Editorial

Saturday, May 18, 2024
అభిప్రాయం"ఫాస్ట్ ట్రాక్ న్యాయం - రైల్వే ట్రాక్ పై" - 'ట్రాక్ మన్స్' సాక్ష్యం

“ఫాస్ట్ ట్రాక్ న్యాయం – రైల్వే ట్రాక్ పై” – ‘ట్రాక్ మన్స్’ సాక్ష్యం

 సామాజిక మాధ్యమాల్లో ఒకరు నర్మగర్భంగా “ఫాస్ట్ ట్రాక్ న్యాయం, రైల్వే ట్రాక్ పై” అన్న అర్థం వచ్చేలా పోస్టు పెట్టడం విశేషం.

సైదాబాద్ రేప్ కేస్ నిందుతుడు రాజుని పట్టిస్తే ప్రభుత్వం పది లక్షల రివార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. మంత్రి కేటీఆర్  పొరబాటుగా చేసిన TWEET, దానికి సవరణా చూసిందే. అతడిని ఎదో ఒక విధంగా ఎన్ కౌంటర్ చేస్తారని అందరూ ఊహించినదీ నిజమే. కానీ రేపిస్టు తనంతట తానే శిక్ష వేసుకున్నట్టు మనం భావించేలా అంతా జరిగింది. జ…రి…గి…పో…యింది.

దీంతో ఈ సారి రేపిస్టుకు శిక్ష భిన్నంగా పడినట్టు అయింది.

ఈ ఉదయం ఎనిమిది నలభై నిమిషాలకు అతడు ఆత్మహత్య చేసుకునట్టు ఘట్ కేసర్ రైల్వే ట్రాక్ పై పడి ఉన్న శవం చెబుతోంది. ఆ సమయానికి విధుల్లో ఉన్న  ‘ట్రాక్ మన్స్’ ఇద్దరు అతడిని ఆత్మహత్యకు కొన్ని నిమిషాల ముందు చూశామని, అనుమానస్పదంగా కనిపిస్తూ సమీపంలోని పొదల్లో దూరగా కాసేపు వెతికి వెళ్లామని, ఇంతలో హైదరాబాద్ వెళుతున్న ఒక రైలుకు ఎదురు వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలిసిందని, శవం ట్రాక్ పై పడిఉండటం చూశామని ఎవరో చెప్పారని, వెళ్లి చూసి తాము 100 ఫోన్ చేశామని వారు మీడియా ప్రతినిధులకు వివరించారు.

దీంతో ఈ సారి రేపిస్టుకు శిక్ష భిన్నంగా పడినట్టు అయింది.

కాగా, ఇంతలోనే బాధిత కుటుంబాన్ని మంత్రి సత్యవతి రాథోడ్ కలిసి ఓదార్చడం, ఇరవై లక్షల చెక్కు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని హామీ ఇవ్వడమూ జరిగిపోయింది.

ఆలస్యమైనా వేగంగా అంతా జరిగిపోయినట్లున్నది కదా!

అన్నట్టు, సామాజిక మాధ్యమాల్లో ఒకరు నర్మగర్భంగా “ఫాస్ట్ ట్రాక్ న్యాయం, రైల్వే ట్రాక్ పై” అన్న అర్థం వచ్చేలా పోస్టు పెట్టడం విశేషం.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article