Editorial

Thursday, May 1, 2025
కాల‌మ్‌విభిన్నం : తండ్రులూ కొడుకులూ...

విభిన్నం : తండ్రులూ కొడుకులూ…

 

MY FATHER SERIES -1

“సగటు తండ్రిలా అలోచించక పోవడమే మా నాన్న గొప్పతనం”

కందుకూరి రమేష్ బాబు

తొమ్మిది లక్షలు. పది లక్షలా అన్నది కాదు. అది అంతకన్నా పెద్ద మొత్తం. ఏండ్ల సంపాదన. కష్టార్జితం. చెమటోడ్చి సంపాదించిన ఆస్తిపాస్తుల కిందే లెక్క. అంత మొత్తాన్ని నష్టపోయి, కోలుకొని విధంగా దెబ్బతిన్న వైనం అది. ఇంటికి ముఖం చూపలేక నగరంలోనే ఉన్న రోజులు. నిస్సహాయ స్థితి. ఆ సంగతి తండ్రికి తెలుస్తుంది. ఒకసారి తప్పకుండా వచ్చిపోరా అని కబురు పెడుతాడు. ఎంతో వ్యధతో ఇంటికి వెళతాను కొడుకు.

తండ్రికి తెలుసు, తన కొడుకు ఆత్మవిశ్వాసం గురించి. కొడుకు సమర్థత మీద ఆయనకు అపార విశ్వాసం.
విచారంతో కృంగిపోయిన కొడుకుకు తన పట్ల తనకు నమ్మకం కలిగించాలీ అనుకుంటాడు. రాగానే దగ్గరకు తీసుకొని ఒకే ఒక మాట, ఎంత తేలికగా చేబుతడూ అంటే విన్న కొడుకు తండ్రి దృక్పథం ఎంత గంభీరమైనదో మరెంత విశాలమైనదో తెలిసి విభ్రాంతికి లోనవుతాడు. నిజానికి అది ఎంత సామాన్యం!

పోగొట్టుకున్నది ఎంత మొత్తమో అడగలేదు. ఎలా పోగొట్టుకున్నడో తెలుసుకోలేదు. కానీ అత్యంత సామాన్యంగా ఆ ప్రశ్న వేశాడు?

సమాజంలోని సగటు తండ్రిలా అయన ఏదీ అడగలేదు. పోగొట్టుకున్నది ఎంత మొత్తమో అడగలేదు. ఎలా పోగొట్టుకున్నడో తెలుసుకోలేదు. కానీ అత్యంత సామాన్యంగా ఆ ప్రశ్న వేశాడు?  “అరేయ్. ఎందుకురా అంత బాధ! ఆ డబ్బులు నువ్వు సంపాదించినవే కదా!” అంటాడు తండ్రి.

అవునని తల పంకిస్తే, “మరింకేందిరా? నువ్వు సంపాదించినవే కదా?” అని ప్రశ్నించినట్టు సమాధాన పరిచే మాట చెబుతూ “ఎవరి డబ్బులో పోగొట్టినట్టు ఎందుకురా అంత బాధ” అంటాడు చిరునవ్వుతో.

“నువ్వే సంపదించినవ్. నువ్వే పోగొట్టుకున్నవ్. దానికి ఇంత రంది ఇందిరా?” అని ఒక్క సారి గుండెలోని బాధను చేత్తో తెసేసినట్టు తీసేసి బిడ్డను పక్షిలా ఎగిరేందుకు రెండు రెక్కలూ తిరిగి అందిస్తాడు, ఎదకు గట్టిగా హత్తుకుని.

చిత్రమేమిటంటే, ఇంత ఒపికకి కారణం ఏమిటీ అంటే తన తండ్రే అంటారాయన. తాను విభిన్నం అన్నది అతడి అంతరార్థం.

నిండు ఆత్మవిశ్వాసంతో తిరిగి భాగ్య నగరానికి తిరిగి వచ్చిన ఆ యువకుడు అమిత విశ్వాసంతో ముందుకు పయనిస్తున్నాడు. సినీ రంగంలో గొప్ప కథకుడిగా రాణించేందుకు ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడం లేదు. అద్భుతమైన దర్శకుడిగా వెండితెరపై సంతకం చేయడానికి తగిన సమయం వస్తుందన్న నమ్మికతో ప్రశాంతంగా పని చేసుకుంటున్నాడు. చిత్రమేమిటంటే, ఇంత ఒపికకి కారణం ఏమిటీ అంటే తన తండ్రే అంటారాయన. తాను విభిన్నం అన్నది అతడి అంతరార్థం.

ఆ మాటే చెప్పారు. “సమాజంలోని అందరి తండ్రుల వంటి వాడు కాదు మా నాన్న” స్థిరంగా అన్నారాయన. ఆ మాటల్లో తాను చేసేవి కూడా సగటు కథలు కాదన్న ధ్వని వినిపించింది.

తండ్రులూ కొడుకులకు అభినందనలు.

మిత్రులు ‘మల్లి’ అని ఆప్యాయంగా పిలుచుకునే కందుకూరి మల్లిఖార్జున్

 

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article