Editorial

Wednesday, May 15, 2024
సామాన్యశాస్త్రంసామాన్యశాస్త్రం : మీ ప్రాంతీయ చెట్టు ఏది?

సామాన్యశాస్త్రం : మీ ప్రాంతీయ చెట్టు ఏది?

కొండగుర్తులంటామే, అవన్నీ కనుమరుగవుతున్న కాలం ఇది. ఇంకా ఈ చెట్టు పదిలంగా నార్సింగిలో ఉండటం, దాని మొదలు నరక కుండా ఇరువైపులా రోడ్డు వేయడం మా అదృష్టం.

కందుకూరి రమేష్ బాబు 

గాయకుడు, కవి, సంగీతకారుడు భూపేన్ హజారికా గారు ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు వేదిక కింద ఉన్న వారిని ఉద్దేశించి మీ పుష్పం ఏమిటీ అని అడిగారట. ప్రతి జాతికి ఒక ప్రత్యేకమైన పువ్వు, తమ సాంస్కృతిక అస్తిత్వానికి నిదర్శనంగా ఒకటి ఉంటుంది కదా! మీదేమిటీ అని అడిగారట. ఆ సంగతి రాస్తూ ఒక చోట అల్లం నారాయణ గారు తెలంగాణాకు ‘తంగేడు పువ్వు’ అని చప్పున చెప్పలేకపోయాం అని బాధపడుతారు. మనల్ని మనం ఎంతగా కోల్పోయామో, మరెంతగా దూరమాయ్యమో అని ఆ వ్యాసంలో విచారిస్తారు. ఇది తెలంగాణ రాష్ట్రం రాక మునుపు సంగతి.

ఈ ఉదయం నార్సింగి కలియ తిరుగుతుంటే ఈ చెట్టును చూడగానే ఆ సంగతి ఎందుకో గుర్తుకు వచ్చింది.

కొండగుర్తులంటామే, అవన్నీ కనుమరుగవుతున్న కాలం ఇది. ఇంకా ఈ చెట్టు పదిలంగా నార్సింగిలో ఉండటం, దాని మొదలు నరక కుండా ఇరువైపులా రోడ్డు వేయడం మా అదృష్టం.

ఇలాంటిదే మా ఏరియాలోనే …లాంకో హిల్స్ అని నేడు చెబుతున్న పరిసరాల్లో ఒక మర్రిచెట్టు ఉన్నది. దాన్ని ‘మర్రి చెట్టు జంక్షన్’ అనే అంటాం మేం.

ఇట్లా చెట్లు ఇంకా గుర్తుల్గా ఉండటం, వాటి శాఖోపశాఖలను వెలుగు నీడల్లో చూడటం ఎంత అద్భుతం!

ఇట్లా చెట్లు ఇంకా గుర్తుల్గా ఉండటం, వాటి శాఖోపశాఖలను వెలుగు నీడల్లో చూడటం ఎంత అద్భుతం!

దాన్ని అట్లే చూస్తుంటే కొంచెం వొంగి అదేదో భూతకాల రహస్యాన్ని చెవిలో చెబుతుందా అన్న ఫీలింగ్ కలుగుతుంది. భవిశ్వత్తు వర్తమానం ఎదో వినిపిస్తుందేమో అనిపిస్తుంది.

అన్నట్టు, మీ దగ్గర ..మీ పరిసరాల్లో ఇట్లా ఏదైనా ఒక చెట్టు ఉందా ?

మీ ప్రాంతీయ చెట్టు ఏది?

More articles

2 COMMENTS

  1. 🙂 మా అమ్మవాళ్ళింటి ముందు పెద్ద చింత చెట్టు ఉండేది. ఎవరికైనా Address చెప్పటానికి అది ఒక గుర్తు. ఇప్పుడు లేదు …. ఇప్పుడు petrol bunk opposite house అయ్యింది.
    ఇప్పుడు మా ఇంటి ముందు 2 temple trees (దేవ గన్నేరు) gate కి రెండు వైపులా చాలా years back నాటాము. maybe ఎవరికైనా ఈ గుర్తు చెప్పొచ్చేమో

  2. మా బడి మైదానంలో ఒక అందమైన వృక్షం…
    అహ్లాదకర వాతావరణం కలిగిస్తూ..శాఖోప శాఖలుగా విస్తారించి ఆకాశమంత పరుచుకుంది.ఎరుపు, పసుపు, ఆకుపచ్చని హృదయాకారా పత్రాలతో హరివిల్లు లా కాంతి ని ప్రసరిస్తుంది. మా బడి పిల్లల ను తన చల్లని ఒడిలో అపురూపంగా చెర్చుకొనీ వారి ఆట, పాట, చదువు ను చూసి ప్రేమగా మురిసిపోతూ తన్మయత్మములో ఊగుతుంది. ఆ చెట్టు ను చూడగానే స్పూర్తి కలుగుతుంది.మైదానమంత విస్తరిస్తూ, ఆకాశమంత ఎడుగుతూ ఉన్నత లక్ష్యం కలిగి ఉండాలనే సందేశం ఇస్తునట్లు అనిపిస్తూంది.మా విధ్యార్థులకు బోధి వృక్షం..మా రావి చెట్టు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article