్లు విడుదల

నిజానికి కథ ఒరిజినల్ కాకపోవడం. హీరోలు ఇద్దరుండటం. రాణాను కూడా పాత్రకు తగ్గట్టు తాను గౌరవించి అతడు వీరోచితంగా పోరాడుతుంటే అంగీకరించడం. ఆ ఔదార్యం కూడా తనకు నష్టం చేసిందనే చెప్పాలి. ఇక ఇద్దరు దర్శకులతో పని తీసుకోవడం. వీటన్నటి బలహీనత రెండు ట్రైలర్లు కట్ చేపించేలా చేసింది.

ముందు చెప్పినట్టు ఇద్దరు హీరోల బీకర పోరును బ్యాలన్స్ చేయడంలో మొదట ఒక మోస్తారు ట్రైలర్ వచ్చింది. కానే అది అంతగా కిక్కు ఇవ్వలేదన్న భావం కలిగి ప్రి రిలీజ్ రోజు మరో మంత్రి కేటిఆర్ తో మరో ట్రైలర్ విడుదల చేపించారు. కానే దాదాపు అవే విజువల్స్. దాంతో రెండూ అనుకున్నంత  ఉపయోగపడలేదు.

ఎవరు హీరో అనే క్లారిటీ లేకుండా రూపొందిన సినిమా కావడంతో, పైన చెప్పిన అన్ని కారణాలు కలిసి చివరకు రెండు ట్రైలర్లు కూడా రెండు రావడం యాదృచ్చికం కాదు. అట్లా చూస్తే మొత్తం ఈ సినిమాకు సంబంధించిన అన్ని అంశాలు ద్వంద ప్రవృత్తిని తెలుపుతాయి. అవి అన్నీ కలగలసి ఈ రాత్రి  వరకు డివైడెడ్ టాక్ రావదానికే దారి చూపిందని చెప్పాలి. ఆ మేరకు జరిగింది సహజ న్యాయమే అనుకోవాలి.

ఎనిమిది, సానుకాల అంశాలు

ఇవన్నీ ఇలా ఉంటే సినిమాలో హిట్టు అయింది మటుకు నటుడు రాణా. దర్శకుడు సాగర్ కె చంద్ర. సంగీత దర్శకుడు తమన్. అలాగే- ఇద్దరు జానపద గాయకులు. అందులో కిన్నెర మెట్ల మొగిలయ్య ఇప్పుడు పద్మశ్రీ అవడం మనం చూస్తున్నదే.

విశేషం ఏమిటంటే, సాగర్ అహంకారానికి ఆత్మగౌరవానికి పోకుండా మధ్య సున్నితమైన ప్లేసులో నిలబడి తాను తనను తాను స్థిమితంగా నిరూపించుకున్నాడు. చివరి నిమిషంలో తానే వేదికపై సగర్వంగా నిలిచాడు.

విశేషం ఏమిటంటే, సాగర్ అహంకారానికే కాదు, ఆత్మగౌరవానికి కూడా పోకుండా ఆ రెండిటి మధ్య  సున్నితమైన ప్లేసులో నిలబడి తాను తనను తాను స్థిమితంగా నిలుపుకున్నాడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న్నాడు. చివరి నిమిషంలో తానే వేదికపై సగర్వంగా నిలిచాడు. ఒక దర్శకుడిగా రాణా strength ను మనసారా అభినందించాడు. ఇంతటి అవకాశం ఇచ్చిన ఇద్దరు నిర్మాతలను గొప్పగా కొనియాడాడు. అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఒక గజల్ తో అద్భుతంగా కీర్తించారు. సినిమాకు బ్యాక్ బోన్ ఐన తివిక్రంను ‘ఉపాధ్యాయుడిగా’  గుర్తుంచుకుంటాను అని చెప్పి నేర్పును ప్రదర్శించాడు. మంచి టెక్నీషియన్లను సైతం ప్రస్తుతించారు.

అలా – ఈ సినిమా నిర్ద్వందంగా విజయవంతం అనడానికి గల లోసుగులు తెలుపుతూ సానుకూలతలను కూడా పేర్కొంటూ మొత్తంగా ‘బీమ్లా నాయక్’ ఈ కారణాలన్నీ కలగలసిన ‘బ్లాక్ బస్టర్ హిట్’ అనే తెలుపు భావిస్తున్నది.

 

 

 

 

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article