Editorial

Saturday, May 18, 2024
ఆరోగ్యంనాగుల చవితి - పుట్టలో పాలు : పాముల సంఖ్య పెరగకుండా...

నాగుల చవితి – పుట్టలో పాలు : పాముల సంఖ్య పెరగకుండా…

నాగుల చవితి రోజున పాలు పోయడంలో శాస్త్రీయ విజ్ఞానం గురించి సేంద్రియ వ్యవసాయం చేస్తూ పర్యావరణం గురించి కృషి చేస్తున్న విజయరాం ఇలా పేర్కొన్నారు. “పాములు పాలు త్రాగవు. కానీ పాలను మట్టిలో చల్లడం వల్ల వాటి సంఖ్య నియంత్రణలో ఉంటుంది. ఇదొక సాంప్రదాయంగా మారడం వెనుక విజ్ఞానం ఉందంటూ అయన ఇలా వివరించారు.

విజయరాం

మేటింగ్ సమయంలో ఆడ పాములు వదిలే రసాయనాలు (pheramones) మగ పాములను ఆకర్షిస్తాయి. ఆ రసాయనాల సాంద్రతను తగ్గించడంలో పాము పుట్ట వద్ద పాలు పోయడం ఒక విజ్ఞానంగా ఉంది.

ఆవు పాలు ఒక ప్లేటులో పోసి ఉంచడం వల్ల ఆ పాలు రసాయనాల సాంద్రతను తగ్గిస్తాయి. ఒకరకంగా ఆ వాసనను తటస్టికరణము చేస్తాయి. దాంతో అది పాములను మేటింగ్ కు దూరంగా ఉంచే అవకాశం ఉంది. ఈ చర్య పాముల సంఖ్య పెరగకుండా కాపాడే ఒక సహజమైన ప్రక్రియగా కూడా చూడవచ్చు.

ఆ పాముల సంఖ్య నియంత్రణ కోసం రైతులు నాలుగు గంటల పాటు ఒక పళ్ళెములో ఉంచిన ఆవు పాలను పాములు తిరిగే ప్రదేశాలలో ఉంచడం, ఆ పాలను చల్లే అలవాటు ఉండేది.

వ్యవసాయాన్ని ఆధారం చేసుకుని అత్యధిక ప్రజానీకం జీవిస్తున్న రోజుల్లో నేటి మాదిరి రసాయనాల వాడకం లేకపోవటం వలన అన్ని జీవులూ బతకడానికి అవకాశం ఉండేది. అలా పొలం  దగ్గరి చెరువులో కప్పలు, జలగలు, చేపలు లాంటి జీవులు అధికంగా ఉండేవి. పొలంలోని ఆ మట్టిలో వాన పాములు, నత్తలు, పేడ పురుగులు అధికంగా ఉండేవి. పొలంలో ఆకుల మధ్య సాలే పురుగులు, పువ్వుల మీద సీతాకోక చిలుకలు, ఇతర కీటకాలు, తూనీగలూ తిరుగుతూ ఉండేవి. అలానే అక్కడక్కడ పొలాలకు దగ్గరలో పాము పుట్టలూ ఉండేవి. ఆ పాముల సంఖ్య నియంత్రణ కోసం రైతులు నాలుగు గంటల పాటు ఒక పళ్ళెములో ఉంచిన ఆవు పాలను పాములు తిరిగే ప్రదేశాలలో ఉంచడం, ఆ పాలను చల్లే అలవాటు ఉండేది.

జీవన వివిధ్యం కోసం

ఎండా కాలం నాటికి పాముల సంఖ్య తగ్గుతుంది. ఆ రోజుల్లో ఆహారం కొరత వలన పాములు, కప్పలు నిద్రావస్థలోకి (Brumation) వెళ్లిపోతాయి. వానా కాలం మొదలయినప్పటి నుంచి కప్పలు పాములు ఈ సుప్తావస్థ స్థితిని దాటి ఎక్కువ సంఖ్యలో పెరుగుతాయి.

వానా కాలంలో నీటిలో పురుగులు, కప్పలు కూడా పెరుగుతాయి. అలా పాములు కూడా అధిక సంఖ్యలో పెరుగుతాయి. పాముల సంఖ్య నియంత్రణ కోసం ఇలా పాలును చల్లడము ఒక పద్ధతిగా ఉండేది.

మన పూర్వీకులు జీవ వైవిద్యం  గురించి ఆలోచించి ఇలాంటి ఒక సాంప్రదాయాన్ని అలవార్చుకున్నారని భావించాలి.

జులై నెలలో నాగ పంచమి, అక్టోబర్/ నవంబర్ నెలలో నాగుల చవితి, డిసెంబర్ నెలలో సుబ్రమణ్య షస్థి సమయాల్లో సహజంగా పాముల నియంత్రణ కోసం ప్రాంతాలను బట్టి ఇలా మట్టిలో పాలు పోయడం ఒక సంప్రదాయంగా ఉంది. ఇది పూర్వము వ్యవసాయ ఆధారిత జీవనంలో ఒక భాగంగా మనం గమనించాలి. మన పూర్వీకులు జీవ వైవిద్యం  గురించి ఆలోచించి ఇలాంటి ఒక సాంప్రదాయాన్ని అలవార్చుకున్నారని భావించాలి.

పాముల బెడద అధికముగా ఉన్న పొలాల్లో గట్ల మీద రెండు లేక మూడు పళ్ళేలలో ఆవు పాలు పోసి, నాలుగు గంటల పాటు ఉంచి తరువాత వాటిని పుట్టలు లేదా పొలము గట్ల దగ్గరలో చల్లడం అందుకే. ఐతే, పాములు పాలను త్రాగవని గుర్తించాలి.

దైవ స్వరూపంగా…

ఐతే, ప్రకృతి మానవ మనుగడకు జీవనాధరమైంది కనుక దానిని దైవస్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని -ఇలా సమస్త ప్రాణికోటిని దైవస్వరూపంగా చూసుకొంటూ పూజిస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే నాగుపామును కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారని సాధారణంగా పెద్దలు చెబుతారు.

భూసారాన్ని కాపాడుతూ రైతుకు అండగా…

ఈ పాములు భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి నీటిని ప్రసాదించే దేవతలుగా పెద్దలు తలచేవారు. ఇవి పంటలను నాశనంచేసే క్రిమికీటకాదులను తింటూ, పరోక్షంగా రైతుకు పంటనష్టం కలగకుండా చేస్తాయి. అలా పాములు ప్రకృతి పరంగా సహాయపడుతూ ఉంటాయి. అయితే అ పాముల సంఖ్య పెరగకుండా చూసుకునే ఒక ప్రయత్నంగా పాము పుట్టలో పాలు పోయడం సంప్రదాయకంగా ఉంది.

మానవునిలో ఉన్న విషసర్పం శ్వేతత్వం పొందాలని…

మరొక అంశం కూడా పెద్దలు చెబుతారు. మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ‘వెన్నుబాము’ అని అంటారు. అందు కుండలినీశక్తి మూలాధారచక్రంలో ‘పాము’ ఆకారమువలెనే వుంటుందని ‘యోగశాస్త్రం’ చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ! కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ, మానవునిలో ‘ సత్వగుణ’ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పపుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొందుతుందని, ఇది కూడా ఒక అంతర్యమని చెప్తారు.

పుట్టలో పాలు పోయడం గురించి మరింత అవగాహనకోసం మీకు తెలిసిన సమాచారం, పెద్దలు చెప్పినవి కింద…కామెంట్ బాక్స్ లో ( LEAVE A REPLY అని ఉంటుంది ) పంచుకోగలరని మనవి
– ఎడిటర్

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article