Editorial

Thursday, May 9, 2024
OpinionTamilisai Soundararajan & గుదిబండ వ్యవస్థ - జిలుకర శ్రీనివాస్ సూటి విమర్శ

Tamilisai Soundararajan & గుదిబండ వ్యవస్థ – జిలుకర శ్రీనివాస్ సూటి విమర్శ

గవర్నర్లు చాలామంది తమను నియమించిన పార్టీ ప్రతినిధులుగా వ్యవహరించడం చూశాము. తమకు నచ్చని రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టే పనులు చేయడం చూశాము. ఇప్పుడు తెలంగాణ గవర్నరు బిజెపి నాయకురాలిగా ప్రవర్తించడం ఆ పదవి అవసరమా కాదా అనే చర్చకు తావిస్తోంది.

జిలుకర శ్రీనివాస్ 

గవర్నర్ వ్యవస్థ దేశానికి ఒక గుదిబండ. వలస పాలనలో ప్రావిన్సు ప్రభుత్వాలను నియంత్రించడానికి, నచ్చకపోతే ఆ ప్రభుత్వాలను రద్దు చేయడానికి గవర్నర్ వ్యవస్థను తయారు చేశారు. గవర్నర్లు సముచిత నిర్ణయం తీసుకోవాలని, అణగారిన వర్గాలను చట్టసభలలోకి తనకున్న విశేష అధికారాలను ఉపయోగించి నామినేట్ చేయాలని డా.అంబేద్కర్ కోరారు. ఆ ప్రతిపానకు కొంతమంది మంచి గవర్నర్లు స్పందించగానే, ఆనాటి కాంగ్రెస్ వ్యతిరేకించింది. ప్రభుత్వాలలో గవర్నర్ జోక్యం వుండేది స్వరాజ్యం కాదని గాంధీ, నెహ్రూలు నిరసించారు.‌ గవర్నర్ల జోక్యం లేని ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం వుండేదే సంపూర్ణ స్వరాజ్యం అని వాళ్లు భావించారు. సంపూర్ణ స్వరాజ్యం అనే ఉద్యమాన్ని 1937 ఎన్నికల తరువాత కాంగ్రెస్ మొదలు పెట్టింది. ఇదీ చరిత్ర.

హిందూ మహాసభ ఒక రాజకీయ పార్టీగా గవర్నర్ వ్యవస్థను అంగీకరించింది. కానీ అంబేద్కర్ కు ఆ వ్యవస్థ పట్ల భిన్నమైన అభిప్రాయం వుంది.

రాజ్యాంగం రాసే సమయంలో కాంగ్రెస్ గవర్నర్ వ్యవస్థ వుండాలని పట్టుపట్టింది. కొంతమంది నాయకులను ఆ పదవులిచ్చి సంతోషపెట్టాలని ఆ పార్టీ ఆలోచన. హిందూ మహాసభ ఒక రాజకీయ పార్టీగా గవర్నర్ వ్యవస్థను అంగీకరించింది. కానీ అంబేద్కర్ కు ఆ వ్యవస్థ పట్ల భిన్నమైన అభిప్రాయం వుంది.

రాష్ట్రపతి దేశానికి సార్వభౌముడు. అయితే ఆయన ప్రజలు ఓట్లేసి గెలిపించిన ప్రతినిధుల ఓట్ల ద్వారా ఎన్నికవుతాడు. కాబట్టి రాష్ట్రపతికి స్వయంప్రతిపత్తి లేదు. పార్లమెంటు నిర్ణయాలకు ఆమోద ముద్ర వేయటమే ఆయన పని. తనకు నచ్చని చట్టాలను ఆయన పార్లమెంటు పరిశీలన కోసం వెనక్కి తిప్పి పంపగలడు. కానీ ఆ చట్టాలను రద్దు చేయలేడు. అలా సమాఖ్య ప్రభుత్వానికి రాష్ట్రపతి (ఆడవాళ్లు ఆ పదవిలోకి వచ్చినా ఆ పదం మారదు. ఆమెను రాష్ట్రపతి అనే పిలుస్తారు). రాష్ట్రపతి తన ప్రతినిధిగా గవర్నర్లను రాష్ట్రాలలో నియమిస్తాడు. ఇలా అనడం కూడా సరైనది కాదు. ప్రధాన మంత్రి తనకు నచ్చిన వ్యక్తిని క్యాబినెట్ ఆమోదంతో గవర్నర్ గా ప్రతిపాదిస్తూ రాష్ట్రపతికి లేఖ రాస్తాడు. ఆ ప్రతిపాదనను ఆమోదిస్తూ రాష్ట్రపతి ఆ వ్యక్తిని గవర్నరుగా నియమిస్తాడు. అంటే ప్రధాన మంత్రితో రాజకీయ ఏకాభిప్రాయం గల వ్యక్తులు ఆ పదవిలోకి వస్తారు.

నిజానికి వాళ్లు రాష్ట్రపతికి లోబడి పని చేయాలి. తమ సమస్యలను లేదా రాష్ట్ర ప్రభుత్వం చేసే పాలనలోని సమస్యలను రాష్ట్రపతికి నివేదించాలి. కానీ గవర్నర్లు చాలామంది తమను నియమించిన పార్టీ ప్రతినిధులుగా వ్యవహరించడం చూశాము. తమకు నచ్చని రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టే పనులు చేయడం చూశాము.

కెసిఆర్ తో బిజెపి పోరాటం రాజకీయమైనది. అదే బాటలో గవర్నర్ నడవడం మంచి సంప్రదాయం కాదు.

ఇప్పుడు తెలంగాణ గవర్నరు తమిళిసై సౌందరరాజన్ బిజెపి నాయకురాలిగా ప్రవర్తించడం ఆ పదవి అవసరమా కాదా అనే చర్చకు తావిస్తోంది. ఆమె మోదీని కలవడమే ఆమె రాజకీయ ఉద్దేశ్యాలను తెలుపుతుంది. కెసిఆర్ తో బిజెపి పోరాటం రాజకీయమైనది. అదే బాటలో గవర్నర్ నడవడం మంచి సంప్రదాయం కాదు. ఆమె తల్లి చనిపోతే మందలించాలని ఏ నిబంధనలో వుంది. ఆమె ఉగాది శుభాకాంక్షలు తెలిపితే, ముఖ్యమంత్రి స్పందించాలని కోరడమేమిటి? అవి ప్రోటోకాల్ కిందికి వస్తాయా? అవేమైనా రాజ్యాంగ సమస్యలా? ఒక గవర్నరుగా వున్న వ్యక్తి ఇలాంటి వ్యక్తిగత సమస్యలను రాజ్యాంగ సమస్యలుగా బహాటంగా చర్చించొచ్చా? ఇది ఎవరూ ఒప్పుకోలేని ప్రవర్తన.

ఒకప్పుడు ఇందిరాగాంధీలా, ఇప్పుడు మోదీ ఇద్దరూ గవర్నర్ వ్యవస్థను, న్యాయ వ్యవస్థను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాడు.

ఒకప్పుడు ఇందిరాగాంధీలా, ఇప్పుడు మోదీ ఇద్దరూ గవర్నర్ వ్యవస్థను, న్యాయ వ్యవస్థను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాడు. గవర్నరు వ్యవస్థ లేకపోయినా దేశానికీ వచ్చే నష్టం ఏమీ లేదు. తమిల సై బాధతో తెలంగాణ ప్రజలకు ఏమీ సంబంధం లేదు. ఇది బిజెపి ఆడిస్తున్న రాజకీయ నాటకం తప్పా మరోటి కాదు.

జిలుకర శ్రీనివాస్ దళిత బహుజన మేధావి. కవీ, మూలవాసీ విమర్శకులు. ద్రావిడ బహుజన సమితి వ్యవస్థాపకులు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article