Editorial

Sunday, May 19, 2024
ప్రేమ‌Father's Day special : తండ్రీ తనయల అపురూప ప్రేమగాథ - విరాట పర్వం

Father’s Day special : తండ్రీ తనయల అపురూప ప్రేమగాథ – విరాట పర్వం

అనేక ప్రేమల పర్వం ఈ చిత్రం. ముఖ్యంగా ఉద్యమంపై బయటకు చెప్పుకోని ఒక తండ్రి ప్రేమ కథ కూడా ఇది. కారణాలు ఉండవు, ఫలితాలే ఉంటాయంటూ ఎటువంటి పరిమాణాలు ఎదురైనా సరే స్వాగతించిన ఒక బిడ్డ గాథ ఇది.

కందుకూరి రమేష్ బాబు

“నన్ను తోలుక పోయేందుకు వచ్చావా నాన్నా?” అడుగుతుంది, పోరుబాట పట్టిన వెన్నెల. అప్పటికీ ఆ అమ్మాయి పార్టీ కాంటాక్ట్ కి చేరువైంది. వెళితే ఇక తిరిగిరాని స్థితికి చేరుకున్న వైనంలో తండ్రిని అడుగుతుంది.

“లేదురా. చూసి పోదామనే వచ్చిన. అంతే…” అంటాడు బాధను పంటి బిగువున అదిమిపట్టిన తండ్రి.

అతడు ఒగ్గు కథకుడు, రాములు. ‘మా భూమి’ నుంచి మంచి పాత్రలు పోషిస్తున్న గొప్ప నటుడాయన. తాను చూసి పోదామనే వచ్చిన అని మాత్రమె కాక  “అంతే…” అనడంలో ఆ సన్నివేశంలోని విషాదం ప్రేక్షకులను మరింత కదిలిస్తుంది.

సాయి చంద్ గారు, సాయి పల్లవిలు తండ్రి బిడ్డలుగా చేసిన ఈ సన్నివేశమే కాదు, మొత్తం సినిమా ఒక అపురూప నీరాజనం. అంతరంగంలో ఉద్యమాన్ని ప్రేమించే అందరి జీవితాలకు ఇదొక touching tribute. చిత్రీకరణ కూడా ఎంత గంభీరమో అంత శాంతం.

అందరూ వొద్దు అన్నా పద్యాన్ని పట్టుకుని వేలాడినా, తన బిడ్డ తామెంత ఒద్దన్నా ఉద్యమాన్ని ప్రేమించినా అది బయటకు పిచ్చిపనే అనిపిస్తుంది. తమను పిచ్చివాళ్ళు గానే సమాజం లెక్కగడుతుంది. కానీ అంతరంగంలో అందరికీ తెలుసు, తమది పిచ్చి కాదని..

అడవి బాట పట్టిన వెన్నెల తను ఎంచుకున్న ‘ప్రేమ’ కారణంగా ఎందరికి తలవంపులు తెచ్చిందో…ఎవరెవరిని బాధ పెట్టిందో..కుటుంబానికి ఎన్ని కష్టాలు కొని తెచ్చిందో ఏకరువు పెడుతుంటే తండ్రి అంగీకరించడు. “కాదమ్మా” అంటాడు. అంటూ తాను అందరూ వొద్దు అన్నా పద్యాన్ని పట్టుకుని వేలాడినా, తన బిడ్డ తామెంత ఒద్దన్నా ఉద్యమాన్ని ప్రేమించినా అది బయటకు పిచ్చిపనే అనిపిస్తుంది. తమను పిచ్చివాళ్ళు గానే సమాజం లెక్కగడుతుంది. కానీ అంతరంగంలో అందరికీ తెలుసు, తమది పిచ్చి కాదని, అది అసాధారణమైన ప్రేమ అని. దాని విలువ అపారమని. అది గొప్ప త్యాగాలతో ముడివడి ఉన్నదనీ. అ సంగతే చెబుతాడు తండ్రి. జీవితాలను ఒక లక్ష్యం కోసం అంకితం చేయడంలోని అసమాన్య  ఒదార్యాన్ని, నిఖార్సైన నిబద్దతను, వేల కట్టలేని త్యాగాలను అయన చెప్పకనే చెబుతూ ఆ సందర్భంగా వెన్నెల ఎంచుకున్న దారిని, ఆమె నిర్ణయాన్ని తాను గౌరవిస్తున్నానని అంటాదు. అంతేకాదు, ఆ అమ్మాయిని ‘వెళ్ళు’ అనే అంటాడు. వెళ్ళమనే తాను గొంతెత్తి పాడుతాడు.

“వెళ్లేముందు ఒక పద్యం పాడు నాన్న” అంటే తను ఆ బిడ్డ తల నిమిరుతూ గొప్పగా పాడుతాడు. ఆ పాట పూర్తయ్యేలోగా తన స్వప్నమైన వెన్నెల రవిని చేరుకునేందుకు దట్టమైన అడవిలోకి ప్రవేశిస్తుంది. దాంతో ఇక కథ ఉద్విగమైతుంది.

సరళ రేఖలా సాగవలసిన తమ జీవితాలు వక్ర రేఖలుగా మారడానికి గల నేపథ్యం తెలుపు మహత్తర ప్రేమ గాథ ఇది. తల్లిదండ్రులు తొంభయ్యవ దశకం తర్వత పుట్టిన తమ పిల్లలకు, ముఖ్యంగా ఆడ బిడ్డలకు చూపించాల్సిన సినిమా ఇది.

చూడండి, విరాట పర్వం. ఇదొక ఒక హృద్యమైన ప్రేమగాథ. అనేక పార్వ్వాల్లో చెప్పిన ప్రేమ కథల చిత్రం.

తెలంగాణా పల్లెలలో భూస్యామ్యం, పోలీసు నిర్భంధం, ఉద్యమ అణచివేత కోసం మారిన రాజ్యం పోకడలు…అప్పుడే తొలిగా వచ్చి చేరిన కోవర్టు ఆపరేషన్లు, ఆ క్రమంలో ఒక విప్లవ కవి, సాయుధ దళ నేతా ‘అరణ్య’ ఆశయంలో ‘మైదానం’ లీనమైన వైనం ఈ చిత్రం. అది నిజ జీవితం. స్పూర్తిదాయాకంగా  మలిచిన తీరు హృద్యం. ఇది పెద్దలు పిల్లలతో చూడవలసిన చిత్రం. ముఖ్యంగా తెలంగాణాలో జన్మించిన తల్లిదండ్రులు తొంభయ్యవ దశకం తర్వత పుట్టిన తమ పిల్లలకు, ముఖ్యంగా ఆడ బిడ్డలకు చూపించాల్సిన సినిమా ఇది. సరళ రేఖలా సాగవలసిన తమ జీవితాలు వక్ర రేఖలుగా మారడానికి గల నేపథ్యం తెలుపు మహత్తర ప్రేమ గాథ ఇది.

మీ పిల్లలకు చారిత్రక నేపథ్యం తెలుపడానికి ఒక అందమైన అవకాశం ఈ చిత్ర సందర్శన అంటే అది అతిశయోక్తి కాదని చూశాక మీరే చెబుతారు.

దశాబ్దాల ఉద్యమ చరితలో నిండు చందమామపై అంటిన ఒకానొక నలుపు మరకను చిత్రంలో దర్శిస్తాం. వెన్నెల పాత్ర పోషించిన సరళ మన కళ్ళ ముందు మెదులుతుంది.

తండ్రి పాడిన పాట తర్వాత వెన్నెల అడవిలోకి వెళ్ళిపోతుంది. ఆనందరం అసలైన ‘విరాట పర్వం’ మొదలవుతుంది. దశాబ్దాల ఉద్యమ చరితలో నిండు చందమామపై అంటిన ఒకానొక నలుపు మరకను చిత్రంలో దర్శిస్తాం. వెన్నెల పాత్ర పోషించిన సరళ మన కళ్ళ ముందు మెదులుతుంది. ఆమెను కాపాడటానికి వీలుకాని ఒక ప్రేమ కథ ఇది.

మరి చూడండి. తెలంగాణాకే సొంతమైన ఒకానొక రహస్య ఉద్యమ నేపథ్యంలో ఇక్కడ నక్సలైట్లు, పోలీసుల ఎదురు కాల్పుల్లో పుట్టిన ఒక ఆడ బిడ్డ కథ ఇది. ఉద్యమలోకి వెళ్ళిన ఆమె కడపటి జీవితమూ ఆ క్రమంలో ఆగమైన తండ్రులూ బిడ్డల గాథ ఇది. కర్శశంగా తెగిన ఒక పేగు బంధం గాథ ఇది.

చరిత్ర వలే విషాదమూ ఒక ప్రేమనే.

చూస్తున్నది ప్రేక్షకులు కాదు. గతానికి సాక్ష్యీభూతాలు అన్న స్పృహతో ఈ కథనం.

ఫాదర్స్ డే శుభాకాంక్షలతో…

చిత్రాన్ని కన్న వేణు ఊడుగులకు, చిత్ర యూనిట్ కు, ఈ చిత్రాన్ని వీక్షిస్తున్న తల్లిదండ్రులకు, బిడ్డలకు అందరికీ…

‘విరాట పర్వం’ కథకు మూలమైన కథనం తెలుపు ప్రత్యేకం ఇక్కడ చదవండి.

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article