Editorial

Saturday, May 18, 2024

TAG

Riddle

ఐదుగురిలో చిన్నోడు!

ఐదుగురిలో చిన్నోడు, పెళ్ళికి మాత్రం పెద్దోడు చిటికెన వేలు

దాని పువ్వు పూజకు రాదు. దాని ఆకు దొప్పకు రాదు. దాని పండు అందరు కోరు? చింతపండు

ఎందరు ఎక్కినా విరగని మంచం?

ఎందరు ఎక్కినా విరగని మంచం. ఏమిటది? అరుగు  

లతల మీద వ్రేళ్ళు లాస్యమాడుచునుండు…

కాయ మీది మాను, కడు రమ్యమై ఉండు మాను మీద లతలు మలయుచుండు లతల మీద వ్రేళ్ళు లాస్యమాడుచునుండు దీని భావమేమి తిరుమలేశ ! వీణ  

వెండి గిన్నెలో …

వెండి గిన్నెలో దాగిన బంగారం? కోడి గుడ్డు

పొడుపు కథ తెలుపు

నీటితో పంట - ఆకు లేని పంట ఉప్పు

చినుకుల వేళలో విడుపు ఈ పొడుపు కథ

పొడుపు చిటపట చినుకులు చిటారి చినుకులు ఎంత కురుసినా వరదలు రావు కన్నీళ్లు

మరేమిటో తెలుపు

పదములారు కలవు బంభరంబు  కాదు, తొండం ఉంది గాని దోమకాదు, రెక్కలుండు  గాని పక్షి  కానేరదు- అయితే మరేమిటి? ఈగ

చక్రం – శంఖం

పల్లె ప్రజల పాండిత్య ప్రకర్షకు నిదర్శనం పొడుపు కథలు. నేటి పొడుపు కథ చూడండి... అడ్డం కోస్తే చక్రం - నిలువు కోస్తే శంఖం ఉల్లిపాయ  

యువకులకు అపురూపము, అందరికీ ఇష్టము?

పిల్లలకు ఉచితము! పెద్దలకు బహుమానము!! యూవతీ యువకులకు అపురూపము, అందరికీ ఇష్టము? ముద్దు

Latest news