Editorial

Tuesday, May 7, 2024
Songమంగ్లీ 'గణపతి పాట' రాసింది - 'బుల్లెట్ బండి" ఫేం లక్ష్మణే!

మంగ్లీ ‘గణపతి పాట’ రాసింది – ‘బుల్లెట్ బండి” ఫేం లక్ష్మణే!

మంగ్లీ ‘గణపతి’ పాట మళ్ళీ హిట్. ఈ పాట రాసింది ‘బుల్లెట్ బండి’ ఫేం లక్ష్మణ్ కావడం విశేషం.
వినండి…tRENDINGలో ఉన్న మరో పాప్యులర్ లిరిక్…

కందుకూరి రమేష్ బాబు

‘బుల్లెట్ బండి’ పాట తర్వాత కవి లక్ష్మణ్ మంచి ఫాంలో ఉన్నారు. మరో చక్కటి పాటతో ఇంకో మెట్టెక్కాడు. ఇప్పుడు యే వినాయక మంటపం దగ్గర చూసినా తన పాటే. ఈ సారి మంగ్లీ గొంతు తన పాటకు ప్రాణం పోయడం విశేషం.

‘లంబోదర..లంబోదర…” అంటూ మొదలైనప్పటికీ ‘గజనన గణపతి..గజ ముకుడే’  అంటూ మంగ్లీ ఎత్తుకున్న పాట యూట్యూబ్ లో trendingలో ఉంది. ఈ పాట మళ్ళీ పెద్ద హిట్.

“మట్టితో నిన్ను చేసి…చిట్టీ మండపం మేసి” అంటూ ఆహ్లాదంగా సాగే ఈ భక్తి గేయం పిల్లలను దృష్టిలో పెట్టుకొని షూట్ చేసినప్పటికీ అది యూత్ ని ఆకర్షిస్తోంది. ‘మంగ్లీ గణపతి’ పాటగా ప్రజల్లోకి బాగా వెళ్ళింది.

పాటలోని ‘గజనన గణపతి..గజ ముకుడే’ ప్రయోగం ఇప్పుడుమళ్ళీ చిందేసెలా చేస్తోంది. అంతేకాదు, ఈ పాటలో ‘డుగ్గు డుగ్గు డుగ్గు’ మాదిరే ‘గం గణాగణ గం గణేశా…గం గణాగణ గం…” యూత్ ను మామూలుగా హుషారెత్తించడం లేదు. లక్ష్మణ్ కి అభినందనలు.

యూ ట్యూబ్ లో ఉన్న ఆ పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పూర్తి పాట కింద చదవండి.

అన్నట్టు, బుల్లెట్ బండి సాంగ్ ఎందుకు వైరల్ అయిందో  తెలుపు సంపాదకీయం కూడా ఇక్కడ క్లిక్ చేసి చదవచ్చు.

 

మట్టితో నిన్ను చేసి
చిట్టీ మండపం మేసి
అడవికి పోయి పూలు పండ్లు
తెచ్చినం
పూల మాలా ఏసీ
పులిహోర నైవేద్యం బేటీ
మొక్కి నీముందు
గుంజిల్లు దీసినం
మట్టితో నిన్ను చేసి
చిట్టీ మండపం మేసి
అడవిలోకెళ్లి పూలు పండ్లు తెచ్చినం
పూల మాలేసి
పులిహోర నైవేద్యం బేటీ
మొక్కి నీముందు
గుంజిల్లు దీసినం
దేవది దేవా ఆది పూజిత
ఎందుకో మా హారతి
గజనన గణపతి
గజ ముకుడే
గం గణాగణ గం గణేశా
గం గణాగణ గం…
గం గణగణ గం గణేశా
గం గణగణ గం…
గం గణాగణ గం గణేశా
గం గణాగణ గం…
గం గణగణ గం గణేశా
గం గణగణ గం…
భజనతో భక్తి జూపూ
పొగిపోతాడే…
గం గణాగణ గం గణేశా
గం గణాగణ గం…
గం గణగణ గం గణేశా
గం గణగణ గం…
సినుకమ్మ కురిసిందో
సిందేసేటోళ్ళం
మా సెను సెలకల్లో
సెమట సుక్కాలం
కాలలే కళ్ళంలో రాసులయ్యేలా
దీవించు మా బతుకు
వెలిగి పోయేలా
నిను నిలిపి నవరాత్రులే
మైమరచి పోతాములే
మరిచేలా.. కైలాసమే
కోలాటలే… వేస్తాము లే
ఇరుకనుకోకే మండపాన్నీ
ఇరుకైనా బతుకే మాదంట
సాలనుకోవే సరిపోకుంటే
మా సిన్ని లడ్డే…
నువ్వుంటే సాలంట
కొలసగా ఉల్లాసంగా మాతో….
గజనన గణపతి
గజ ముకుడే
గం గణాగణ గం గణేశా
గం గణాగణ గం…
గం గణగణ గం గణేశా
గం గణగణ గం…
భజనతో భక్తి జూపూ
పొగిపోతాడే…
ఆ యెండి ఎన్నెల్లో
యెండి కొండల్లో
ని తల్లి ఒడిలోన
గారంగా పెరిగి
మా ఊరి సందుల్లో
మైకు సప్పుల్లో
సిందేసి ఆడేవే
కొలిచే భక్తుల్లో
ఎలుక రథమేక్కుతావు ఎలా
ఏనుగు రూపమున్నా నువ్వు
అల..
గౌరమ్మ సేత పురుడోసుకొని
గంగమ్మ ఒడి చేరుతావులే
రంగు రంగు లెగురుతుంటే
మొదలయ్యే వూరేగింపే
సిన్న పెద్ద సిందేస్తుంటే
సామి ఎవరాపే
అర వీర నమ:శ్శివాయని
ఖడ్గలే కంఠం విప్పే
అది వింటే పరమేశ్వరుడే
మాతో పాదం కదిపే…
మళ్ళొచ్చే ఈ చవితె ఇపుడే
మళ్ళొత్తే బాగుండనుకుంటా…..
గజనన గణపతి
గజ ముకుడే
గం గణాగణ గం గణేశా
గం గణాగణ గం…
గం గణగణ గం గణేశా
గం గణగణ గం…
భజనతో భక్తి జూపూ
పొగిపోతాడే…

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article