Editorial

Friday, May 10, 2024
సంపాద‌కీయంప్రజలను చదువు : తెలుపు సంపాదకీయం

ప్రజలను చదువు : తెలుపు సంపాదకీయం

సాహిత్యాభిరుచిని కేవలం పుస్తకాలు కొనుగోళ్ళు అమ్మకాల వ్యవహారంగా చూడరాదనీ, అది ఒక అభిరుచితో మాత్రమే కాదు, బాధ్యతా కర్తవ్యంతో  కూడిన విలువ అని, అందులో నిరాటంకమైన ఎందరి కృషో ఇమిడి ఉన్నదనే సోయితో తెలుపు సంపాదకీయం ఇది.

కందుకూరి రమేష్ బాబు 

తెలుగు భాష, తెలుగు సమాజం, తెలుగు ప్రచురణలు అంటూ దశాబ్దాలు కష్టపడి కూడా భంగ పడ్డామని బాధ పడే వారిని చూస్తే జాలి కలుగుతుంది. వారు ఎంత గొప్పవారైన కావొచ్చు, కానీ తమ ఆలోచనకు, తమ కార్యశీలతకు తామే విక్తిమ్స్ అయ్యారు తప్ప మరొకటి కాదు. నిందించి ప్రయోజనం లేదు.

ప్రచురణ ఒక బాధ్యత. కర్తవ్యం. పాలకులు, పాఠకులతో కాకుండా స్వీయ నిర్ణయంతో ముందుకు నడిచే ఒక అసాధారణ ప్రస్తానం.. అందులో ఎవరి త్రోవ వారిది. ముఖ్యంగా డబ్బు అన్న అంశంతో చూస్తే అది ముందుకు సాగని అంశం.

ఒక నాడు మూడువేల ఇదొందల కాపీలు వేసే ప్రచురణ కర్త నుంచి కేవలం ఒక పుస్తకాన్ని కేవలం రెండు వందలు ప్రచురించి ప్రచురణకర్తగా పేరు ప్రఖ్యాతి సంపాదించుకున్న వారూ స్వయంగా నాకు తెలుసు. ఎవరు ఆదర్శాలు వారివి.

ప్రభుత్వం మనుషులను ఎట్లా ఓటర్లుగా లబ్ది దారులుగా చూస్తున్నదో ప్రచురణ కర్తలు సైతం మనుషులను పాఠకులుగా చూడటం వల్ల ఈ సమస్య. తాము సైతం మనుషులను వినియోగదారులుగా భావించడం వళ్ళ ఈ దుస్థితి. ప్రచురణను డబ్బుతో ముడివడి ఉన్న అంశంగా మార్చడం వల్లే ఈ సమస్య.

అదృష్టవశాత్తూ పాత్రికేయంలో ఉన్నందున. గతంలో ఒక పత్రికలో ఆదివారం సంచిక కూడా నిర్వహింఛి ఉన్నందున కవులు, రచయితలు అలాగే ప్రచురణ కర్తలు ఎలా ఉంటారో కూడా తెలుసు.

పుస్తకాల అమ్మకాలు గీటురాయిగా ప్రచురణ లోతుపాతులను, విలువను అంచనా కడుతూ ( అదే ప్రధాన అంశంగా ) తమను తాము కించ పరుచుకుంటే జాలి కలుగుతుంది. విమర్శ చేస్తే నవ్వు వస్తుంది.

భాష అవసాన దశకు చేరుకున్నదనడం, ప్రచురణల వల్లే దాన్ని బతుకించే ప్రయత్నం జరుగుతుందనుకోవడం రెండూ అధిక ప్రసంగమే.

సామాజిక మాధ్యమాల్లో లైకులు కొట్టుకోవడం, జూమ్ మీటింగులు పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ కవులు, రచయితలను నిందాపూర్వకంగా ఎద్దేవా చేయడం హాస్యాస్పదం.

ప్రభుత్వం మనుషులను ఎట్లా ఓటర్లుగా లబ్ది దారులుగా చూస్తున్నదో ప్రచురణ కర్తలు సైతం మనుషులను పాఠకులుగా చూడటం వల్ల ఈ సమస్య. తాము సైతం మనుషులను వినియోగదారులుగా భావించడం వళ్ళ ఈ దుస్థితి. ప్రచురణను డబ్బుతో ముడివడి ఉన్న అంశంగా మార్చడం వల్లే ఈ సమస్య.

కాలక్రమంలో ప్రజలతో మమేకం కాకుండా కార్యాలయాల నుంచి ప్రచురించే రచనలు, అమ్మకాలూ ఇలాగే ఉంటాయి.

తామే సమస్య. ప్రజలు గొప్పవాళ్ళు.

తమ మానాన తాము బతుకుతున్నారు. తమకు తోచినంత చదువుతున్నారు.

ప్రజలే గ్రంధాలయం. ఇంకా అందులోకి పోలేని ప్రచురణకర్తల వైఫల్యాలు ప్రజల వైఫల్యాలు కానేకావు.

 

 

More articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article