Editorial

Saturday, May 18, 2024
విశ్వ భాష‌చెట్టు : సృష్టికే పెద్దమ్మా... పదిలమే చెట్టమ్మ - వెల్మజాల నర్సింహ కవిత

చెట్టు : సృష్టికే పెద్దమ్మా… పదిలమే చెట్టమ్మ – వెల్మజాల నర్సింహ కవిత

Padmashree Saalumarada Thimmakka

వెల్మజాల నర్సింహ  

మీ పురుటి నొప్పులు

మా అమ్మలలాగే వుండవచ్చు

మీ మెుగ్గలు మా పాప బుగ్గలు కావచ్చు

మీ పిందెలు మా

పసికందులు కావచ్చు

 

మీ హృదయం చాలా విశాలం కావచ్చు

ప్రకృతికే పెద్దమ్మా

ప్రాణా వాయువులుండే చెట్టమ్మ

 

మీ తనువంతా ఔషధ మూలికలే కావచ్చు

మీ కాండలే మా ఇంటి

ముందరా గడపలు కావచ్చు

మీ వేళ్ళతొ ఎన్నో రోగాలు నయం చేయవచ్చు

 

అడవిలో చెట్టమ్మ

ఆది దైవం నువ్వేనమ్మ

 

మీ పై రాళ్ళు విసిరితే పండ్లను ఇస్తావు

మీ బిడ్డలను అడ్డంగా నరికితే చూస్తూవుంటావు

 

కీడు చేసినా వారికి కూడా మేలు చేయడం

మీ తరువాతే ఎవరైనా

సృష్టికే పెద్దమ్మా పదిలమే చెట్టమ్మ

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article